హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

భారతీయ మార్కెట్లో ఇటీవల 'ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌' (Audi Q5 Facelift) రూ. 58.93 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదలైన సంగతి తెలిసిందే. కంపెనీ ఈ కొత్త SUV యొక్క బుకింగ్స్ విడుదలకు ముందే ప్రారభించింది. అయితే ఇప్పటికే ఈ లగ్జరీ SUV యొక్క బుకింగ్స్ 100 యూనిట్లు దాటినట్లు కంపేనీ నివేదికల ద్వారా తెలుస్తుంది. ఈ SUV ఈ సంవత్సరానికి పూర్తిగా విక్రయించబడినట్లు కూడా కంపెనీ తెలిపింది. డెలివెరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌ (Audi Q5 Facelift) రెండు వేరియంట్‌లు మరియు 5 కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. మొదటి బ్యాచ్ డెలివరీలు పూర్తయిన తరువాత సెకండ్ బ్యాచ్ బుకింగ్స్ బహుశా 2022 లో ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అమ్మకాలు తరువాత దశలో మరింత పెరిగే అవకాశం ఉంటుందని కంపెనీ భావిస్తోంది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్‌ ప్రీమియమ్ ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ కొత్త SUV చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ కొత్త కారు యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ Q8 యొక్క లార్జ్ సింగిల్-ఫ్రేమ్ ఆక్టాగోనల్ గ్రిల్‌, వర్టికల్ క్రోమ్ స్లాట్ మరియు రీడిజైన్ చేయబడిన కొత్త LED హెడ్‌ల్యాంప్‌లను పొందుతుంది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ 19 ఇంచెస్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. అంతే కాకూండా, ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో ట్వీక్ చేయబడిన ఎల్ఈడీ టైల్‌లైట్‌లు, క్రోమ్ ఇన్‌సర్ట్‌లు మరియు రీప్రొఫైల్డ్ రియర్ బంపర్ వంటివి కూడా ఉన్నాయి. ఇందులో యారో షేప్ లో ఉండే LED టైల్‌లైట్‌ కూడా ఉంటుంది. ఈ SUV అల్ట్రా బ్లూ మరియు డిస్ట్రిక్ట్ గ్రీన్ అనే రెండు కొత్త కలర్ ఆప్షన్లలో విడుదల చేయబడింది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

ఇక ఈ కొత్త SUV యొక్క ఇంటీరియర్‌ల విషయానికి వస్తే, ఇందులోని డ్యూయల్-డిస్ప్లే సెటప్ తొలగించబడింది, ఆ స్థానంలో ఆడి యొక్క తాజా 10.1 ఇంచెస్ MMI ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేట్ చేయబడిన డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు కనెక్టెడ్ కార్ టెక్నాలజీని కలిగి ఉంటుంది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

అంతే కాకూండా ఇందులో త్రీ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, క్రూయిజ్ కంట్రోల్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్స్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ SUV కలిగి ఉన్న ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాల వల్ల ఇది చూడటానికి మరింత అధునాతనంగా ఉంటుంది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

భారతీయ మార్కెట్లో అడుగుపెట్టిన ఈ కొత్త SUV ఈ ఏడాది కంపెనీకి 9 వ ఉత్పత్తి కానుంది. ఆడి క్యూ5 తన సెగ్మెంట్‌లో అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. కావున ఎక్కువమంది వాహన వినియోగదారులు ఈ SUV ని కొనుగోలు చేసే అవకాశం ఉంది, అని భావిస్తున్నాము.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంజిన్ విషయానికి వస్తే, ఇది కేవలం పెట్రోల్ ఇంజన్‌లో మాత్రమే 12 వి మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌తో అందించబడుతుంది. ఈ ఇంజన్ 245 బిహెచ్‌పి పవర్ మరియు 370 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌కి జతచేయబడి ఉంటుంది. ఇది ఇంజిన్ యొక్క పవర్ దాని నాలుగు చక్రాలకు పంపుతుంది.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

ఆడి Q5 ఫేస్‌లిఫ్ట్ గరిష్టంగా 237 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని మరియు కేవలం 6.3 సెకన్లలో 0 నుంచి 100 కిమీ/గం వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఇది కంఫర్ట్, డైనమిక్, ఇండివిజువల్, ఆటో, ఎఫిషియెన్సీ మరియు ఆఫ్-రోడ్ అనే ఆరు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది, ఇవి కారును ఏదైనా భూభాగం లేదా పరిస్థితికి అనుగుణంగా మార్చడానికి అనుకూలంగా ఉంటాయి.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో మెర్సిడెస్ బెంజ్ GLC, బీఎండబ్ల్యూ X3, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు వోల్వో XC60 వంటి ఇతర లగ్జరీ SUVలకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది. ఈ SUV బుక్ చేసుకోవాలనుకునే కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లేదా అధికారిక డీలర్‌షిప్ నుండి రూ. 2 లక్షల టోకెన్ మొత్తంతో కారును బుక్ చేసుకోవచ్చు. క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది, కావున ఇది వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్థారిస్తాయి.

హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న Audi Q5 Facelift: ఎందుకింత డిమాండ్ & ఏమిటి ఇందులోని స్పెషల్

భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, ఆడి ఇండియా ఇప్పుడు భారతదేశంలోనే ఎలక్ట్రిక్ వాహనాలను అసెంబుల్ చేసే ప్రణాళికను కూడా సిద్ధం చేస్తోంది. ఆడి ఇండియా ప్రస్తుతం భారతదేశంలో ఆడి ఇ-ట్రాన్ ఎలక్ట్రిక్ ఎస్‌యువి మరియు ఆడి ఇ-ట్రాన్ జిటిని విక్రయిస్తోంది. త్వరలో కంపెనీ మరిన్ని ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెట్టనుందని భావిస్తున్నాము.

More from DriveSpark

Article Published On: Thursday, November 25, 2021, 9:51 [IST]
English summary
New audi q5 100 units booked sold out for 2021
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+