రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

Tata Group కి చెందిన ఆటోమొబైల్ విభాగం Tata Motors ఈనెల 18వ తేదీన ఆవిష్కరించిన తమ కొత్త Tigor EV ని కంపెనీ రేపు (అనగా ఆగస్ట్ 31, 2021వ తేదీన) మార్కెట్లో అధికారికంగా విడుదల చేయనుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కంపెనీ ఇప్పటికే బుకింగ్‌లను కూడా స్వీకరిస్తోంది.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

ఆసక్తిగల కస్టమర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త Tata Tigor EV ని కంపెనీ తమ అధునాతన Ziptron టెక్నాలజీతో అభివృద్ధి చేసింది. మునుపటితో పోలిస్తే, ఈ కొత్త మోడల్ మెరుగైన రేంజ్ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ ని కలిగి ఉంటుంది.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

ఈ కొత్త 2021 Tata Tigor EV సరికొత్త లుక్ మరియు లేటెస్ట్ ఫీచర్‌లతో పాటుగా పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కూడా కలిగి ఉంటుంది. కంపెనీ ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న Tata Nexon EV ని కూడా ఇదే Ziptron టెక్నాలజీ ఆధారంగా నిర్మించారు. సమాచారం ప్రకారం, పూర్తి చార్జ్ పై కొత్త Tata Tigor EV డ్రైవింగ్ రేంజ్ సుమారు 250 కిలో మీటర్లకు వరకు ఉంటుందని తెలుస్తోంది.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

ఇదివరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న పాత Tigor EV పూర్తి చార్జ్ పై 90 నుండి 100 కిలో మీటర్ల రేంజ్‌ ను ఆఫర్ చేసేది. అప్పట్లో దీనిని లాస్ట్ మైల్ కనెక్టివిటీ కోసం ఉపయోగించే వారు. కాగా, ఇప్పుడు ఎక్కువ రేంజ్ మరియు లేటెస్ట్ టెక్నాలజీ వస్తున్న ఈ కొత్త 2021 Tigor EV ని సాధారణ కస్టమర్ల కోసం కూడా అందుబాటులో ఉంచే అవకాశం ఉంది.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

కొత్త Tigor EV లో కంపెనీ Ziptron టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా దాని పవర్ మరియు రేంజ్‌లను కంపెనీ పెంచింది. ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 రేటెడ్ 26 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ను ఉపయోగించారు. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా ఇది 55 kW శక్తిని 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ని జనరేట్ చేస్తుంది.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు. ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 60 నిముషాల్లో ఈ ఎలక్ట్రిక్ కారును 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ 15 amp హోమ్ సాకెట్ ఛార్జర్ సాయంతో 8.5 గంటల సమయంలో పూర్తిగా చార్జ్ చేసుకోవచ్చు.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

Tata Motors ఈ బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది. ఇందులో IP67 రేటింగ్ బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. ఫలితంగా, ఇవి పూర్తిగా జలనిరోధితమైనవి (వాటర్‌ప్రూఫ్)గా ఉంటాయి. వర్షాకాలంలో ఈ ఎలక్ట్రిక్ కారును నడపడం సమస్యగా ఉండదు.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

కొత్త Tigor EV ఎక్స్టీరియర్ డిజైన్‌ను గమనిస్తే, ఇందులో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌లను కూడా ఇందులో జోడించింది. ఇవే కాకుండా, అల్లాయ్ వీల్స్‌పై మరియు ఎక్స్టీరియర్‌లోని మరిన్ని కొన్ని ప్రాంతాల్లో బ్లూ కలర్ డీటేలింగ్స్‌ను ఇచ్చింది. ఇవన్నీ ఈ కారును ఎలక్ట్రిక్ కారుగా చూపించడంలో సహకరిస్తాయి.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

అలాగే, ఇంటీరియర్స్‌లో కూడా క్యాబిన్ లోపల కూడా చాలా చోట్ల బ్లూ కలర్ యాక్సెంట్లను కంపెనీ ఉపయోగించింది. ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఏసి వెంట్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్యానెల్‌లు మరియు కారు సీట్లపై బ్లూ కలర్ యాక్సెంట్లు కనిపిస్తుంది. ఇంకా ఇందులో ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటుంది.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

ఇక ఇందులోని సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే, కొత్త Tigor EV లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ అసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

రేపే Tata Tigor EV విడుదల: ఈ కారు గురించి మాకేం తెలుసంటే..?

అంతేకాకుండా, ఇందులో వినియోగదారు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రిమోట్ కమాండ్‌లు మరియు రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటి 30 కి పైగా కనెక్టెడ్ ఫీచర్‌లను కంపెనీ అందిస్తోంది. ఇంకా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ ఏసి వెంట్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 316-లీటర్ బూట్ స్పేస్ వంటి విశిష్టతలు కూడా ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

ప్రస్తుతం మార్కెట్లో మంచి డ్రైవింగ్ రేంజ్ కలిగి ఉన్న ఏకైక సెడాన్ Tata Tigor EV. కొత్త మోడల్ పరిచయంతో కంపెనీ ఇప్పుడు దీని రేంజ్ ను మరింత పెంచబోతోంది. అయితే, ఈ నేపథ్యంలో దాని ధర ఎంత వరకు పెరుగుతుందనేది వేచి చూడాలి. సరసమైన ధరకే ఈ కారును మార్కెట్లో ప్రవేశపెట్టినట్లయితే, ఇది మంచి విజయం సాధించే అవకాశం ఉంది.

Article Published On: Monday, August 30, 2021, 14:46 [IST]
English summary
New 2021 tata tigor ev to be launched in india tomorrow details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+