కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ ఆడి, భారత మార్కెట్లో ఓ సరికొత్త స్పోర్ట్స్ కారును విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను కంపెనీ విడుదల చేయనుంది. ఈ మేరకు ఆడి ఇండియా ఓ టీజర్‌ను కూడా లాంచ్ చేసింది.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

ఈ కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో లభ్యమవుతోంది. భారత్‌లో విడుదల కానున్న కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కూడా ఇంటర్నేషనల్ మోడల్ మాదిరిగానే ఉండే అవకాశం ఉంది. ఈ కారును సిబియు (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్‌లో పూర్తిగా విదేశాల్లో తయారు చేసి, భారత్‌కు దిగుమతి చేసుకోనున్నారు.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

దేశంలో ఉన్న అధిక దిగుమతి సుంఖాల కారణంగా, మార్కెట్లో ఈ కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ధర సుమారు రూ.65 లక్షల నుండి రూ.70 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మెర్సిడెస్-ఏఎమ్‌జి సి43 మరియు రాబోయే బిఎమ్‌డబ్ల్యూ ఎమ్340ఐ ఎక్స్‌డ్రైవ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

ఈ ఫోర్ డోర్ వెర్షన్ స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌లో శక్తివంతమైన 3.0-లీటర్ వి6 టిఎఫ్‌ఎస్‌ఐ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 349 బిహెచ్‌పి పవర్‌ను మరియు 500 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ టిప్ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

ఈ కారు ఆడి బ్రాండ్ యొక్క సిగ్నేచర్ 'క్వాట్రో' ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది ఇంజన్ నుండి వెలువడే శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ కారు కేవలం 4.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కి.మీ వేగాన్ని చేరుకుంటుందని కంపెనీ పేర్కొంది.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

డిజైన్ పరంగా చూస్తే, కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్ షార్ప్ క్రీజన్ లైన్స్‌తో అగ్రెసివ్ అండ్ స్పోర్టీ బాడీ ప్యానెల్స్‌ను కలిగి ఉంటుంది. ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్స్‌లో కూడా అనేక ఫీచర్లు మరియు పరికరాలు ఉంటాయి. ఇందులో ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, 'ఎస్ 5' బ్యాడ్జింగ్‌తో పెద్ద సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్, 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్స్ లైట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ ఇంటీరియర్ ఫీచర్లలో వర్చువల్ కాక్‌పిట్, ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు లేటెస్ట్ కనెక్ట్ టెక్నాలజీ మొదలైన ఫీచర్లు ఉండనున్నాయి.

కొత్త ఆడి ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ టీజర్; త్వరలో భారత్‌లో విడుదల - వివరాలు

ఆడి తమ లేటెస్ట్ వెర్షన్ ఎస్5 స్పోర్ట్‌బ్యాక్ మోడల్‌ను తొలిసారిగా 2019 ఫ్రాంక్‌ఫర్ట్ ఆటో షోలో ఆవిష్కరించబడింది. ఆ తర్వాత, గత ఏడాది చివర్లో ఈ మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. ఈ కారును భారత్‌కు సిబియూ రూట్‌లో దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, కాంపిటీటర్లతో పోల్చుకుంటే దీని ధర కాస్తంత అధికంగా ఉండొచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Saturday, March 6, 2021, 12:07 [IST]
English summary
New Audi S5 Sportback Teased Ahead Of India Launch, Details. Read in Telugu.
Read more on: #ఆడి #audi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+