భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి ఇండియా (Audi India) దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్‌యూవీ క్యూ5 (Q5) లో కంపెనీ ఓ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ను త్వరలోనే మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే, కొత్త 2021 ఆడి క్యూ5 (Audi Q5) ఫేస్‌లిఫ్ట్ మోడల్ కోసం కంపెనీ బుకింగ్ లను స్వీకరించడం ప్రారంభించింది.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

ఆడి ఇండియా ఈ కొత్త క్యూ5 లగ్జరీ కారును భారతదేశంలోనే ఉత్పత్తి చేయనుంది. కంపెనీ ఈ కారును ఔరంగాబాద్ లోని తయారీ కేంద్రంలో ఉత్పత్తి చేస్తుంది. మార్కెట్ సమాచారం ప్రకారం, ఈ కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మోడల్ అతి త్వరలోనే భారత మార్కెట్లో విక్రయించబడుతుందని భావిస్తున్నారు.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

దేశవ్యాప్తంగా ఉన్న ఆడి ఇండియా డీలర్‌షిప్ కేంద్రాలు మరియు కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కొత్త 2021 ఆడి క్యూ5 ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ ప్రారంభించబడ్డాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 2 లక్షల టోకెన్ అడ్వాన్స్‌ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు. కొత్త 2021 ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ కారు ప్రీమియం ప్లస్ మరియు టెక్నాలజీ అనే రెండు వేరియంట్లలో లభ్యం కానుంది.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మోడల్ రిఫ్రెష్డ్ డిజైన్ తో పాటుగా కొత్త ఫీచర్లను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఈ కొత్త మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది. దీని ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో రిఫ్రెష్డ్ స్టైలింగ్‌ని చూడొచ్చు. వెలుపలి భాగంలో, ఇండియా-స్పెక్ క్యూ5 లో నిలువు క్రోమ్ స్లాట్‌లు, కొత్త ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ ల్యాంప్‌లు, రీడిజైన్ చేసిన బంపర్లు, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్‌ మరియు అగ్రెసివ్ ఫ్రంట్ గ్రిల్‌ వంటి ఫీచర్లను ఆశించవచ్చు.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

అలాగే, దీని ఇంటీరియర్స్ లో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ లో కొత్త ఎమ్ఐబి 3 ఇన్ఫోటైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్‌తో కూడిన పెద్ద 10.1 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు లేటెస్ట్ కార్ కనెక్టింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

ఇంకా ఇందులో ప్రీమియం లుక్ కోసం పియానో బ్లాక్ ఇన్సర్ట్‌లు, వర్చువల్ కాక్‌పిట్ ప్లస్ (డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్), వైర్‌లెస్ ఛార్జర్, బి అండ్ ఓ ప్రీమియం 3డి సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి. అలాగే, ఇందులో ఆడి యొక్క లేటెస్ట్ పార్క్ అసిస్ట్‌, వెనుకవైపు ఎయిర్‌బ్యాగులు, ఈబిడితో కూడిన ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు మొత్తం ఎనిమిది ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

ఇంజన్ విషయానికి వస్తే, కొత్త 2021 ఆడి క్యూ5 (2021 Audi Q5) లో ఎలాంటి మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ఇందులో బిఎస్-6 కంప్లైంట్ 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 249 బిహెచ్‌పి పవర్ ను మరియు 370 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ తో జతచేయబడి ఉంటుంది.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ ఆడి క్యూ5 ఎస్‌యూవీలో క్వాట్రో ఆల్-వీల్ డ్రైవ్‌ సిస్టమ్ తో పాటుగా ఆడి డ్రైవ్ సెలెక్ట్ మరియు డంపింగ్ కంట్రోల్‌తో కూడిన సస్పెన్షన్ సెటప్ కూడా ఉంటుంది. ఇవన్నీ మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యాన్ని అందిస్తాయి. గతంలో ఆడి ఇండియా తమ క్యూ5 కారును డీజిల్ ఇంజన్‌ తో విక్రయించేది. కాగా, ఇప్పుడు ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్ ను కేవలం పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే అందించాలని కంపెనీ భావిస్తోంది.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ కోసం బుకింగ్‌ లను ప్రారంభించడం గురించి ఆడి ఇండియా ప్రెసిడెంట్ బల్బీర్ సింగ్ డిలాన్ మాట్లాడుతూ, "ఆడి క్యూ ఫ్యామిలీలో అత్యంత విజయవంతమైన మోడల్ అయిన క్యూ5 కోసం బుకింగ్ లను ప్రారంభించడం తమకెంతో సంతోషంగా ఉందని, ఆడి క్యూ5 అత్యుత్తమ లగ్జరీ ఫీచర్లు మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లను కలిగి ఉంటుందని, దీని రిఫ్రెష్డ్ డిజైన్ మొదటి చూపులో కళ్లను ఆకట్టుకునేలా ఉంటుందని" అన్నారు.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ కారు ఇప్పుడు మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా వినియోగదారులను ఆకర్షిస్తుందని ఆయన చెప్పారు. ఆడి ఇండియా ఇంకా ఈ కొత్త క్యూ5 ఫేస్‌లిఫ్ట్ ధరను ప్రకటించలేదు. కాకపోతే, కంపెనీ ఈ కారును స్థానికంగానే తయారు చేస్తున్న నేపత్యంలో, దీని ధర కొంచెం తక్కువగా ఉండొచ్చని సమాచారం. మార్కెట్ అంచనా ప్రకారం, కొత్త ఆడి క్యూ5 ధర రూ. 55 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా.

భారత మార్కెట్లో Audi Q5 ఫేస్‌లిఫ్ట్ బుకింగ్స్ ఓపెన్.. త్వరలోనే విడుదల.

నవంబర్ 2021 లో కొత్త ఆడి క్యూ5 ఫేస్‌లిఫ్ట్ మోడల్ మార్కెట్లో విడుదల కానుంది. ఆ సమయంలో ఈ కారు యొక్క ఖచ్చితమైన ధర మరియు ఇతర ముఖ్యమైన వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశం ఉంది. ఈ కొత్త ఆడి క్యూ5 లగ్జరీ కారు భారత మార్కెట్లోని బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్3, ల్యాండ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 19, 2021, 16:46 [IST]
English summary
New audi q5 facelift bookings open in india launching very soon
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+