పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzki Celerio), ఇటీవల భారత మార్కెట్లో తమ కొత్త తరం 2021 సెలెరియో (Celerio) హ్యాచ్‌బ్యాక్‌ని విడుదల చేసిన సంగతి తెలిసినదే. దేశీయ మార్కెట్లో ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 4.99 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉంది. ఇదివరకటి సెలెరియోతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం మోడల్ ఎంత వరకూ బెస్ట్ అనేది ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

మారుతి సుజుకి తమ మొదటి తరం సెలెరియో కారును తొలిసారిగా 2014 ఆటో ఎక్స్‌పో వేదికగా భారతదేశానికి పరిచయం చేసింది. ఆ తర్వాత కంపెనీ ఈ కారును 2017లో స్వల్పంగా అప్‌డేట్ చేసింది. అప్పటి నుండి ఈ కారులో పూర్తిస్థాయి అప్‌డేట్ రావడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం మార్కెట్లో విడుదల చేయబడిన 2021 సెలెరియో కారు రెండవ తరానికి చెందినది. డిజైన్, ఫీచర్లు మరియు మైలేజ్ పరంగా చూస్తే, ఈ కొత్త సెలెరియో పాత మోడల్ కన్నా ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంటుంది.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్యం (అధిక మైలేజీనిచ్చే) కారుగా పేర్కొనబడింది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, కొత్త సెలెరియో దేశంలోనే అత్యధికంగా లీటరుకు 26.68 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తున్న మొదటి హ్యాచ్‌బ్యాక్ కారు అని కంపెనీ తెలిపింది. మరి ఈ కొత్త కారు మరియు దాని పాత మోడల్ల మధ్య ప్రధాన వ్యత్యాసాలు, చేసిన మార్పులు ఏంటో చూద్దాం రండి.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కొత్త సెలెరియో vs పాత సెలెరియో - డిజైన్ మరియు కలర్ ఆప్షన్స్

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో కారును కంపెనీ యొక్క ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌ను ఆధారంగా చేసుకొని నిర్మించారు. పాత సెలెరియో ఓవరాల్ బాక్సీ టైప్ రూపాన్ని కలిగి ఉండగా, కొత్త సెలెరియో, దీనికి విరుద్ధంగా మరింత గుండ్రని డిజైన్‌ శైలిని కలిగి ఉంటుంది. కొత్త సెలెరియో ముందు భాగంలో ఒక చిన్న గ్రిల్ ఇవ్వబడింది, దానిపై సింగిల్ స్లాట్ క్రోమ్ లైనింగ్ ఉంటుంది. ఇది ఓవల్ ఆకారపు హెడ్‌లైట్ మరియు ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్‌ని కలిగి ఉంది. పాత సెలెరియో ముందు భాగంలో పెద్ద గ్రిల్ మరియు ఎయిర్ డ్యామ్‌ను పొందగా, దాని హెడ్‌ల్యాంప్‌లు బాక్సీ డిజైన్‌లో ఉంచబడ్డాయి.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కొత్త మరియు పాత సెలెరియో మోడళ్లు రెండింటిలోనూ సాధారణ హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు టెయిల్ లైట్ యూనిట్‌లనే ఉపయోగిచారు. అలాగే, దీని సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త సెలెరియోలో బ్లాక్-అవుట్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, అన్ని డోర్లపై లిఫ్ట్-టు-ఓపెన్ టైప్ హ్యాండిల్స్ మరియు వెనుకవైపు కోణీయ టెయిల్‌ల్యాంప్‌లను కలిగి ఉంటుంది. కొత్త సెలెరియో ఆరు రంగులలో లభిస్తుంది - అవి ఫైర్ రెడ్, స్పీడీ బ్లూ, సిల్కీ సిల్వర్, గ్లిస్టరింగ్ గ్రే, ఆర్కిటిక్ వైట్ మరియు కెఫిన్ బ్రౌన్.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కొత్త సెలెరియో vs పాత సెలెరియో - కొలతలు

పరిమాణం పరంగా చూస్తే, కొత్త 2021 సెలెరియో పాత మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. దీని మొత్తం పొడవు 3,695 మిమీ, వెడల్పు 1,655 మిమీ మరియు ఎత్తు 1,555 మిమీ. పాత సెలెరియో పొడవు మరియు ఎత్తు పరంగా పాత మోడల్‌తో సమానంగా ఉన్నప్పటికీ, దాని వెడల్పు కొత్త తరం మోడల్ కన్నా 55 మిమీ తక్కువగా ఉంటుంది. పాత మోడల్ తో పోలిస్తే, కొత్త మోడల్ వీల్‌బేస్ ఇప్పుడు 10 మిమీ పెరిగి 2,435 మిమీగా ఉంటుంది. కొత్త సెలెరియో గ్రౌండ్ క్లియరెన్స్ 170 మిమీ గా ఉంటుంది, ఇది పాత మోడల్ కంటే 5 మిమీ ఎక్కువ.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కొత్త సెలెరియో vs పాత సెలెరియో - ఇంజన్ మరియు గేర్‌బాక్స్

కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో కారును సింగిల్ పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేశారు. ఇందులో ఉపయోగించిన కొత్త 1.0-లీటర్ K10C న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి శక్తిని మరియు 89 ఎన్ఎమ్ రిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు AMT (AGS) ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. కొత్త సెలెరియో కోసం క్లెయిమ్ చేయబడిన మైలేజ్ 26.68 kmpl గా ఉంటుంది.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

ఇక పాత సెలెరియో విషయానికి వస్తే, ఈ కారులో 998 సిసి K10B పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇందులో సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండేది. పెట్రోల్ వెర్షన్ లోని ఈ ఇంజన్ గరిష్టంగా 67.4 బిహెచ్‌పి పవర్‌ను మరియు 90 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పాత సెలెరియో 23.1 kmpl సర్టిఫైడ్ మైలేజీని ఆఫర్ చేసేది. అయితే, వాస్తవ ప్రపంచంలో ఇది పట్టణ రహదారులపై 20 kmpl సగటు మైలేజ్‌ని కలిగి ఉంటుంది.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కొత్త సెలెరియో vs పాత సెలెరియో - ఫీచర్లు మరియు సేఫ్టీ

మారుతి సుజుకి తమ కొత్త తరం 2021 సెలెరియో కారు లోపలి భాగాలను పూర్తిగా రీడిజైన్ చేసింది మరియు పాత మోడల్ కంటే ఎక్కువ ఫీచర్లను కూడా జోడించింది. ఈ కారులో Android Auto మరియు Apple CarPlay కనెక్టివిటీతో కూడిన 7.0 ఇంచ్ సుజుకి స్మార్ట్ ప్లే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉంటుంది. దీనితో పాటుగా ఇందులో స్మార్ట్-కీ, ఇంజన్ పుష్ స్టార్ట్/స్టాప్ బటన్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్, ఎమ్ఐడితో కూడిన అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు మెరుగైన మైలేజ్ కోసం ఇంజన్ ఐడిల్ స్టార్ట్ / స్టాప్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

అలాగే, సేఫ్టీ పరంగా కూడా కొత్త 2021 సెలెరియో పూర్తిగా అప్‌డేట్ చేయబడింది. ఈ కారులో డ్రైవర్ సీట్ ఎయిర్‌బ్యాగ్‌తో ఫ్రంట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఈబిడితో కూడిన ఏబిఎస్, బ్రేక్ అసిస్ట్, పార్కింగ్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్ మరియు సెగ్మెంట్-ఫస్ట్ హిల్-హోల్డ్ అసిస్ట్ వంటి సేఫ్టీ ఫీచర్లను కంపెనీ అందిస్తోంది.

పాత మోడల్‌తో పోలిస్తే కొత్త తరం 2021 Maruti Celerio ఎంత వరకూ బెస్ట్..?

కొత్త సెలెరియో vs పాత సెలెరియో - ధర

కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో LXi, VXi, ZXi మరియు ZXi+ అనే నాలుగు ట్రిమ్‌లలో మొత్తం ఏడు వేరియంట్లలో విడుదల చేయబడింది. మార్కెట్లో ఈ కొత్త సెలెరియో ధరలు రూ. 4.99 లక్షల నుంచి ప్రారంభమై రూ. 6.94 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉన్నాయి. అలాగే, పాత మోడల్ సెలెరియో ధరల విషయానికి వస్తే, దీనిని రూ. 4.14 లక్షల నుంచి రూ. 6.08 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో విక్రయించారు. ఈ కారు ఈ విభాగంలో టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో, మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

Most Read Articles

English summary
New gen maruti celerio vs old celerio design engine mileage features comparison
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X