కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిన్న కారు కొత్త తరం 2021 సెలెరియో (2021 Celerio) ను కంపెనీ మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో కొత్త తరం సెలెరియో హ్యాచ్‌బ్యాక్ ధరలు 4.99 లక్షల నుండి రూ. 6.94 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. ఈ మోడల్ కోసం దేశవ్యాప్తంగా బుకింగ్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఆసక్తిగల కస్టమర్లు రూ. 11,000 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి వెబ్‌సైట్ లో కానీ లేదా అధికారిక డీలర్‌షిప్ నుండి కానీ బుక్ చేసుకోవచ్చు.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

మొదటి సారిగా కొత్త కారు కొనుగోలు చేయాలనుకునే వారికి కొత్త సెలెరియో ఉత్తమ ఎంపికగా ఉంటుంది. కంపెనీ ఇప్పుడు కారును మోడ్రన్ డిజైన్ మరియు లేటెస్ట్ టెక్ ఫీచర్లతో అందుబాటులోకి తెచ్చింది. అయితే, ఈ కారును కొనడానికి ముందుగా, కొత్త తరం 2021 మారుతి సుజుకి సెలెరియో కారులో లభించే వేరియంట్లు మరియు ఆయా వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం రండి..!

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

2021 Maruti Suzuki Celerio - వేరియంట్ వివరాలు

మారుతి సుజుకి తమ కొత్త తరం సెలెరియో కారును కేవలం పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ తో మాత్రమే అందిస్తోంది. ఇది మాన్యువల్ మరియు ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్లతో విక్రయిస్తోంది. ధర మరియు ఫీచర్ల ఆధారంగా ఈ కారును LXi, VXi, ZXi మరియు ZXi+ అని నాలుగు వేరియంట్లలో విడుదల చేశారు. ఇందులోని బేస్ వేరియంట్ (LXi) కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో మాత్రమే లభిస్తుంది.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

1. Celerio LXi వేరియంట్: ధర రూ. 4.99 లక్షలు

సెలెరియో ఎల్ఎక్స్ఐ వేరియంట్‌లో క్రోమ్ యాక్సెంట్స్‌తో కూడిన ఫ్రంట్ గ్రిల్, బాడీ కలర్ బంపర్, మాన్యువల్ AC, 12V పవర్ సాకెట్, పవర్ స్టీరింగ్, ఇంటిగ్రేటెడ్ ఫ్రంట్ మరియు రియర్ హెడ్‌రెస్ట్‌లు, పోలెన్ ఫిల్టర్, అంబర్ లైటింగ్, డోర్ అజార్ వార్నింగ్ ల్యాంప్, డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, ఫ్రంట్ వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఉన్న ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌పై, ఫ్యూయెల్ ట్యాంక్ లో మిగిలి ఉన్న ఇంధనం సాయంతో మీరు ఎంత దూరం వెళ్లవచ్చు అనే సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

అంతేకాకుకండా, ఈ కారులో డ్రైవర్ సైన్ వైజర్, బ్రేక్ అసిస్ట్, ఇంజన్ ఇమ్మొబిలైజర్, హై స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్, పాదచారుల రక్షణ, సీట్ బెల్ట్ రిమైండర్, ఫ్రంట్ సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్ మరియు ఫోర్స్ లిమిటర్, లో ఫ్యూయెల్ అలెర్ట్, హెడ్‌ల్యాంప్ ఆన్ వార్నింగ్, కీ-ఆఫ్/హెడ్‌ల్యాంప్ ఆన్ రిమైండర్ మరియు ఇంజన్ ఐడిల్ స్టార్ట్ స్టాప్ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

2. Celerio VXi వేరియంట్: ధర రూ. 5.63 లక్షలు (MT); రూ. 6.13 లక్షలు (AMT)

సెలెరియో విఎక్స్ఐ లోవర్ మిడ్-స్పెక్ వేరియంట్, ఇందులో ఎల్ఎక్స్ఐ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లతో పాటుగా బాడీ కలర్ సైడ్ మిర్రర్స్ మరియు డోర్ హ్యాండిల్స్, ఫుల్ వీల్ కవర్లు, సన్‌వైజర్‌లో కో-డ్రైవర్ వానిటీ మిర్రర్, డే అండ్ నైట్ ఇన్‌సైడ్ రియర్ వ్యూ మిర్రర్, రియర్ పార్శిల్ షెల్ఫ్ మరియు 60:40 స్ప్లిట్ సీట్ వంటి ఫీచర్లు కూడా లభిస్తాయి.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

ఇంకా ఇందులో ఆల్-పవర్ విండోస్ (ఆటో డౌన్ - డ్రైవర్ సైడ్), ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల సైడ్ మిర్రర్స్, సెంట్రల్ డోర్ లాక్, డయల్-టైప్ క్లైమేట్ కంట్రోల్, స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, అవుట్‌డోర్ టెంపరేచర్ మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ డిస్‌ప్లే, హిల్ హోల్డ్ అసిస్ట్ (AGS వేరియంట్లో మాత్రమే) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

3. Celerio ZXi వేరియంట్: ధర రూ. 5.94 లక్షలు (MT); రూ. 6.44 లక్షలు (AMT)

సెలెరియో జెడ్ఎక్స్ఐ అప్పర్ మిడ్-స్పెక్ వేరియంట్. ఈ వేరియంట్లో విఎక్స్ఐ వేరియంట్లో లభించే అన్ని ఫీచర్లతో పాటుగా టర్న్ ఇండికేటర్‌లతో కూడిన సైడ్ మిర్రర్లు, వెనుక విండ్‌షీల్డ్ పై వైపర్‌ మరియు వాషర్, వెనుక విండ్‌షీల్డ్ పై డీఫాగర్, టిల్ట్ స్టీరింగ్, సుజుకి స్మార్ట్ ప్లే డాక్, 4 స్పీకర్లు, కీలెస్ ఎంట్రీ, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇతర వేరియంట్లలో మాదిరిగా అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో లభిస్తాయి.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

4. Celerio ZXi+ వేరియంట్: ధర రూ. 6.44 లక్షలు (MT); రూ. 6.94 లక్షలు (AMT)

సెలెరియో జెఎడ్ఎక్స్ఐ ప్లస్ టాప్-ఆఫ్ ది లైన్ వేరియంట్. ఈ టాప్ ఎండ్ వేరియంట్ ఫుల్లీ లోడెడ్ ఫీచర్లతో లభిస్తుంది. ఇందులో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్లు, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్ ఫీచర్, స్మార్ట్ కీ, సుజుకి స్మార్ట్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే కనెక్టివిటీ, నావిగేషన్‌తో కూడిన స్మార్ట్‌ప్లే ఆడియో సిస్టమ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అర్బన్ బ్లాక్ 15 ఇంచ్ అల్లాయ్ వీల్స్, డోర్ రిక్వెస్ట్ స్విచ్‌తో కూడిన బ్లాక్ బి-పిల్లర్ మరియు హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి కీలక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

కొత్త తరం Maruti Suzuki Celerio లో వేరియంట్ల వారీగా లభించే ఫీచర్లు, ధరలు

Celerio - ఇంజన్, మైలేజ్

కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియోలో కంపెనీ లేటెస్ట్ 1.0-లీటర్ కె10సి సిరీస్ త్రీ-సిలిండర్ డ్యూయెల్ జెట్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించింది. ఈ ఇంజన్ గరిష్టంగా 65 బిహెచ్‌పి పవర్ ను మరియు 89 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ లేదా ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ తో లభిస్తుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇదే అత్యధిక మైలేజీనిచ్చే చిన్న పెట్రోల్ కారు అని తెలిపింది. ఇది లీటరు పెట్రోల్ కి 26.68 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని మారుతి సుజుకి పేర్కొంది.

Most Read Articles

English summary
New gen maruti suzuki celerio variant wise features explained
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X