కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్, భారత మార్కెట్లో విక్రయిస్తున్న జిఎల్‌ఏ క్రాసోవర్‌లో కంపెనీ ఓ కొత్త తరం మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు కంపెనీ తమ వెబ్‌సైట్‌లో ఈ కొత్త మోడల్‌ను అప్‌డేట్ చేసింది.

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

అంతేకాకుండా, కొత్త తరం 2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్రాసోవర్ కోసం కంపెనీ అధికారికంగా బుకింగ్‌లను కూడా ప్రారంభించింది. భారతదేశంలో బిఎస్6 నిబంధనలు ప్రవేశపెట్టిన తర్వాత, మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ జిఎల్ఏ మోడల్ ఉత్పత్తిని నిలిపివేసింది.

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు తమ కొత్త తరం 2021 మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్రాసోవర్‌ను బిఎస్6 అప్‌డేట్‌తో పాటుగా మరిన్ని కొత్త ఫీచర్లు మరియు రిఫ్రెష్డ్ డిజైన్‌తో విడుదల చేయనున్నారు. వచ్చే నెలలో ఇది మార్కెట్లోకి రావచ్చని అంచనా. కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏను ఐదు వేరియంట్లలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

MOST READ:రియర్ హీరో మయూర్ షెల్కేకి జావా బైక్ కాకుండా మరో కార్ గిఫ్ట్.. అదేంటో చూసారా..!

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

కఠినమైన బిఎస్6 ఉద్గార నిబంధనల నేపథ్యంలో, దాదాపు ఏడాదిన్నర కాలంగా మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఏ భారత మార్కెట్‌లో లేదు. ఈ క్రాసోవర్ రెండు పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో మరియు ఒక ఏఎమ్‌జి పెర్ఫార్మెన్స్ వేరియంట్ రూపంలో లభ్యమయ్యేది.

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

కొత్త మెర్సిడెస్ జిఎల్‌ఏ క్రాసోవర్‌ను కంపెనీ పూర్తిగా రీడిజైన్ చేసింది. ఇప్పుడు ఇది చూడటానికి జిఎల్‌సి మరియు జిఎల్‌ఈలా కనిపిస్తుంది. ఈ ఎస్‌యూవీ మునుపటి కంటే పెద్దదిగా ఉంటుంది. దీనికి ప్రధాన కారణం, ఇందులోని పొడవైన రూఫ్ డిజైన్. ఈ ఎస్‌యూవీ దిగువ ప్యానెల్‌లో అన్ని వైపులా బ్లాక్ క్లాడింగ్ కనిపిస్తుంది. అలాగే, ముందు భాగంలో కొత్త గ్రిల్ మరియు బంపర్ ఉంటుంది.

MOST READ:కరోనా వేళ అందరికోసం 'ఆక్సిజన్ మ్యాన్‌గా' మారిన వ్యక్తి.. ఎక్కడంటే?

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఈ మోడల్‌లో మల్టీబీమ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు ఇవ్వబడ్డాయి, వెనుక భాగంలో కొత్త టెయిల్ లాంప్స్ మరియు బంపర్‌పై బ్లాక్ ఇన్సర్ట్స్ కూడా ఇవ్వబడ్డాయి. ఇందులో 17 ఇంచ్ మరియు 18 ఇంచ్ టైర్లను స్టాండర్డ్‌గా అందిస్తున్నారు. జిఎల్‌ఏ ఏఎమ్‌జి మోడల్‌కు మాత్రం 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ అందిస్తున్నారు.

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఏ లోపలి భాగాన్ని కూడా అప్‌గ్రేడ్ చేశారు. ఇందులో కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు కొత్త టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ ఉండనున్నాయి. ఎ-క్లాస్ లిమోసిన్ మాదిరిగానే, ఇందులోని రెండు డిస్ప్లేలు కూడా 10.25 ఇంచ్ యూనిట్ కలిగి ఉంటాయి. ఇది ఎమ్‌బియూఎక్స్ వ్యవస్థను కలిగి ఉంటుంది మరియు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోలను సపోర్ట్ చేస్తుంది.

MOST READ:కారు దొంగలించిన తర్వాత ఓనర్‌కే SMS చేసిన దొంగ.. చివరికి ఏమైందంటే?

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇంటీరియర్ క్యాబిన్‌లో ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, డ్రైవర్ సౌకర్యం కోసం యాంత్రికంగా సర్దుబాటు చేయగల సీటు మరయు మెమరీ ఫంక్షన్‌తో కూడిన కో-ప్యాసింజర్ సీట్, ఏఎమ్‌జి లైన్ వేరియంట్‌లో స్పోర్టీ బకెట్ సీట్స్ ఉంటాయి. ఓవరాల్ క్యాబిన్ లేఅవుట్ మొత్తం బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంటుంది.

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇంకా ఇందులో రాడార్ బేస్డ్ బ్రేకింగ్ అసిస్ట్, పెడస్టేరియన్ సేఫ్టీ కోసం యాక్టివ్ బోనెట్, ఏడు ఎయిర్‌బ్యాగులు, హిల్ స్టార్ట్ అసిస్ట్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్ పాడ్ వంటి అనేక కొత్త ఫీచర్లు ఉందులో ఉన్నాయి.

MOST READ:విడుదలకు ముందే లీకైన స్కొడా కుషాక్ ఫొటోలు; జూన్ 2021లో లాంచ్!

కొత్త తరం మెర్సిడెస్ జిఎల్‌ఏ బుకింగ్స్ ఓపెన్; త్వరలోనే ఇండియా లాంచ్!

ఇంజన్ విషయానికి వస్తే, ఈ కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్రాసోవర్‌లో కొత్తగా 1.3-లీటర్ ఇన్-లైన్ ఫోర్ సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్, 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్ మరియు 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లు అందించనున్నారు. అన్ని ఇంజన్లు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ మరియు 8-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
New Mercedes-Benz GLA Bookings Open; India Launch Expected Soon, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X