కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

కొరియన్ కార్ బ్రాండ్ హ్యుందాయ్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న పాపులర్ మిడ్-సైజ్ ఎస్‌యూవీ క్రెటాలో కంపెనీ ఓ కొత్త తరం (2020) మోడల్‌ను గతేడాది ఆరంభంలో విడుదల చేసిన సంగతి తెలిసినదే.

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

ఈ కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటా భారత మార్కెట్లోకి ప్రవేశించి సరిగ్గా ఏడాది కాలం పూర్తయింది. ఏడాది క్రితం కారు ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 1.21 లక్షల యూనిట్ల కొత్త తరం క్రెటా (2020 మోడల్) కార్లను విక్రయించినట్లు హ్యుందాయ్ ప్రకటించింది.

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

హ్యుందాయ్ మోటార్ ఇండియా తెలిపిన ప్రకారం, మొత్తం క్రెటా ఎస్‌యూవీ అమ్మకాలలో ఎస్ఎక్స్ మరియు ఎస్ఎక్స్ (ఆప్షనల్) వేరియంట్ల అమ్మకాలు 51 శాతానికి పైగా ఉన్నాయి. ఈ మోడల్ మొత్తం అమ్మకాలలో 1.5-లీటర్ డీజిల్ వేరియంట్ అమ్మకాలు 60 శాతం కంటే ఎక్కువగా ఉన్నాయి.

MOST READ:ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న టోల్ ఫీజులు ; పూర్తి వివరాలు

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

అలాగే, ఈ సమయంలో హ్యుందాయ్ విక్రయించిన మొత్తం క్రెటా కార్లలో 20 శాతం ఆటోమేటిక్ వేరియంట్లే ఉన్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తంగా చూసుకుంటే, హ్యుందాయ్ క్రెటా మొదటి తరం మోడల్ భారత మార్కెట్లో విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ దేశీయ మార్కెట్లో 5.8 లక్షల యూనిట్లను విక్రయించగా, మేక్ ఇన్ ఇండియా చొరవలో భాగంగాస 2.16 లక్షలకు పైగా యూనిట్లను ఎగుమతి చేసింది.

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రెండవ తరం హ్యుందాయ్ క్రెటా మూడు ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. కొత్త 2020 హ్యుందాయ్ క్రెటాలో కొత్త 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్లు వరుసగా 115 బిహెచ్‌పిల శక్తిని మరియు 144 ఎన్ఎమ్ మరియు 250 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను అందిస్తాయి.

MOST READ:కదిలే కారుపై షాకింగ్ స్టంట్స్ చేసిన పొలిటికల్ లీడర్ కొడుకుపై చర్యలు తీసుకున్న పోలీసులు

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

హ్యుందాయ్ క్రెటా హై స్పెక్ వేరియంట్లలో 1.4 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఈ మూడు ఇంజన్లు స్టాండర్డ్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలనుకునే వారికి కూడా ఇందులో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ సివిటి, 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ మరియు 1.4-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ 7-స్పీడ్ డిసిటి గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

MOST READ:సుజుకి హయాబుసా సూపర్‌బైక్‌పై ట్రాఫిక్ పోలీస్ [వీడియో]

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

మొదటి తరం క్రెటాతో పోల్చుకుంటే ఈ రెండవ తరం క్రెటాలో పలు కాస్మెటిక్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఇందులో ముందు వైపు సరికొత్త క్యాస్కేడింగ్ గ్రిల్‌, ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌ల చుట్టూ కొత్తగా రూపొందించిన ఎల్‌ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ బంపర్, కొత్త ఎల్‌ఈడి ఫాగ్ ల్యాంప్స్ మరియు క్రింది భాగంలో ఫాక్స్ సిల్వర్ స్కఫ్ ప్లేట్ వంటి మార్పులు ఉన్నాయి.

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

అలాగే, ఇంటీరియర్స్‌లో మౌంటెడ్ కంట్రోల్స్‌తో కూడిన స్టీరింగ్ వీల్, డ్రైవర్ సమాచారం కోసం 7-ఇంచ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కూడా జోడించారు. ఇది హ్యుందాయ్ అందిస్తున్న అఫీషియల్ బ్లూ-లింక్ కనెక్టివిటీ టెక్నాలజీతో పాటుగా యాపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:ఒక చార్జితో 300 కి.మీ ప్రయాణించే వాహనం.. ఇది తయారుచేసింది కంపెనీలు కాదు.. ఒక రైతు

కొత్త తరం 2020 హ్యుందాయ్ క్రెటాకి భలే డిమాండ్; అప్పుడే 1.21 లక్షల యూనిట్లు..

ఇంకా ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, పానోరమిక్ సన్‌రూఫ్, ఆంబియెంట్ లైటింగ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్ విత్ ఇబిడి, ప్యాడల్ షిఫ్టర్స్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, రియర్ పార్కింగ్ కెమెరా మరియు సెన్సార్లు, హిల్-స్టార్ట్ అసిస్ట్, హిల్-డీసెంట్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

English summary
New Gen 2020 Hyundai Creta Completes 1 Year, Sold 1.21 Lakh Units So Far. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X