వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

Mahindra & Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) కంపెనీ దేశీయ మార్కెట్లో తన కొత్త SUV అయిన Mahindra XUV700 యొక్క బుకింగ్స్ నిన్న (07 అక్టోబర్) నుంచి అధికారికంగా స్వీకరించడం ప్రారంభించింది. అయితే కంపెనీ బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక గంటలో మొత్తం 25,000 బుకింగ్స్ స్వీకరించబడ్డాయని కంపెనీ తెలిపింది. దీని గురించి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

భారతీయ మార్కెట్లో Mahindra కంపెనీ అత్యంత ప్రజాదరణ పొందిన కంపెనీలలో ఒకటి. కావున ఈ కంపెనీ యొక్క వాహనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క XUV700 బుకింగ్స్ గంట వ్యవధిలోనే 25,000 బుకింగ్స్ పొందగలిగింది.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

అయితే ఈ XUV700 యొక్క పరిచయ ధరలు కేవలం 25,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం వల్ల, ఇకపై ఈ XUV700 ధరలు పెరిగాయి. ఇప్పుడు XUV700 ప్రారంభ ధర రూ .12.49 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది. ఇందులోని పెట్రోల్ బేస్ వేరియంట్ ధర, దాని డీజిల్ బేస్ వేరియంట్ ధర కూడా రూ .12.99 లక్షలకు (ఎక్స్-షోరూమ్) పెరిగింది.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

అయితే కంపెనీ ఈ కొత్త XUV700 యొక్క అన్ని వేరియంట్ల ధరలను పెంచలేదు. అయితే కంపెనీ ఈ కొత్త XUV700 SUV బుకింగ్స్ నిలిపివేసింది. అయితే మళ్ళీ కంపెనీ ఈ కొత్త SUV బుకింగ్స్ ని 2021 అక్టోబర్ 8 ఉదయం 10 గంటల నుండి తిరిగి ప్రారంభించనుంది. కొనుగోలుదారులు దీనిని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో లేదా కంపెనీ డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

Mahindra XUV700 అతి తక్కువ సమయంలో పొందగలిగిన బుకింగ్స్ గురించి Mahindra & Mahindra (మహీంద్రా అండ్ మహీంద్రా) ఆటోమోటివ్ డివిజన్ సిఇఒ Veejay Nakra మాట్లాడుతూ, మేము ఈ రోజు ఉదయం 10 గంటలకు బుకింగ్‌లు ప్రారంభించాము. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం 57 నిముషాల్లో XUV700 రికార్డ్ స్థాయిలో ఏకంగా 25,000 బుకింగ్స్ పొందగలిగింది. నిజంగా ఇది గొప్ప విషయం.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

మేము మా అధికారిక వెబ్‌సైట్‌కి ట్రాఫిక్‌ను అంచనా వేసాము, కావున అదనపు సర్వర్ సామర్థ్యంతో మా సిస్టమ్‌ను సిద్ధం చేసాము, మా వినియోగదారుల్లో కొంతమందికి తీవ్రమైన ట్రాఫిక్ కారణంగా కొంత ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది, అన్నారు.

అంతే కాకుండా కంపెనీ ఈ మోడల్ పేరు అధికారికంగా వెల్లడించినప్పటి నుంచి, భారీ అంచనాలతో ముందుకు సాగింది. ఈ భారీ అంచనాలే ఇప్పుడు ఇన్ని బుకింగ్స్ పొందటానికి కారణం అయ్యింది.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

దీనితో పాటు కంపెనీ యొక్క వీడియో అత్యధికంగా 223 మిలియన్లకు పైగా స్థూల వీక్షణలను పొందింది. అంతే కాకుండా 6.48 మిలియన్ వెబ్‌సైట్ సందర్శకులు, 4.2 మిలియన్ సోషల్ మీడియా ఎంగేజ్‌మెంట్‌లను మరియు 2.6 లక్షలకు ఈ కొత్త SUV కోసం జరిగిన విచారణలను అందుకుంది.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

కొత్త Mahindra XUV700 ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది. కావున ఇది వాహన వినియోగాదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. Mahindra XUV700 అక్టోబర్ 1 నుండి డీలర్‌షిప్‌లలో ప్రదర్శించడం ప్రారంభమైంది, కావున కస్టమర్లు డీలర్‌షిప్‌లను సందర్శించి దానిని తనిఖీ చేయవచ్చు. అయితే కంపెనీ ఈ SUV యొక్క మొదటి దశ టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ 2 నుండి ప్రారంభించబడింది. మీరు బుకింగ్‌కు ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే, మీరు నేరుగా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టెస్ట్ డ్రైవ్‌ను ఎంచుకోవచ్చు.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

Mahindra XUV700 అక్టోబర్ 1 నుండి డీలర్‌షిప్‌లలో ప్రదర్శించడం ప్రారంభమైంది, కావున కస్టమర్లు డీలర్‌షిప్‌లను సందర్శించి దానిని తనిఖీ చేయవచ్చు. అయితే కంపెనీ ఈ SUV యొక్క మొదటి దశ టెస్ట్ డ్రైవ్ అక్టోబర్ 2 నుండి ప్రారంభించబడింది. మీరు బుకింగ్‌కు ముందు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకుంటే, మీరు నేరుగా డీలర్‌షిప్‌ను సందర్శించవచ్చు లేదా వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా టెస్ట్ డ్రైవ్‌ను ఎంచుకోవచ్చు.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

వావ్.. కేవలం గంటలోపే 25,000 బుకింగ్స్ పొందిన Mahindra XUV700.. ఎందుకింత క్రేజ్

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

Mahindra XUV700 ధరలు ఇప్పుడు కొంతవరకు పెరిగాయి, కావున ఈ ప్రభావం కొనుగోలుదారుపై ఈ విధముగా ఉంటుంది అనే విషయం త్వరలో తెలుస్తుంది.

Most Read Articles

English summary
New mahindra xuv700 gets 25000 booking in just one hour price revised details
Story first published: Friday, October 8, 2021, 9:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X