కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

భారతదేశపు ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Tata Motors (టాటా మోటార్స్) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండవ ఎలక్ట్రిక్ కారు Tata Tigor EV (టాటా టిగోర్ ఈవీ)ని కంపెనీ నేడు (ఆగస్ట్ 31, 2021) అధికారికంగా మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసినదే. కేవలం రూ. 11.99 లక్షల ప్రారంభ ధరకే కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టింది.

కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

టాటా మోటార్స్ ఈ ఎలక్ట్రిక్ సెడాన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది. అవి - XE, XM మరియు XZ+. ఇందులో అన్ని వేరియంట్లు కూడా టీల్ బ్లూ, డేటోనా గ్రే అనే రెండు కలర్ అప్సన్స్‌లో లభిస్తాయి. కాగా, ఇందులోని టాప్-ఎండ్ వేరియంట్ (XZ+) మాత్రం డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్ లో లభిస్తుంది.

కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

మరి ఈ మూడు వేరియంట్లలో లభించే ఫీచర్లు, దానికి సంబంధించిన వివరాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

2021 Tata Tigor EV XE - ధర రూ. 11.99 లక్షలు

 • ఎల్ఈడి టెయిల్ లైట్
 • ఫ్రంట్ పవర్ అవుట్‌లెట్
 • డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
 • ఈబిడితో కూడిన ఏబిఎస్
 • స్టీరింగ్ వీల్ కోసం టిల్ట్ ఆప్షన్
 • కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

  2021 Tata Tigor EV XM - ధర రూ. 12.49 లక్షలు

  • XE వేరియంట్లో లభించే ఫీచర్లకు అదనంగా..
  • ఫుల్ వీల్ కవర్
  • థియేటర్ డిమ్మింగ్‌తో కూడిన ఇంటీరియర్ ల్యాంప్
  • నెక్స్‌జెన్ హార్మన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • ప్రీమియం హార్మన్ సౌండ్ సిస్టమ్, 4 స్పీకర్లతో
  • డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్
  • ఆల్ పవర్ విండోస్
  • మాన్యువల్ సెంట్రల్ లాకింగ్
  • కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

   2021 Tata Tigor EV XZ+ - ధర రూ. 12.99 లక్షలు

   • హైపర్‌స్టైల్ అల్లాయ్ వీల్స్
   • ఆకర్షణీయమైన ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్
   • సిగ్నేచర్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్స్
   • షార్క్ ఫిన్ యాంటెన్నా
   • హార్మన్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
   • 4 స్పీకర్లు మరియు 4 ట్వీటర్లు
   • రియర్ పార్కింగ్ కెమెరా
   • రియర్ డీఫోగర్
   • పుష్ బటన్ స్టార్ట్ / స్టాప్
   • ఫోల్డబుల్ రియర్ ఆర్మ్‌రెస్ట్
   • కూల్డ్ గ్లవ్ బాక్స్
   • ఎలక్ట్రానిక్ బూట్ అన్‌లాకింగ్
   • ఆటో ఫోల్డ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్
   • ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు
   • కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    ఇవీ కొత్త Tigor EV ఎలక్ట్రిక్ కారులో లభించే వేరియంట్ వారీ ఫీచర్లు. ప్రస్తుతం, Tata Motors విక్రయిస్తున్న తమ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ Nexon EV ని తయారు చేసిన జిప్‌ట్రాన్ (Ziptron) ప్లాట్‌ఫామ్ పైనే ఈ కొత్త Tigor EV ఎలక్ట్రిక్ సెడాన్ ను కూడా తయారు చేశారు. ఫలితంగా, ఈ ఎలక్ట్రిక్ కారు రేంజ్ మరియు పవర్ లో గణనీయమై మార్పులు వచ్చాయి.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2021 Tigor EV ఎలక్ట్రిక్ సెడాన్ ను ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే గరిష్టంగా 306 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. అంతేకాదు, ఫాస్ట్ చార్జర్ సాయంతో ఈ కారులోని బ్యాటరీని కేవలం 65 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం చార్జ్ చేసుకోవచ్చు. అదే స్టాండర్డ్ హోమ్ చార్జర్ ద్వారా అయితే, ఈ బ్యాటరీలను పూర్తిగా చార్జ్ చేయటానికి 8 గంటల సమయం పడుతుంది.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    ఈ ఎలక్ట్రిక్ కారులో IP67 వాటర్‌ప్రూఫ్ రేటింగ్‌తో కూడిన 26 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది కారులోని ఎలక్ట్రిక్ మోటార్ కు పవర్ ను సరఫరా చేస్తుంది. ఈ మోటార్ గరిష్టంగా 55 kW శక్తిని మరియు 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ కారు కేవలం 5.7 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని పుంజుకుంటుంది. ఇందులో డ్రైవ్ మరియు స్పోర్ట్స్ అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయి.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    కొత్త 2021 Tata Tigor EV వారంటీ

    కొత్త 2021 TataTigor EV ని కంపెనీ 3 సంవత్సరాలు లేదా 1.25 లక్షల కిలోమీటర్ల వారంటీతో విక్రయిస్తోంది. అదే సమయంలో, దాని బ్యాటరీ ప్యాక్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ పై కంపెనీ గరిష్టంగా 8 సంవత్సరాలు లేదా 1.60 లక్షల కిలోమీటర్ల వారంటీని అందిస్తోంది.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    కొత్త 2021 Tata Tigor EV బూట్ స్పేస్

    కొత్త Tigor EV లో సాధారణంగా 316 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. ఇందులో వెనుక ఉన్న విడి చక్రాన్ని (స్పేర్ వీల్‌ను) తొలగించడం ద్వారా బూట్ స్పేస్ ను 375 లీటర్లకు పెంచుకోవచ్చు. అలాగే, వెనుక సీట్లను మడచుకోవటం ద్వారా ఈ బూట్ స్పేస్ ను మరింత పెంచుకోవచ్చు. ఈ కారుతో పాటుగా కంపెనీ టైర్ పంక్చర్ కిట్‌ను కూడా అందించనుంది.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    2021 Tata Tigor EV సేఫ్టీ రేటింగ్

    గ్లోబల్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్ట్ లో కొత్త Tata Tigor EV 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ ఫలితాల ప్రకారం, ఇది వయోజన రక్షణలో 17 పాయింట్లకు గాను 12 పాయింట్లు మరియు పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 37.24 పాయింట్ల స్కోర్‌ను సాధించింది. ఈ కారు వయోజనులు మరియు పిల్లల ప్రయాణీకులకు తల మరియు ఛాతీ రక్షణలో మంచి పనితీరును కనబరిచినట్లు ఏజెన్సీ వివరిచింది.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    2021 Tata Tigor EV సేఫ్టీ ఫీచర్లు

    కొత్త Tigor EV ఎలక్ట్రిక్ కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఏబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ అసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రియర్ పార్కింగ్ కెమెరా మొదలైనవి ఉన్నాయి.

    కొత్త Tata Tigor EV లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు

    2021 Tata Tigor EV IRA కనెక్టెడ్ టెక్నాలజీ

    ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ లేటెస్ట్ IRA కనెక్టెడ్ టెక్నాలజీ ద్వారా 30 కి పైగా కనెక్టిం ఫీచర్లను అందిస్తోంది. ఇందులో వాయిస్ కమాండ్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్‌తో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. ఇది ఎలక్ట్రిక్ కారు అని గుర్తు చేసేందుకు కంపెనీ దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్‌లో బ్లూ కలర్ యాక్సెంట్లను ఉపయోగించింది.

Most Read Articles

English summary
New 2021 tata tigor ev variant wise price and features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X