XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన వాహన తయారీ సంస్థలలో ఒకటి Mahindra & Mahindra. Mahindra కంపెనీ ఇటీవల ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగిన అధునాతన SUV ని భారతీయ మార్కెట్లో విడుదల చేసింది. ఈ SUV ప్రారంభ ధర విడుదల సమయంలో రూ. 11.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). కంపెనీ ఈ SUV ని విడుదల చేసినప్పటి నుంచి కూడా మంచి ఆదరణ పొందుతోంది.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

ఈ SUV కోసం కంపెనీ బుకింగ్స్ ప్రారభించిన కేవలం 57 నిముషాల్లో 25,000 బుకింగ్స్ పొందగలిగింది, అదే విధంగా రెండవ రోజు రెండు గంటల్లో 25,000 కంటే ఎక్కువ యూనిట్లు బుక్ చేయబడ్డాయి. ఈ SUV కి ఇప్పటివరకు 65,000 బుకింగ్‌లు వచ్చాయి. మొదటి 25,000 యూనిట్లకు మాత్రమే దాని ప్రారంభ ధర (రూ. 11.99 లక్షలు) వర్తిస్తుంది. అయితే ఇప్పుడు ఈ కొత్త SUV ప్రారంభ ధర రూ. 12.49 లక్షలు.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

25,000 తరువాత బుక్ చేసుకున్న వారికి ఈ ధర వద్ద విక్రయించబడుతుంది. అతి తక్కువ కాలంలో ఇంత మొత్తంలో బుకింగ్స్ స్వీకరించడం అనేది చాలా గొప్ప విషయం. దీనిని బట్టి చూస్తే కొత్త Mahindra XUV700 కి ఎంత ఆదరణ ఉందో తెలుస్తుంది.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

తాజా నివేదికల ప్రకారం కంపెనీ తన కొత్త మహీంద్రా XUV700 డెలివరీని ప్రారంభించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే కొత్త మహీంద్రా XUV700 దాని వినియోగదారులను చేరుకోవడం ప్రారంభించిందని తెలుస్తుంది.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా XUV700 ఇప్పుడు దేశీయ మార్కెట్లో రూ. 12.49 లక్షల నుండి రూ. 22.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరకు విక్రయించబడుతుంది. Mahindra కంపెనీ ఈ SUVని మొత్తం నాలుగు ట్రిమ్‌లలో విడుదల చేసింది. అవి MX, AX3, AX5 మరియు AX7. ఇవన్నీ కూడా ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

కొత్త మహీంద్రా XUV700 SUV అనేది Mercedes-Benz నుండి ప్రేరణ పొందిన డ్యూయల్-డిస్ప్లే సెటప్‌ను కలిగి ఉన్న దాని విభాగంలో మొదటి SUV. ఈ డిస్‌ప్లే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పనిచేస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఆటో హోల్డ్‌తో కూడిన ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, కీలెస్ ఎంట్రీ, పుష్ స్టార్ట్/స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఈ ఎస్‌యూవీలో అందించబడ్డాయి.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

అంతే కాకుండా ఈ ఆధునిక SUV లో సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందులో ఆటో బూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్మార్ట్ డోర్ హ్యాండిల్స్, పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, పర్సనల్ అలర్ట్ మరియు డ్రైవర్ అలర్ట్ సిస్టమ్ వంటికి ఉన్నాయి. ఈ SUV గరిష్టంగా 80 కిమీ/గం వేగాన్ని చేరుకున్నప్పుడు ఆటోబూస్టర్ హెడ్‌ల్యాంప్‌లు స్వయంచాలకంగా ఆన్ చేయబడతాయి. ఇది చీకటి రోడ్లపై మరింత వెలుతురును అందించడం ద్వారా రాత్రిపూట డ్రైవింగ్‌ను మరింత సౌకర్యవంతంగా చేస్తుంది.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

మహీంద్రా XUV700 స్మార్ట్ డోర్ హ్యాండిల్‌ను కలిగి ఉన్న ఈ విభాగంలో మొదటి SUV. హ్యాండిల్ బయట తెరుచుకుంటుంది మరియు కేవలం ఒక టచ్ తో లోపల మూసివేయబడుతుంది. ఇవన్నీ నిజంగా చాలా అద్భుతంగా ఉంటాయి. వాహన వినియోగదారులకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాయి.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

Mahindra XUV700 లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఆటో హెడ్‌లైట్ బూస్టర్ వంటివి ఉన్నాయి.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

Mahindra XUV700 రెండు ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు రెండవది 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజన్‌. పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు 380 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

XUV700 డెలివరీలు ప్రారంభించిన Mahindra: పూర్తి వివరాలు

ఇక రెండవ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్, ఇది 183 బిహెచ్‌పి పవర్ మరియు 420 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది కూడా 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలను కలిగి ఉంటుంది. Mahindra XUV700 నాలుగు డ్రైవింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది. అవి జిప్, జామ్, జూమ్ మరియు కస్టమ్ డ్రైవింగ్ మోడ్స్.

Source: Team BHP

More from DriveSpark

Article Published On: Tuesday, October 26, 2021, 9:50 [IST]
English summary
New mahindra xuv700 suv deliveries commence details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+