భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

అమెరికన్ కార్ బ్రాండ్ అయిన Jeep (జీప్) ప్రపంచవ్యాప్తంగా శక్తివంతమైన ఆఫ్-రోడ్ కార్లకు ప్రసిద్ధి చెందింది. Jeep కంపెనీ ఇప్పటికే మార్కెట్లో 2021 రాంగ్లర్ ఎడిషన్ మరియు జీప్ కంపాస్ వంటి అద్భుతమైన మోడల్స్ విడుదల చేసి అత్యంత ప్రజాదరణ పొందాయి. అయితే ఈ క్రమంలో కంపెనీ మరో కొత్త SUV ని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

Jeep కంపెనీ కొత్త 2022 Grand Cherokee (2022 జీప్ గ్రాండ్ చెరోకీ) ని 2021 సెప్టెంబర్ 29 న ప్రారంభించనున్నట్లు తెలిసింది. భారతీయ మార్కెట్లో విడుదలకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee లేటెస్ట్ టెక్నాలజీ కలిగి ఉంటుంది. ఈ కొత్త కార్ విలాసవంతంగా ఉండటమే కాకుండా 4x4 సామర్థ్యం కలిగి ఉంటుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

Jeep కంపెనీ ఈ కొత్త 2022 Grand Cherokee SUV ని 2021 న్యూయార్క్ ఆటో షోలో ఆవిష్కరించబడుతుందని భావించారు. కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ప్రబలిన కరోనా మహమ్మారి కారణంగా కారణంగా న్యూయార్క్ మోటార్ షో రద్దు చేయబడిన తర్వాత కంపెనీ ప్రణాళికలు రద్దు చేయబడ్డాయి.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

2022 Grand Cherokee గ్లోబల్ లాంచ్‌కు ముందు Jeep కంపెనీ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ఒక చిన్న టీజర్ వీడియోను విడుదల చేసింది. ఇందులో 2022 Grand Cherokee యొక్క ఫ్రంట్ ఎండ్‌ను వెల్లడించబడింది. ఈ టీజర్ వీడియో ఆధారంగా, రెండు వరుసల సీటర్ గ్రాండ్ చెరోకీ ఫ్రంట్ ఎండ్ దాని పాత మోడల్‌తో సమానంగా కనిపిస్తుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

2022 Grand Cherokee SUV సన్నని హెడ్‌ల్యాంప్‌లతో సిగ్నేచర్ స్టైల్ 7-స్లాట్ గ్రిల్‌ను పొందుతుంది. ఈ కొత్త SUV కూడా ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వేరియంట్‌లో అందించబడుతుంది. ప్రస్తుతం రానున్న కొత్త SUV హైబ్రిడ్ కార్ల శ్రేణిలో చేరిన నాలుగో కారు అవుతుంది. అంతకుముందు కంపెనీ Jeep Wrangler 4Xe, Compass 4Xe మరియు Renegade 4Xe వంటి మోడల్స్ లాంచ్ చేసింది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

2022 Grand Cherokee యొక్క ఫీచర్ల విషయానికొస్తే, ఇది 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో యుకనెక్ట్ 5, 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు ముందు వరుసలకు హీటెడ్ వెంటిలేటెడ్ సీట్‌లతో వస్తుంది. అంతే కాకుండా ఇందులో పవర్ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లను పొందుతారు.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

వీటితో పాటు ఈ కొత్త SUV యాక్టివ్ డ్రైవింగ్ అసిస్ట్, FCA లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంటుంది. అంటే కాకుండా ఇందులో 360-డిగ్రీ కెమెరా, రియర్ క్రాస్ పాత్ డిటెక్షన్ మరియు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ వంటి అప్డేటెడ్ ఫీచర్స్ కూడా ఉండనున్నాయి. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త Grand Cherokee ధర రూ. 75 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉండే అవకాశం ఉంటుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

కంపెనీ ఈ కొత్త 2022 Grand Cherokee SUV యొక్క ఫీచర్స్ మరియు ఇంజిన్ స్పెసిఫికేషన్స్ వంటివి అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇందులో వి6 మరియు వి8 ఇంజిన్‌లు ఉండే అవకాశం ఉంటుంది. ఇందులోని మొదటి ఇంజిన్ 289 బిహెచ్‌పి పవర్‌తో పాటు 352 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అదేవిధంగా రెండవ ఇంజిన్ 352 బిహెచ్‌పి పవర్ మరియు 528 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెల్లడవుతుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

Jeep కంపెనీ ఇప్పటికే అందించిన సమాచారం ప్రకారం, కంపెనీ 2025 నాటికి దాదాపు 75 శాతం మోడళ్లను ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చటానికి సిద్దమవుతుంది. అయితే ప్రస్తుతం 4xe కార్లు కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. జీప్ ఈ హైబ్రిడ్ కార్లను 2025 తర్వాత పూర్తిగా ఎలక్ట్రిక్‌గా మార్చనుంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

Jeep కంపెనీ తమ కొత్త Commander ఎస్‌యూవీని ఇప్పటికే బ్రెజిల్‌లో ఆవిష్కరించింది. ఈ కొత్త 2022 Jeep Commander (జీప్ కమాండర్) ఇప్పుడు 7-సీటర్ ఎస్‌యూవీగా లభ్యం కానుంది. ఇటీవల ఇది రోడ్లపై టెస్ట్ చేసే సమయంలో గుర్తించబడింది. అయితే కంపెనీ దీని గురించి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, ఇది వచ్చే ఏడాదికి భారతీయ మార్కెట్లో విదులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్‌లో ఆవిష్కరణకు సిద్దమవుతున్న 2022 Jeep Grand Cherokee; వివరాలు

కొత్త Jeep Commander భారతీయ మార్కెట్లో విడుదలైన తర్వాత Volkswagen Tiguan మరియు MG Gloster వంటికి ప్రత్యర్థిగా ఉంటుంది. Jeep Commander బ్రెజిల్‌లోని పెర్నాంబుకోలోని జీప్ ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు. ఇది చూడటానికి ఆకర్షణీయంగా మరియు వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

Most Read Articles

Read more on: #జీప్ #jeep
English summary
New jeep grand cherokee to debut on 29th september features specs engine details
Story first published: Monday, September 27, 2021, 16:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X