కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఇదివరకు భారత మార్కెట్లో విక్రయించిన ఆక్టేవియా సెడాన్‌లో ఓ కొత్త తరం మోడల్‌ను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. తాజా సమాచారం ప్రకారం, మరో రెండు నెలల్లోనే ఈ కొత్త 2021 స్కొడా ఆక్టేవియా భారత్‌లో విడుదల కానుంది.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

ఈ విషయాన్ని స్కొడా ఆటో సీఈఓ జాక్ హోలిస్ ధృవీకరించారు. ఇప్పటికే కొత్త స్కొడా ఆక్టేవియా కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయ త్రైమాసికంలో ఈ కారును లాంచ్ చేయనున్నట్లు హోలిస్ తెలిపారు.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

భారత్‌లో బిఎస్6 కాలుష్య నిబంధనల తర్వాత పాత తరం స్కొడా ఆక్టేవియా అమ్మకాలను నిలిపివేశారు. స్కొడా ఇటీవలే యూరోపియన్ మార్కెట్లలో కొత్త తరం ఆక్టేవియా కారును విడుదల చేసింది. మునుపటి తరంతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మోడల్ మరింత ప్రీమియంగా కనిపిస్తుంది.

MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా కారులో ఉపయోగించబోయే ఇంజన్‌కు సంబంధించిన సమాచారాన్ని కూడా స్కొడా ఇటీవలే వెల్లడి చేసింది. ఇందులో 1.5-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ మరియు 2.0-లీటర్ టిఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లను ఆఫర్ చేయవచ్చని సమాచారం.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

వీటిలో మొదటి ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్‌ను మరియు 250 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, రెండవ ఇంజన్ గరిష్టంగా 190 బిహెచ్‌పి పవర్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, కొత్త తరం స్కొడా ఆక్టేవియా మునుపటి కన్నా తక్కువ బరువును కలిగి ఉంటుందని సమాచారం. ఫలితంగా, ఈ కారు కేవలం 8.33 సెకన్లలోనే గంటకు 0-100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

డిజైన్ గురించి మాట్లాడితే, కొత్త తరం స్కొడా ఆక్టేవియాలో క్రోమ్ హౌసింగ్‌తో కూడిన బటర్‌ఫ్లై గ్రిల్‌ను ఉపయోగించారు. ఇంకా ఇందులో కొత్త అల్లాయ్ వీల్స్ డిజైన్, ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌ను కూడా ఉపయోగించారు. కారు వెనుక భాగంలో, బూట్ లిడ్‌పై పెద్ద అక్షరాలతో ముద్రించబడిన 'స్కొడా' బ్యాడ్జింగ్ ఇందులో మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

MOST READ:ఈ బుజ్జి కారుకి 4 రోజుల్లో రూ.7.5 కోట్ల ఆర్డర్లు; ఇది ఎక్కడో కాదు మనదేశంలోనే..!

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

ఇంటీరియర్ ఫీచర్లలో ఎగ్జిక్యూటివ్ క్యాబిన్ లేఅవుట్, పెద్ద ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీ ఫంక్షనల్ 2-స్పోక్ స్టీరింగ్ వీల్ మరియు ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

భారతదేశంలో బిఎస్6 ఉద్గార నిబంధనలను అమలు చేసిన తరువాత, స్కొడా ఆటో దేశంలో అన్ని డీజిల్ మోడళ్లను నిలిపివేసింది, ఇప్పుడు కంపెనీ భారతదేశంలో ఎలాంటి డీజిల్ కార్లను విక్రయించడం లేదు. స్కోడాతో పాటు దాని అనుబంధ సంస్థ అయిన ఫోక్స్‌వ్యాగన్ కూడా దేశంలో డీజిల్ కార్ల అమ్మకాలను నిలిపివేసింది.

MOST READ:ఒకరిపై ఒకరు కూర్చుని ప్రమాదకరమైన బైక్ స్టంట్స్ చేసిన యువతులు [వీడియో]

కొత్త 2021 స్కొడా ఆక్టేవియా లాంచ్ డీటేల్స్ వెల్లడి!

ఇదిలా ఉంటే, స్కొడా ఆటో తమ ఇండియా 2.0 ప్రాజెక్ట్‌లో భాగంగా, భారత్‌లో తమ మొట్టమొదటి ఉత్పత్తి కుషాక్‌ను రేపు (మార్చి 18న) విడుదల చేయనుంది. ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Most Read Articles

Read more on: #స్కొడా #skoda
English summary
New 2021 Skoda Octavia Launch Details Revealed. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X