Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

భారత ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata Motors) బ్రిటీష్ లగ్జరీ కార్ బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (Jaguar Land Rover)ను సొంతం చేసుకున్న తర్వాత నుండి, ఇరు కంపెనీల ఉత్పత్తులు మరియు వ్యాపారణంలో గణనీయమైన వృద్ధి కనబడింది.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

బ్రిటీష్ ఇంజనీర్ల సహకరంతో Tata Motors ఇటీవలి కాలంలో భారతదేశంలో అత్యుత్తమ కార్లను విడుదల చేసింది. ఇండికా, ఇండిగో, ఆరియా వంటి కార్లకు చరమగీతం పాడి టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, నెక్సాన్ మరియు హారియర్ వంటి కార్ల పరిచయంతో కంపెనీ ఓ కొత్త శ్రేణి ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు పరిచయం చేసింది.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

Tata Motors నుండి వచ్చిన ఈ కొత్త మోడళ్లన్నీ కూడా డిజైన్, టెక్నాలజీ, ఫీచర్స్ మరియు సేఫ్టీ పరంగా మునుపటి మోడళ్ల కన్నా ఎన్నో రెట్లు అడ్వాన్స్డ్‌గా ఉన్నాయి. ఈ కంపెనీ తమ వాహనాల నాణ్యత విషయంలో ఎక్కడా కూడా రాజీ పడటం లేదు. పైగా ఇప్పుడు ఈ Tata బ్రాండ్ దేశంలోనే అత్యంత సురక్షితమైన వాహనాలను తయారు చేస్తున్న బ్రాండ్‌గా అవతరిస్తోంది.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

ఈ బ్రాండ్ నుండి లభిస్తున్న Nexon ఎస్‌యూవీ, గ్లోబల్ ఎన్‌క్యాప్ (Global NCAP) క్రాష్ టెస్టులో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొంది, మార్కెట్లో అత్యంత సురక్షితమైన కార్లలో బెస్ట్ ఛాయిస్‌గా కొనసాగుతోంది. తాజాగా, ఈ కంపెనీ ప్రవేశపెట్టిన Tata Tigor EV కూడా అదే గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో 4 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

దీన్నిబట్టి చూస్తుంటే, Tata Motors ధృడమైన కార్లకు కేర్ ఆఫ్ ఆడ్రస్‌గా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన రెండవ మరియు లేటెస్ట్ ఎలక్ట్రిక్ కార్ Tigor EV కోసం గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ నిర్వహించింది. ఈ క్రాష్ టెస్టులో Tigor EV మొత్తం 5 స్టార్లకు గాను 4 స్టార్ల రేటింగ్‌ను దక్కించుకొని, సురక్షితమైన కారుగా నిలిచింది.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ ఫలితాల ప్రకారం, ఇందులో Tata Tigor EV వయోజన రక్షణలో 17 పాయింట్లకు గాను 12 పాయింట్లు మరియు పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 37.24 పాయింట్ల స్కోర్‌ను సాధించింది. ఈ కారు వయోజనులు మరియు పిల్లల ప్రయాణీకులకు తల మరియు ఛాతీ రక్షణలో మంచి పనితీరును కనబరిచినట్లు ఏజెన్సీ తెలిపింది.

అయితే, బాడీషెల్ ఫుట్‌వెల్ ప్రాంతంలో మాత్రం ఈ కారు అస్థిరంగా ఉందని గ్లోబల్ ఎన్‌క్యాప్ ఏజెన్సీ పేర్కొంది. భారతదేశంలో 'సేఫ్ కార్స్ ఫర్ ఇండియా' కార్యక్రమం కింద పరీక్షించబడిన 44 వ కారు మరియు Tata Motors యొక్క 8 వ కారు ఈ Tigor EV కావటం విశేషం.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

మార్కెట్లో కొత్త Tata Tigor EV విడుదల

జిప్‌ట్రాన్ (Ziptron) టెక్నాలజీతో రూపొందించిన సరికొత్త 2021 Tata Tigor EV ని కంపెనీ నేడు (ఆగస్ట్ 31, 2021వ తేదీన) భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ కారు ప్రారంభ ధర రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

కొత్త Tigor EV XE, XM మరియు XZ+ అనే మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు రూ. 21,000 టెకనో అడ్వాన్స్ చెల్లించి ఈ ఎలక్ట్రిక్ కారును బుక్ చేసుకోవచ్చు. త్వరలోనే ఈ కారు డెలివరీలు కూడా ప్రారంభం కానున్నాయి. కొత్త 2021 Tata Tigor EV టీల్ బ్లూ, డేటోనా గ్రే అనే రెండు కలర్ అప్సన్స్‌లో లభిస్తుంది.

Tata Tigor EV వేరియంట్లు, ధరలు:

 • Tigor EV XE - రూ. 11.99 లక్షలు
 • Tigor EV XM - రూ. 12.49 లక్షలు
 • Tigor EV XZ+ - రూ. 12.99 లక్షలు
 • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్)

  Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

  Tata Tigor EV డిజైన్ మరియు ఫీచర్లు:

  Tata Tigor EV ని కంపెనీ ఇదవరకే వాణిజ్య వినియోగం కోసం విక్రయించేది. అయితే, దాని రేంజ్ మరియు ఫీచర్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. కాగా, ఇప్పుడు కొత్త వచ్చిన 2021 Tigor EV మోడల్ సాంకేతికంగా మరియు డిజైన్ పరంగా మునుపటి కన్నా అనేక రెట్లు మెరుగ్గా ఉంటుంది.

  Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

  ఈ కొత్త Tigor EV లో సాంకేతిక మార్పులతో పాటు కంపెనీ కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ కూడా చేసింది. ఇందులో ఎల్ఈఢి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫ్రంట్ బంపర్‌పై అమర్చిన ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్, ఫ్రంట్ బంపర్ మరియు అల్లాయ్ వీల్స్‌పై బ్లూ కలర్ యాక్సెంట్స్ ఇవ్వబడ్డాయి.

  Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

  క్యాబిన్ లోపల ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను అందిస్తున్నారు. ఇది కారు ఎలక్ట్రిక్ కారు, దానిని హైలైట్ చేసేందుకు కారు లోపల ఇంటీరియర్స్ లో కూడా అక్కడక్కడా బ్లూ కల్ యాక్సెంట్స్‌ను జోడించారు. ఏసి వెంట్‌లు మరియు సీట్స్‌పై ఈ యాక్సెంట్స్ కనిపిస్తాయి.

  Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

  ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను అందిస్తోంది. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ యాసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

  Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

  ఛార్జింగ్, పవర్ మరియు రేంజ్

  జిప్ట్రాన్ టెక్నాలజీతో రూపొందించిన కారణంగా కొత్త 2021 Tigor EV రేంజ్ మునుపటి కన్నా గణనీయంగా పెరిగింది. కొత్త 2021 Tata Tigor EV పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 306 కిలోమీటర్ల డ్రైవ్ రేంజ్‌ను అందిస్తుంది. ఈ బ్యాటరీని సాధారణ 15 amp హోమ్ సాకెట్‌తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 8.5 గంటల సమయం పడుతుంది.

  Tigor EV కి 4-స్టార్ సేఫ్టీ రేటింగ్; సురక్షితమైన కార్లకు చిరునామాగా మారుతున్న Tata!

  అదే ఫాస్ట్ ఛార్జర్‌తో అయితే కేవలం 1 గంటలో 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. కొత్త Tigor EV లో IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో కూడిన 26 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 55 kW పవర్‌ను మరియు 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 5.7 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది.

Most Read Articles

English summary
New 2021 tata tigor ev scores 4 star safety rating in global ncap crash test
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X