కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

భారతదేశపు అతిపెద్ద ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki), దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ స్మాల్ కార్ 'సెలెరియో' (Celerio) లో కంపెనీ తమ రెండవ తరం (సెకండ్ జనరేషన్) మోడల్ ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా, కంపెనీ నేటి (నవంబర్ 2, 2021) నుండి ఈ కారు కోసం బుకింగ్ లను కూడా ప్రారంభించింది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో (2021 Maruti Suzuki Celerio) కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ నవంబర్ 10, 2021 వ తేదీన మార్కెట్లో విడుదల కానుంది. ఆ వెంటనే ఈ కారు డెలివరీలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ చిన్న కారు పట్ల ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో కానీ లేదా అధికారిక డీలర్‌షిప్ లో కానీ రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి గత కొన్ని నెలలుగా ఈ చిన్న కారును భారత రోడ్లపై విస్తృతంగా పరీక్షిస్తోంది. వాస్తవానికి, కొత్త 2021 సెలెరియో ఇప్పటికే మార్కెట్లోకి అందుబాటులోకి రావల్సి ఉంది. కానీ, అనేక కారణాల వలన ఈ కారు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. కాగా, ఇప్పుడు మారుతి సుజుకి ఈ కొత్త సెలెరియో కారును డీలర్‌షిప్‌ లకు డెలివరీ చేయడం కూడా ప్రారంభించింది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త 2021 సెలెరియో దేశంలోనే అత్యంత ఇంధన సామర్థ్యం కలిగిన పెట్రోల్ కారు అని కంపెనీ పేర్కొంది మరియు కంపెనీ ఈ కారులో అనేక మార్పులు చేర్పులు చేయనుంది. ఇప్పటి వరకూ మార్కెట్లోకి వచ్చిన సెలెరియో మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం 2021 సెలెరియో మోడల్ మునుపటి కంటే అనేక రెట్లు మెరుగ్గా ఉంటుందని తెలుస్తోంది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

మారుతి సుజుకి ఈ నెక్స్ట్ జనరేషన్ సెలెరియో కారును మరింత కోణీయ డిజైన్, పెద్ద బాడీ బిల్డ్ మరియు అప్-మార్కెట్ ఇంటీరియర్ తో అభివృద్ధి చేసింది. అంతేకాకుండా, దీని ఇంజన్ విషయంలో కూడా కంపెనీ కొంత మార్పు చేసినట్లు తెలుస్తోంది. ఇది పవర్ మరియు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా అత్యుత్తమంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదనిపిస్తోంది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

లేటెస్ట్ మారుతి సుజుకి సెలెరియో కారును కంపెనీ యొక్క ఐదవ తరం హార్ట్‌టెక్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఫలితంగా, ఈ కారులో మునుపటి కన్నా మరిన్ని కొత్త ఫీచర్లను ఆశించవచ్చు. ఇందులో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్స్, ఫాగ్ లైట్లు, ఇంటీరియర్‌లో కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, సింగిల్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు వృత్తాకారపు డిజిటల్ స్క్రీన్ మొదలైనవి ఇందులో ఉండనున్నాయి.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

హెడ్‌లైట్స్ మరియు టెయిల్స్ డిజైన్ కూడా అప్‌గ్రేడ్ చేయబడింది మరియు బాడీపై మజిక్యులర్ క్రీజ్ లైన్స్ జోడించడం జరిగింది. కొత్త వీల్ ఆప్షన్స్, డ్యూయెల్ టోన్ సైడ్ మిర్రర్స్ మరియు వాటిపై టర్న్ ఇండికేటర్స్, బాడీ కలర్ బంపర్స్ అండ్ డోర్ హ్యాండిల్స్ మరియు దాని ప్రీమియం లుక్ ని మరించ పెంచేందుకు ఎక్స్టీరియర్ లో క్రోమ్ గార్నిష్ వంటి మార్పులను ఇందులో ఆశించవచ్చు.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

కొత్త సెలెరియో ఇంజన్ విషయానికి వస్తే, ఇది కొత్త తరం సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వివిటి ఇంజన్ తో రానుంది. దీనికి ఐడిల్ స్టార్ట్ / స్టాప్ ఆప్షన్ కూడా ఇవ్వబడుతుందని సమాచారం. ఈ ఫీచర్ వలన కారు నిర్ధిష్ట సమయం కన్నా ఎక్కువ సేపు ఐడిల్ గా ఉంటే, ఇంజన్ ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతుంది మరియు తిరిగి క్లచ్ నొక్కగానే ఇంజన్ స్టార్ట్ అవుతుంది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

ఈ కొత్త ఇంజన్ ఐడిల్ స్టాప్ / స్టార్ట్ ఫీచర్ కారణంగా 2021 సెలెరియో మైలేజ్ మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుందని కంపెనీ చెబుతోంది. ఇవే కాకుండా, క్యాబిన్ లోపల డ్రైవర్ మరియు ప్రయాణీకుల సౌకర్యాన్ని మెరుగుపరచే కొత్త ఫీచర్లను కూడా కంపెనీ ఇందులో జోడించే అవకాశం ఉంది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ పరిమాణంలో కూడా చాలా గొప్పగా ఉంటుందని సమాచారం. అయితే, కంపెనీ ఇంకా దీని కొలతలను అధికారికంగా వెల్లడించలేదు.

ఈ ఏడాది మారుతి సుజుకి విడుదల చేసిన స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ తర్వాత, కంపెనీ నుండి తదుపరి లాంచ్ ఈ కొత్త 2021 మారుతి సెలెరియో అవుతుంది. మారుతి సుజుకి ప్రస్తుతం ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే, సెమీకండక్టర్ చిప్‌ల కొరతను ఎదుర్కొంటోంది. అయితే, వీటి అవసరం ఎక్కువగా ప్రీమియం మరియు హై-ఎండ్ కార్లలో మాత్రమే ఉంటుంది కాబట్టి, సెలెరియో లాంటి చిన్న కార్లు ఈ చిప్స్ కొరత వలన ప్రభావితం కావు.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

కాబట్టి, మారుతి సుజుకి ఈ కొత్త 2021 సెలెరియోకు వచ్చే డిమాండ్ ను తక్షణమే తీర్చగలదని భావిస్తున్నారు. ఈ విషయంలో కంపెనీ ఎంత మేర సక్సెస్ సాధిస్తుందో వేచి చూడాలి. ఈ కారులోని ఇంటీరియర్ లు మునుపటి కన్నా కాస్తంత ప్రీమియంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, స్టీరింగ్ వీల్ పై ఆడియో కంట్రోల్స్ వంటి అనేక ఇతర ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

సేఫ్టీ పరంగా చూస్తే, కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో కారులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కోసం), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇంజన్ ఇమ్మొబిలైజర్, వెనుక తలుపులపై చైల్డ్ ప్రూఫ్ లాక్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ మొదలైన వాటిని పొందే అవకాశం ఉంది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

సమాచారం ప్రకారం, కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారులో కొత్త తరం 1.0 లీటర్ కె10సి, 3-సిలిండర్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ ఇంజన్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఆటో గేర్ షిఫ్ట్ (AGS) ఆటోమేటిక్ ఆప్షన్‌లతో అందుబాటులోకి రానుంది.

ఈ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 67 బిహెచ్‌పి పవర్ మరియు 90 న్యూటన్ మీటర్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌ తో లీటరుకు 21.63 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తుంది. పెట్రోల్ ఫ్యూయెల్ ఆప్షన్ తో పాటుగా ఈ ఇంజన్ సిఎన్‌జి కిట్ తో కూడా లభ్యం కానుంది. ఈ ఇంజన్ సిఎన్‌జి మోడ్‌ లో 59 బిహెచ్‌పి పవర్ ను మరియు 78 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

కొత్త 2021 Maruti Celerio బుకింగ్స్ ఓపెన్, లాంచ్ ఎప్పుడంటే..?

సిఎన్‌జి వెర్షన్ సెలెరియో మాత్రం కేవలం 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. ఇది కేజీకి 30.47 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో సిఎన్‌జి ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 35 లీటర్లు మరియు పెట్రోల్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లుగా ఉంటుంది. కంపెనీ ఈ కారును తమ సిగ్నేచర్ S-CNG టెక్నాలజీతో తీసుకురానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
New gen maruti suzuki celerio booking open design engine updates
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X