భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో మరో కొత్త ఖరీదైన కారును ప్రవేశపెట్టబోతోంది. వచ్చే వారంలో దేశీయ విపణిలో మేబాక్ జిఎల్‌ఎస్ 600 అల్ట్రా లగ్జరీ ఎస్‌యూవీని విడుదల చేయనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ప్రకటించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం రండి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

మేబాక్ అనేది మెర్సిడెస్ బెంజ్ యొక్క ఆల్ట్రా లగ్జరీ కార్ బ్రాండ్, ఈ బ్రాండ్ పేరుతో కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలాసవంతమైన మరియు ఖరీదైన కార్లను తయారు చేస్తుంటుంది. మెర్సిడెస్-మేబాక్ లైనప్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎస్‌యూవీ ఈ జిఎల్‌ఎస్ 600. దీనిని తొలిసారిగా 2019లో ఆవిష్కరించారు. గతేడాది పలు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టారు.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

మెర్సిడెస్-మేబాక్ జిఎల్ఎస్ 600 భారత మార్కెట్లోకి రాబోతున్న కొత్త వేరియంట్ అవుతుంది. స్టాండర్డ్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600తో పోలిస్తే, ఈ మేబాక్ వెర్షన్ అల్ట్రా-లగ్జరీ ఎస్‌యూవీలో అనేక మార్పులు ఉంటాయి. ఈ స్పెషల్ జిఎల్‌ఎస్ 600 మేబాక్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో పలు బెస్పోక్ ఫీచర్స్ మరియు మెటీరియల్స్ ఉంటాయి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

మెర్సిడెస్-మేబాక్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ ఉంటాయి. వీటిలో పెద్ద వెర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, ముందు మరియు వెనుక బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ ఉన్నాయి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

ఈ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో పెద్ద 22 ఇంచ్ లేదా 23 ఇంచ్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫిని చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, 'మేబాక్' బ్రాండ్ చిహ్నం మొదలైన ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

మేబాక్ జిఎల్ఎస్ 600 ఇంటీరియర్ ఫీచర్లను గమనిస్తే, ఇదివరకు చెప్పుకున్నట్లుగా, ఈ ఎస్‌యూవీ బెస్పోక్ మెటీరియల్ మరియు ఫీచర్లను కలిగి ఉంటుంది. వెనుక సీట్లలో గరిష్ట లగ్జరీ కోసం పూర్తి పవర్ ఆపరేటెడ్ రిక్లైనింగ్ లెథర్ సీట్లను ఆఫర్ చేయనున్నారు. ఈ సీట్లు వెంటిలేషన్‌తో పాటుగా మసాజింగ్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంటాయి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

వెనుక సీటులోని ప్రయాణీకుల అనుభవాన్ని మరింత విలాసంగా మరియు వినోదాత్మకంగా మార్చేందుకు ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్స్ కూడా ఉంటాయి. వెనుక వైపు మధ్యలో అమర్చిన టాబ్లెట్ స్క్రీన్ సాయంతో వెనుక సీట్లలోని ప్రయాణీకులను కారులోని వివిధ అంశాలను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

అంతేకాకుండా, వెనుక వరుసలో ఫోల్డింగ్ టాబ్లెట్స్ మరియు రిఫ్రిజిరేటర్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇంకా ఇందులో పెద్ద పనోరమిక్ మూన్‌రూఫ్, 12.3 ఇంచ్ ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 64 రంగులతో కూడిన ఎల్ఈడి ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్ వంటి మరిన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

ఈ కారులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో ఇ-యాక్టివ్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది కెమెరా ద్వారా రహదారిని స్కాన్ చేసి, దానికి అనుగుణంగా సస్పెన్షన్‌ను ఆటోమేటిక్‌గా సర్దుబాటు చేస్తుంది. ఈ ఫీచర్ వలన ఈ ఆల్ట్రా-ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో డ్రైవింగ్ అనుభూతి చాలా అల్ట్రా స్మూత్‌గా అనిపిస్తుంది.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

ఇంజన్ విషయానికి వస్తే, మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో శక్తవంతమైన 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి శక్తిని మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

భారత్‌లో మెర్సిడెస్-మేబాక్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీ విడుదల ఖరారు

ఈ కారులోని ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు ఈ కారు గరిష్ట వేగాన్ని యాంత్రికంగా గంటకు 250 కిలోమీటర్లకు మాత్రమే పరిమితం చేశారు.

Article Published On: Wednesday, June 2, 2021, 14:28 [IST]
English summary
New 2021 Mercedes-Maybach GLS600 India Launch Confirmed, Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+