కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ (Hyundai) నుండి అమ్ముడవుతున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటా (Creta) లో కంపెనీ ఓ కొత్త 2022 మోడల్ ను అంతర్జాతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇండోనేషియాలో జరుగుతున్న 2021 గైకిండో ఇండోనేషియా ఇంటర్నేషనల్ ఆటో షో (GIIAS) లో హ్యుందాయ్ తమ 2022 క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

ఈ కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా (2022 Hyundai Creta) రిఫ్రెష్డ్ డిజైన్ మరియు అప్-మార్కెట్ ఇంటీరియర్ తో వస్తుంది. ఇప్పుడు ఇది మరింత అగ్రెసివ్ గా కనిపించే డిజైన్ వైఖరిని కలిగి ఉంటుంది. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్స్ మరియు ఫీచర్ అప్‌డేట్స్ మినహా యాంత్రికంగా ఎలాంటి మార్పులు లేవని తెలుస్తోంది. అంతేకాకుండా, హ్యుందాయ్ క్రెటా ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ కూడా మారదు.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

భారతదేశంలో హ్యుందాయ్ మోటార్ ఇండియా గతేడాది ఆరంభంలో తమ కొత్త 2020 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను ప్రవేశపెట్టింది. ఈ మోడల్ రాకతో కంపెనీ అమ్మకాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. అంతేకాకుండా, కొత్త 2020 క్రెటా ఈ విభాగంలోనే ఇది అత్యధికంగా అమ్ముడైన మోడల్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో, హ్యుందాయ్ ఈ రిఫ్రెష్డ్ వెర్షన్ 2022 క్రెటా ఎస్‌యూవీని వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. మరి ఈ ఎస్‌యూవీ యొక్క హైలైట్స్ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఎక్స్టీరియర్

కొత్త-తరం హ్యుందాయ్ టక్సన్ ఎస్‌యూవీ మాదిరిగానే, 2022 క్రెటా ఫేస్‌లిఫ్ట్ కూడా హ్యుందాయ్ యొక్క కొత్త సెన్సస్ స్పోర్టీనెస్ డిజైన్ ఫిలాసఫీని అనుసరించి రూపందించినట్లు అనిపిస్తుంది. వాస్తవానికి, కొత్త 2022 క్రెటా ముందు భాగం డిజైన్ చాలా వరకూ టక్సన్ నుండి ప్రేరణ పొందినట్లుగా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా 2022 మోడల్ లో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లను అనుసంధానించే కొత్త పారామెట్రిక్ జ్యువెల్ ప్యాటర్న్ గ్రిల్ ఉంటుంది, ఇది మునుపటి కన్నా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

ఇంకా ఇందులో దీర్ఘచతురస్రాకారంలో ఉండే ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, స్లిమ్ ఎయిర్ ఇన్‌లెట్‌తో కూడిన రివైజ్డ్ బంపర్, ఫాక్స్ సిల్వర్ స్కిడ్ ప్లేట్ మరియు కొత్తగా రూపొందించిన ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ వంటి డిజైన్ ఎలిమెంట్స్ క్రెటా ముందు భాగాన్ని మరింత స్పోర్టీగా మార్చుతాయి. ఈ కారులో కొత్త డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ డిజైన్ ను కూడా చూడొచ్చు. అయితే, దీని సైడ్ ప్రొఫైల్ లో మాత్రం పెద్దగా మారదు. ప్రస్తుత మోడల్‌లా కాకుండా, కొత్త 2022 క్రెటా టెయిల్‌గేట్ పూర్తి పొడవునా ఉండే ఎల్ఈడి టెయిల్‌ల్యాంప్‌లను కనెక్ట్ చేసే స్ట్రిప్‌ను కోల్పోతుంది.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఇంటీరియర్

ఇంటీరియర్లలో చేసిన మార్పులను గమనిస్తే, కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ పెద్ద మార్పులకు గురికానప్పటికీ, కంపెనీ ఇందులో అనేక కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ కి అనుగుణంగా, హ్యుందాయ్ ఈ ఎస్‌యూవీలో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఫీచర్లను అందించనుంది. భవిష్యత్తులో హ్యుందాయ్ ఇవే ఫీచర్లను ఇండియా-స్పెక్ మోడల్‌లో కూడా అందించవచ్చు.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

హ్యుందాయ్ క్రెటా 2022 మోడల్ లో అందించబోయే అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ ఫీచర్లలో భాగంగా కంపెనీ ఇందులో అధునాతన సేఫ్టీ ఫీచర్లను అందించనుంది. ఇది ఈ విభాగంలో ఎమ్‌జి ఆస్టర్ మరియు ఎక్స్‌యూవీ700తో పోటీ పడుతుంది. ఇంకా ఇందులో కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, అప్‌డేట్ చేయబడిన బ్లూలింక్ కనెక్టింగ్ టెక్నాలజీ, 360 డిగ్రీ కెమెరా, వెహికల్ ట్రాకింగ్ మరియు ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లను కూడా ఆఫర్ చేసే అవకాశం ఉంది.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

కొత్త 2022 హ్యుందాయ్ క్రెటా ఇంజన్

ఇండోనేషియన్ మార్కెట్లో విక్రయించనున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో 1.5 లీటర్, న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ తో రానుంది. ఈ ఇంజన్ 114 బిహెచ్‌పి పవర్ ను మరియు 142 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానుంది.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

అదే, ఇండియా-స్పెక్ క్రెటా విషయానికి వస్తే, ఇది 138 బిహెచ్‌పి పవర్ మరియు 242 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 1.4 లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 114 యబిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేసే 1.5 లీటర్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఈ కొత్త మోడల్‌లోని గేర్‌బాక్స్ ఆప్షన్లు ప్రస్తుత మోడల్ మాదిరిగానే ఉంటాయి.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

కొత్త హ్యుందాయ్ క్రెటా ఇండియా లాంచ్

హ్యుందాయ్ మోటార్ ఇండియా ఈ కొత్త తరం 2020 క్రెటాను భారత మార్కెట్లో విడుదల చేసే అధికారిక లాంచ్ టైమ్‌లైన్‌ను ఇంకా వెల్లడించనప్పటికీ, ఈ ఎస్‌యూవీ యొక్క అప్‌డేటెడ్ మోడల్ 2022 మొదటి త్రైమాసికం నాటికి ఇక్కడి మార్కెట్లోకి రావచ్చని భావిస్తున్నారు. దీనికంటే ముందుగా హ్యుందాయ్ తమ కొత్త కాంపాక్ట్ ఎమ్‌పివిని 2022 ప్రారంభంలో భారత మార్కెట్లో విడుదల చేయవచ్చని సమాచారం. ప్రస్తుతానికి ఈ మోడల్‌ను హ్యుందాయ్ స్టార్‌గ్లేజ్ అనే పేరుతో పిలుస్తున్నారు.

కొత్త 2022 Hyundai Creta ఫేస్‌లిఫ్ట్ ఆవిష్కరణ; వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల!

హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ధర

ప్రస్తుతం, భారత మార్కెట్లో విక్రయించబడుతున్న మోడల్‌తో పోలిస్తే, ఈ అప్‌గ్రేడెడ్ హ్యుందాయ్ క్రెటా మోడల్ ధర కాస్తంత ఎక్కువగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం, ఈ ఎస్‌యూవీ మోడల్ లైనప్ రూ. 10.16 లక్షల నుండి రూ. 17.87 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో అందుబాటులో ఉంది.

Most Read Articles

English summary
New 2022 hyundai creta facelift unveiled will be equipped with adas tech
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X