Honda Amaze Facelift రివ్యూ వీడియో.. వచ్చేసింది.. ఓ లుక్కెయ్యండి

Honda Amaze మొదటిసారిగా 2013 లో ప్రారంభించబడింది. ఈ సెడాన్ ప్రారంభించినప్పటి నుంచి దేశీయ మార్కెట్లో Maruti Suzuki Dzire, Ford Aspire వంటి వాటికి ప్రత్యర్థిగా నిలిచింది. Honda Amaze మంచి ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు మంచి ధర కూడా కలిగి ఉండటం వల్ల మంచి అమ్మకాలతో ముందుకు సాగింది.

ఇదిలా ఉండగా Honda కంపెనీ తన Honda Amaze యొక్క సెకండ్ జనరేషన్ కారుని 2018 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించింది. అయితే ఇది 2021 ఆగష్టు 18 న భారతీయ మార్కెట్లో అధికారికంగా రూ. 6.32 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదలయ్యింది. ఇందులో దీని టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 11.15 లక్షలు. కొత్త Honda Amaze Facelifted మోడల్‌ లో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్సన్స్ అలాగే ఉన్నప్పటికీ, ఫీచర్ల పరంగా కొంత అప్డేట్ అయ్యింది.

ఇటీవల Honda Amaze Facelifted డ్రైవ్ చేసే అవకాశం మాకు లభించింది. ఈ కొత్త Honda Amaze Facelifted గురించి మరింత సమచ్చరం కోసం కింద వీడియో చూడండి.

Honda Amaze Facelifted అద్భుతమైన డిజైన్ కలిగి ఉంటుంది. ఇందులో రీడిజైన్ చేయబడిన బంపర్, కొత్త LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, C- ఆకారపు LED టెయిల్‌ల్యాంప్‌లు, LED DRL లు మరియు ఫాగ్ ల్యాంప్‌లు, రీడిజైన్ చేయబడిన క్రోమ్ ఫ్రంట్ గ్రిల్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, 15 ఇంచెస్ అల్లాయ్ ఉన్నాయి.

సీట్ అప్‌హోల్‌స్టరీతో సహా అనేక అప్‌గ్రేడ్‌లతో కొత్త Honda Amaze ఇంటీరియర్ కూడా బాగా సవరించబడింది. లోపల శుభ్రమైన గాలి కోసం అప్‌గ్రేడ్ చేయబడిన క్యాబిన్ ఫిల్టర్ ఉంది. డాష్‌బోర్డ్‌లో శాటిన్ సిల్వర్ అసెంట్, క్లైమేట్ కంట్రోల్, హోండా స్మార్ట్ కీ మరియు పుష్-బటన్ స్టార్ట్ కూడా ఉన్నాయి.

అంతే కాకుండా ఇందులో 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వాయిస్ కమాండ్‌లతో సహా ఇతర ఫీచర్లతో పాటు, మెట్రోయిడ్ గ్రే, ప్లాటినం పెర్ల్ వైట్, లూనార్ సిల్వర్, గోల్డెన్ బ్రౌన్ మరియు రేడియంట్ రెడ్ అనే 5 కలర్స్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది.

కొత్త 2021 Honda Amaze పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి 1.2-లీటర్ i-Vtec ఇంజిన్ కాగా, మరొకటి 1.5 లీటర్ ఐ-డిటెక్ డీజిల్ ఇంజిన్. ఈ రెండు ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ లేదా 7-స్టెప్ CVT ట్రాన్స్‌మిషన్‌తో వస్తాయి. 1.2-లీటర్ i-Vtec ఇంజిన్ కారు 88 బిహెచ్‌పి మరియు ఇది 110 ఎన్ఎమ్ టార్క్‌ అందించింది.

ఇక డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే, ఇందులోని మాన్యువల్ వేరియంట్ 98.6 బిహెచ్‌పి పవర్ మరియు 200 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను అందిస్తుంది. అదేవిధంగా సివిటి వేరియంట్ 78.9 బిహెచ్‌పి పవర్ మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

Honda Amaze అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఆటోమేటిక్ హెడ్‌లైట్ కంట్రోల్, రియర్ పార్కింగ్ కెమెరా, ఏబీఎస్ విత్ ఈబిడి, ఐసోఫిక్స్ మౌంట్‌లు మరియు ఇంజిన్ ఇమ్మొబిలైజర్ వంటివి వున్నాయి. దేశీయ మార్కెట్లో Honda Amaze కారు Maruti Suzuki Dzire, Tata Tigor, మరియు Ford Aspire వంటికి ప్రత్యర్థిగా ఉంటుంది. 2021 Honda Amaze రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Honda Amaze Facelift రివ్యూ వీడియో
Most Read Articles

Read more on: #హోండా #honda
English summary
New honda amaze compact sedan first drive review video
Story first published: Thursday, August 26, 2021, 10:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X