కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొరియన్ కార్ బ్రాండ్ కియా కార్పోరేషన్ తమ సరికొత్త మరియు ఐదవ తరం కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీని ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. మునుపటి తరం మోడల్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2022 కియా స్పోర్టేజ్ గణనీయమైన డిజైన్ మరియు ఇంటీరియర్ అప్‌గ్రేడ్‌లను అందుకుంది.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఈ ఏడాది చివరి నాటికి కొత్త 2022 కియా స్పోర్టేజ్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబడుతుంది. కియా బ్రాండ్‌కి కొరియా, జర్మనీ, యూఎస్ మరియు చైనా మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉంది మరియు ఈ మార్కెట్లలోని కియా యొక్క ప్రధాన గ్లోబల్ డిజైన్ నెట్‌వర్క్ మధ్య సహకార ప్రయత్నం ఫలితంగా ఈ కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ ఉద్భవించింది.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీని కియా కార్పోరేషన్ యొక్క కొత్త 'ఆపోజిట్స్ యునైటెడ్' అనే డిజైన్ ఫిలాసఫీని ఆధారంగా చేసుకొని రూపొందించారు మరియు ఇది పూర్తిగా కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఇందులో ముందు వైపు బూమరాంగ్ ఆకారంలో ఉన్న కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లు, హెడ్‌లైట్‌లతో కంపెనీ యొక్క సిగ్నేచర్ టైగర్-నోస్ గ్రిల్ ఉంటుంది.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త తరం స్పోర్టేజ్ ఎస్‌యూవీ డిజైన్, కియా అనుబంధ సంస్థ అయిన హ్యుందాయ్ విక్రయిస్తున్న ప్రస్తుత తరం 2020 హ్యుందాయ్ క్రెటా డిజైన్‌ను గుర్తు చేస్తుంది. ఈ ఎస్‌యూవీ ప్రొఫైల్‌లో చాలా అంచులు మరియు క్రీజు లైన్లు కనిపిస్తాయి, వెనుక భాగంలో కూడా పూర్తిగా కొత్త డిజైన్ ఇవ్వబడింది. సిల్వర్ స్కిడ్-ప్లేట్‌తో వెనుక బంపర్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ డిజైన్ డెవలప్‌మెంట్ గురించి కియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు గ్లోబల్ డిజైన్ సెంటర్ హెడ్ కరీం హబీబ్ మాట్లాడుతూ, స్పోర్టేజ్ ఎస్‌యూవీ యొక్క పునఃసృష్టి తమ ప్రతిభావంతులైన డిజైన్ బృందాలకు నూతన ఆవిష్కరణలకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిందని అన్నారు.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

తమ డిజైన్ బృందాలు ఇటీవలి బ్రాండ్ రీ-లాంచ్‌లు మరియు సరికొత్త ఈవీ6 మోడళ్ల నుండి ప్రేరణ పొందిన ఆధునిక మరియు వినూత్న ఎస్‌యూవీ డిజైన్ల ద్వారా కస్టమర్లను ప్రేరేపించడానికి కృషి చేస్తున్నాయని చెప్పారు. సరికొత్త స్పోర్టేజ్ ఎస్‌యూవీతో తాము తమ వినియోగదారులకు తర్వాత స్థాయి డ్రైవింగ్ అనుభూతిని అందించగలమనే ధీమాతో ఉన్నామని తెలిపారు.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

కొత్త 2020 కియా స్పోర్టేజ్ ఇంటీరియర్ మరియు డాష్‌బోర్డ్ చక్కని మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఇందులో ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ మరియు టచ్‌స్క్రీన్ ఒకే ప్యానెల్‌లో ఉంచబడ్డాయి, ఇది డ్రైవర్ వైపు కొద్దిగా యాంగిల్‌లో అమర్చబడినట్లు ఉంటుంది. ఇది మెర్సిడెస్ బెంజ్ లాంటి ప్రీమియం కార్ల అనుభూతిని ఇస్తుంది. ఇంకా ఇందులో 3డి ఏసి వెంట్స్ కూడా చక్కగా డిజైన్ చేయబడ్డాయి.

MOST READ:సూపర్ కారుతో కబాబ్ తయారు చేసిన యువకుడు.. చివరకు ఏమైందంటే?

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఆవిష్కరణ; డిజైన్, ఫీచర్లు మరియు ఇతర వివరాలు

ఈ కొత్త కారులోని ఓవరాల్ క్యాబిన్ స్లిమ్ మరియు క్లీన్ లుక్‌నిస్తుంది. సెంటర్ కన్సోల్‌లో కప్ హోల్డర్స్, సాఫ్ట్-టచ్ స్విచ్‌లు మరియు షిఫ్ట్-బై-వైర్ ట్రాన్స్మిషన్ డయల్‌లతో ప్రీమియం గ్లోసీ ఫినిషింగ్స్ ఉంటాయి.

కొత్త కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీలో స్టాండర్డ్ స్పోర్టేజ్ శ్రేణితో పాటు, కియా ప్రత్యేక బంపర్లు, సైడ్ సిల్స్ మరియు వాలుగా ఉన్నట్లు ఉండే రూఫ్ ర్యాక్‌లతో కూడిన హై-స్పెక్ ఎక్స్‌-లైన్ వెర్షన్ వేరియంట్‌ను కూడా విడుదల చేయనుంది.

Most Read Articles

English summary
New-Gen Kia Sportage SUV Officially Unveiled Features Design Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X