కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

భారతదేశపు నెంబర్ వన్ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) ఇటీవలే భారత మార్కెట్లో ప్రవేశపెట్టిన తమ కొత్త తరం 2021 సెలెరియో (Celerio) కోసం కంపెనీ ఓ టెలివిజన్ కమర్షియల్ (TVC) ను విడుదల చేసింది. కంపెనీ ఈ టివిసిలో కొత్త సెలెరియో అన్ని కీలక ఫీచర్లను హైలైట్ చేసింది. ప్రత్యేకించి, మొదటిసారిగా కారు కొనుగోలు చేసే నేటి తరం యువతను లక్ష్యంగా చేసుకొని మారుతి సుజుకి ఈ సెలెరియో కారును రూపొందించింది.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

మొదటి తరం సెలెరియో పోల్చుకుంటే ఈ రెండవ తరం సెలెరియో కారు డిజైన్ మరియు ఫీచర్ల పరంగా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటుంది. సిటీ రోడ్లపై సులువుగా దూసుకుపోయే దాని కాంపాక్ట్ సైజ్, సెగ్మెంట్లో కెల్లా అత్యధిక మైలేజ్, స్టైలిష్ డిజైన్, లేటెస్ట్ స్మార్ట ఫోన్ కనెక్టింగ్ ఫీచర్స్ మరియు మారుతి సుజుకి బ్రాండ్ యొక్క విశ్వసనీయతతో కొత్త తరం సెలెరియో మార్కెట్లోకి వచ్చింది. భారత మార్కెట్లో సెలెరియో ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 4.99 లక్షల నుండి రూ. 6.94 లక్షల మధ్యలో ఉన్నాయి.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

కొత్త మారుతి సుజుకి సెలెరియో LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు ట్రిమ్ లలో మొత్తం ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. వాటి ధరల వివరాలు ఇలా ఉన్నాయి:

Celerio Price
LXI MT ₹4,99,000
VXI MT ₹5,63,000
VXI AMT ₹6,13,000
ZXI MT ₹5,94,000
ZXI AMT ₹6,44,000
ZXI+ MT ₹6,44,000
ZXI+ AMT ₹6,94,000
కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

కొత్త తరం 2021 సెలెరియో - ఇంజన్, గేర్‌బాక్స్

ప్రస్తుతం, ఈ కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో కారును ఒకే ఒక పెట్రోల్ ఇంజన్‌తో ప్రవేశపెట్టారు. ఈ కారులోని కొత్త 1.0-లీటర్ K10C న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ రిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు AMT (AGS) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది.

Engine Size 1.0-litre
Engine Type Naturally aspirated, inline-3, petrol
Power 67 PS
Torque 89 Nm
Transmission 5-speed MT / 5-speed AMT

కొత్త తరం 2021 సెలెరియో - మైలేజ్

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త సెలెరియో VXi AGS వేరియంట్ అత్యధికంగా 26.68 కెఎంపిఎల్ మైలేజ్ ను అందిస్తుంది. అలాగే, LXi మాన్యువల్, VXi మాన్యువల్ మరియు ZXi మాన్యువల్ వేరియంట్లు 25.24 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుండగా, ZXi+ మాన్యువల్‌ వేరియంట్ 24.97 కెఎంపిఎల్ మైలేజీని మరియు ZXi AGS మరియు ZXi+ AGS వేరియంట్లు 26 కెఎంపిఎల్ మైలేజీని అందిస్తాయని కంపెనీ తెలిపింది.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

ఈ మైలేజ్ గణాంకాల ఆధారంగా చూస్తే, ఈ కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక మైలేజీనిచ్చే చిన్న కారుగా ఉంది. మైలేజ్ మెరుగదల కోసం ఇందులోని ఇంజన్ డ్యూయల్ జెట్ టెక్నాలజీతో వస్తుంది. ఈ టెక్నాలజీలో ఒక్కో సిలిండర్‌కు ఒకటి కాకుండా రెండేసి ఫ్యూయెల్ ఇంజెక్టర్లు ఉంటాయి, ఇవి సిలిండర్లకు ఇంధన సరఫరాపై మరింత ఖచ్చితమైన నియంత్రణను ఇస్తాయి తద్వారా ఇంజన్ మరింత మెరుగ్గా పనిచేయడానికి సహాయపడుతాయి.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

అంతేకాకుండా, ఈ కారులో ఇంజన్ ఐడిల్ స్టాప్/స్టార్ట్ టెక్నాలజీ కూడా ఉపయోగించారు. ఈ టెక్నాలజీ కారణంగా, ఇంజన్ కొంత సమయం పాటు ఐడిల్‌గా ఉన్నట్లయితే, సెన్సార్లు దానిని గుర్తించి ఇంజన్ ను ఆటోమేటిక్ గా ఆఫ్ చేస్తాయి, తిరిగి డ్రైవర్ క్లచ్ పెడల్ నొక్కగానే ఇంజన్ ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఈ విధంగా ఖాలీగా రన్నింగ్ లో ఉన్న ఇంజన్ వృధా చేసే ఇంధన ఆదా అవుతుంది, ఫలితంగా కారు ఓవరాల్ మైలేజ్ కూడా పెరుగుతుంది.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

కొత్త తరం 2021 సెలెరియో - కొలతలు, వీల్స్, బ్రేక్‌లు

కొత్త 2021 సెలెరియో కారును కంపెనీ యొక్క లేటెస్ట్ HEARTECT ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి నిర్మించారు. ఈ హ్యాచ్‌బ్యాక్ పొడవు 3695 మిమీ, వెడల్పు 1655 మిమీ, ఎత్తు 1555 మిమీ మరియు దీని వీల్‌బేస్ 2435 మిమీగా ఉంటుంది. ఈ చిన్న కారులో 313 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. ఇందులో 165/70R14 ప్రొఫైల్‌తో కూడిన వీల్స్ మరియు వాటిపై ట్యూబ్‌లెస్ టైర్లు అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి ఈ కారు ముందు భాగంలో డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లను ఉపయోగించారు. ఇందులో ఏబిఎస్ స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్‌గా వస్తుంది.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

కొత్త తరం 2021 సెలెరియో - ఎక్స్టీరియర్స్ మరియు ఇంటీరియర్స్

మారుతి సుజుకి తమ కొత్త తరం సెలెరియో హాచ్‌బ్యాక్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లను పూర్తిగా రీడిజైన్ చేసింది. బయటి వైపు నుంచి ఈ కారు ఇప్పుడు చాలా మోడ్రన్ గా కనిపిస్తుంది. పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త హెడ్‌ల్యాంప్స్ మరియు టెయిల్ ల్యాంప్స్, రీడిజైన్ చేసిన ఫ్రంట్ అండ్ రియర్ బంపర్స్ మరియు కొత్త కలర్ ఆప్షన్స్ వంటి అంశాలను ఇందులో గమనించవచ్చు.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

ఇంటీరియర్స్ లో పూర్తిగా రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డ్, సెంటర్ కన్సోల్, స్టీరింగ్ వీల్, ఏసి వెంట్స్ మరియు డోర్ ట్రిమ్స్‌పై సిల్వర్ యాక్సెంట్స్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీతో కూడిన 7.0 ఇంచ్ సుజుకి స్మార్ట్ ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌, స్మార్ట్-కీ, ఇంజన్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, ఎమ్ఐడితో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

కొత్త తరం 2021 Maruti Suzuki Celerio టెలివిజన్ కమర్షియల్ చూశారా?

కొత్త తరం 2021 సెలెరియో - సేఫ్టీ ఫీచర్లు

సేఫ్టీ పరంగా చూసుకుంటే, ఈ కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో కారును కంపెనీ పూర్తిగా అప్‌డేట్ చేసింది. ఇందులో డ్రైవర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌తో పాటుగా ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్, పెడస్టేరియన్ సేఫ్టీ, సీట్ బెల్ట్ ప్రీ టెన్షనర్, హెడ్‌లైట్ లెవలింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, వెనుక తలుపలపై చైల్డ్ ప్రూఫ్ లాక్, హైస్పీడ్ అలెర్ట్ సిస్టమ్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.

Most Read Articles

English summary
New gen 2021 maruti suzuki celerio 1st tvc out video highlights its key features
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X