Force Gurkha లాంచ్ డేట్ వెల్లడి.. ఈ ఆఫ్-రోడర్ విడదలయ్యేది ఎప్పుడంటే..?
ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ Force Motors (ఫోర్స్ మోటార్స్) ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ఔత్సాహికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సరికొత్త 2021 Force Gurkha (ఫోర్స్ గూర్ఖా) ఎస్‌యూవీ విడుదల తేదీని కంపెనీ అధికారికంగా వెల్లడిందించి. సెప్టెంబర్ 20, 2021 వ తేదీన ఫోర్స్ మోటార్స్ తమ సరికొత్త 2021 ఫోర్స్ గుర్ఖాని భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా (2021 Force Gurkha) లో కంపెనీ అనేక డిజైన్ మరియు ఫీచర్ అప్‌గ్రేడ్ లను చేసింది. అంతేకాకుండా, ఇది మునుపటి కన్నా మరింత క్లీన్ ఇంజన్ తో మార్కెట్లోకి రానుంది. ఈ కారులో బిఎస్6 ఇంజన్ అప్‌గ్రేడ్ తో పాటుగా దాని స్టైలింగ్ మరియు సేఫ్టీ ఫీచర్లలో కూడా కంపెనీ పలు మార్పులు చేర్పులు చేసింది.

ఫోర్స్ మోటార్స్ తమ నెక్స్ట్ జనరేషన్ గుర్ఖా ఎస్‌యూవీ కాన్సెప్ట్ ను గతేడాది ఫిబ్రవరిలో (2020లో) జరిగిన 2020 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. వాస్తవానికి ఈ మోడల్ ఎప్పుడో మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. కాకపోతే, భారతదేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కుదిపివేసిన కోవిడ్-19 సంక్షోభం కారణంగా ఇది చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చింది.

అయితే, ఇప్పుడు ఎట్టకేలకు కొత్త 2021 Force Gurkha ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 20 వ తేదీన ఇది మార్కెట్లో సందడి చేయనుంది. మహీంద్రా ప్రవేశపెట్టిన తమ కొత్త తరం 2020 మహీంద్రా థార్ (2020 0Mahindra Thar) ఎస్‌యూవీ మాదిరిగానే ఈ కొత్త తరం 2021 ఫోర్స్ గుర్ఖా ఎస్‌యూవీ కుడా ఇటు ఆన్-రోడ్ మరియు అటు ఆఫ్-రోడ్ ప్రయోజనాల కోసం రూపొందించినట్లుగా అనిపిస్తోంది.

అప్‌డేట్ చేయబడిన కొత్త 2021 Force Gurkha ఎస్‌యూవీలో మెర్సిడెస్ బెంజ్ నుండి గ్రహించిన 2.6 లీటర్ డీజిల్ ఇంజన్ ను ఉపయోగించారు. ఈ బిఎస్6 వెర్షన్ ఇంజన్ గరిష్టంగా 89 బిహెచ్‌పి పవర్ ను మరియు 260 ఎన్ ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుందని సమాచారం. అదనంగా, ఇది మాన్యువల్ 4x4 సిస్టమ్ మరియు స్టాండర్డ్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభ్యం కానుంది.

ఈ ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలో ఉత్తమ ఆఫ్-రోడింగ్ సామర్థ్యాల కోసం మాన్యువల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ మరియు కష్టతరమైన భూభాగాలను పరిష్కరించడానికి తక్కువ-రేషియో గేర్‌బాక్స్ ని ఉపయోగించారు. ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ స్నార్కెల్ ఎయిర్ ఇన్‌టేక్ కూడా ఉంటుంది.

కొత్త తరం 2021 Force Gurkha ఎస్‌యూవీ ఎక్సీటిరయర్ లో చేసిన మార్పులను గమనిస్తే, ఇందులో ముందు వైపు గుండ్రంగా ఉండే హెడ్‌ల్యాంప్‌లు, అందులోనే ఇంటిగ్రేట్ చేయబడిన ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, కొత్త బంపర్లు, ఫాగ్ ల్యాంప్‌లు, క్లామ్‌షెల్ బోనెట్ మరియు రీడిజై చేయబడిన ఫ్రంట్ బంపర్ వంటి మార్పులతో ఇందు ముందు వైపు పూర్తిగా సరికొత్త ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.

అయితే, దీని ఓవరాల్ బాక్సీ టైప్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటి తరం గుర్ఖా ఎస్‌యూవీలను గుర్తుకు తెచ్చేలానే ఉంటుంది. ఇంకా ఇందులో ఎస్‌యూవీ చుట్టూ కొత్త బ్లాక్ క్లాడింగ్, వెనుక తలుపుకు అమర్చబడిన స్పేర్ వీల్, నిలువుగా అమర్చిన టెయిల్‌లైట్లు, ఇరువైపులా ప్రొటెక్టివ్ స్కఫ్ ప్లేట్లు, రీవర్క్ చేసిన రియర్ బంపర్ మరియు హై-మౌంటెడ్ ఎల్ఈడి స్టాప్ ల్యాంప్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.

కొత్త 2021 Gurkha లోని ఇంటీరియర్స్ ను గమనిస్తే, ఇందులో క్యాబిన్ ఆల్ బ్లాక్ థీమ్ లో ఉంటుందని తెలుస్తోంది. గతంలో లీకైన స్పై చిత్రాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఇంకా ఇందులో లేటెస్ట్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, త్రీ-స్పోక్ స్టీరింగ్ వీల్, పవర్ విండోస్, ఏబిఎస్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, మెరిసే బ్లాక్ బెజెల్స్‌తో కూడిన పెద్ద ఎయిర్ కండిషనింగ్ వెంట్స్ మరియు మాన్యువల్ హెచ్‌విఏసి సిస్టమ్ మొదలైనవి ఉంటాయని సమాచారం.

లోపలి భాగంలో ఆశించబడే ఇతర ఫీచర్లలో రెండవ వరుసలోని వ్యక్తిగత సీట్లు మరియు కొత్తగా డిజైన్ చేయబడిన వృత్తాకారపు ఎయిర్ వెంట్‌లు, టాప్-స్పెక్ ట్రిమ్‌లలో ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు మొదలైనవి ఉంటాయని అంచనా.

సీటింగ్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త ఫోర్స్ గుర్ఖా 6 సీటర్ లేదా 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కావచ్చని తెలుస్తోంది. మొదటి మరియు రెండవ వరుసలో నాలుగు ఫార్వర్డ్ ఫేసింగ్ సీట్‌లు ఉండే అవకాశం ఉంది. అలాగే, వెనుక వైపు ఒకదానికొకటి ఎదురుగా ఉన్న మరో రెండు సీట్లు కూడా ఇందులో ఉండొచ్చని గతంలో లీకైన స్పై చిత్రాలు తెలియజేస్తున్నాయి.

రోడ్ టెస్టింగ్ కోసం Force Motors ఉపయోగించిన గుర్ఖా ఎస్‌యూవీలో కంపెనీ కొన్ని ఆప్షనల్ మరియు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ యాక్ససరీలను కూడా ఉపయోగించింది. వీటిలో మందపాటి విండ్‌షీల్డ్ బ్రేస్ బార్, పైకప్పుపై అమర్చిన లగేజ్ క్యారియర్ మరియు కారు లోపలకి సులభంగా ప్రవేశించడానికి మరియు నిష్క్రమించడానికి వీలుగా సైడ్ స్టెప్ మొదలైనవి ఉన్నాయి.

భారత మార్కెట్లో Force Motors తమ నెక్ట్స్ జనరేషన్ 2021 Force Gurkha ఎస్‌యూవీని రూ. 10 లక్షల ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేయవచ్చని అంచనా. ఇది ఈ విభాగంలో మహీంద్రా థార్ మరియు భవిష్యత్తులో భారత మార్కెట్లో విడుదల కాబోయే కొత్త మారుతి సుజుకి జిప్సీ/జిమ్నీ వంటి మోడళ్లతో పడే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








