జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ మెర్సిడెస్ బెంజ్ ఇండియా తమ సరికొత్త 2021 ఎస్-క్లాస్ లగ్జరీ కారును త్వరలోనే మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ ఫ్లాగ్‌షిప్ సెడాన్‌ను జూన్ 17న దేశీయ విపణిలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

కొత్త తరం 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌ను గత ఏడాది సెప్టెంబర్‌లో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రవేశపెట్టారు. పాత తరం మోడల్ మాదిరిగానే, ఈ కొత్త తరం మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్‌ను కూడా స్థానికంగానే అసెంబుల్ చేయనున్నారు. అయితే, ప్రారంభ బ్యాచ్ యూనిట్లను మాత్రం పూర్తిగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

ఈ ఏడాది తమ సరికొత్త ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎస్‌యూవీ మేబాక్ జిఎల్‌ఎస్600ను ప్రవేశపెట్టిన తరువాత, ఈ బ్రాండ్ నుండి వస్తున్న రెండవ మోడల్ ఇది. భారత మార్కెట్లో కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్ ధరలు రూ.1.5 కోట్లు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

పాత తరం మోడల్‌తో పోలిస్తే, కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ 34 మిమీ ఎక్కువ పొడవు, 51 మిమీ ఎక్కువ వెడల్పు మరియు 12 మిమీ ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. వీల్‌బేస్ కూడా 50 మిమీ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఫ్రంట్ ట్రాక్‌ను 35 మిమీ మరియు వెనుక ట్రాక్‌ను 51 మిమీ మేర విస్తరించారు.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

కొత్త 2021 మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ సెడాన్‌లో పెరిగిన కొలత కారణంగా, క్యాబిన్ లోపల స్థలం కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఇది మునుపటి కన్నా మరింత విశాలమైన ఇంటీరియర్ స్పేస్‌తో, మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది. అంతేకాకుండా, ఈ లగ్జరీ సెడాన్‌ను ఇప్పుడు సరికొత్త డిజైన్ లాంగ్వేజ్‌తో అప్‌గ్రేడ్ చేశారు.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

సరికొత్త డిజైన్‌తో రూపుదిద్దుకున్న ఈ కొత్త తరం ఎస్-క్లాస్ మునుపటి కన్నా మరింత సొగసైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఈ కారులోని ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఇప్పుడు కొత్త డిజిటల్ లైటింగ్ టెక్నాలజీతో రూపొందాయి. పాత మోడల్‌లో కనిపించే వ్రాప్‌అరౌండ్ ఎల్‌ఈడీ టెయిల్ లైట్లను ఈ కొత్త లైట్లతో రీప్లేస్ చేశారు.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

అధిక వేగాల వద్ద ఎయిర్ డ్రాగ్‌ను (గాలి ప్రవాహాన్ని) తగ్గించేందుకు కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్‌లో ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్‌ను జోడించారు. ఈ కారులోని క్యాబిన్ మునుపటి మోడళ్ల కంటే చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులోని కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

ఈ కారుకు డిజిటల్ కన్సోల్‌తో పాటు సెంటర్ కన్సోల్‌లో నిలువుగా టాబ్లెట్ మాదిరిగా అమర్చిన 12.8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త 2021 ఎస్-క్లాస్ మోడల్ 27 తక్కువ భౌతిక బటన్స్‌ను కలిగి ఉంటుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా తెలిపింది.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

కొత్త ఎస్-క్లాస్‌లో చేసిన ఇతర మార్పులలో స్టీరింగ్ వీల్‌పై అమర్చిన కెపాసిటివ్ కంట్రోల్స్, బర్మెస్టర్ హై-ఎండ్ 4డి సౌండ్ సిస్టమ్, 263కి పైగా ఆప్టిక్ ఎల్‌ఇడి లైట్లతో కూడిన యాంబియంట్ లైటింగ్, వాయిస్ కమాండ్స్ వంటి మరెన్నో ఫీచర్లు కూడా ఉన్నాయి.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

కొత్త తరం ఎస్-క్లాస్‌లో పెరిగిన కొలతల కారణంగా, ముందు భాగంలో 38 మిమీ ఎక్కువ లెగ్‌రూమ్ మరియు వెనుక భాగంలో 24 మిమీ ఎక్కువ లెగ్‌రూమ్ లభిస్తుంది. వెనుకవైపు సీటు ప్రయాణికుల కోసం ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు కలిగి ఉన్న మొట్టమొదటి కారు ఈ కొత్త 2021 ఎస్-క్లాస్.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

ఈ కారులో మెర్సిడెస్ బెంజ్ ప్రీ-సేఫ్ ఇంపల్స్ కంట్రోల్, ఈ-యాక్టివ్ బాడీ కంట్రోల్, అడాప్టివ్ సస్పెన్షన్ మరియు లెవల్ 3 అటానమస్ డ్రైవింగ్ వంటి అధునాతన సాంకేతిక మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక చివరిగా ఇంజన్ విషయానికి వస్తే, ఈ మోడల్ 3.0-లీటర్ ఇన్-లైన్ సిక్స్-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ మరియు ఈక్యూ బూస్ట్ 48-వోల్ట్ మైల్డ్-హైబ్రిడ్ సిస్టమ్‌తో కూడిన డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది.

జూన్ 17న కొత్త మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ లాంచ్; డీటేల్స్

ఇందులోని ఎస్-క్లాస్ ఎస్450 వేరియంట్ 362 బిహెచ్‌పి పవర్ శక్తిని మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. కాగా, ఎస్-క్లాస్ ఎస్500 వేరియంట్ 429 బిహెచ్‌పి పవర్‌ను మరియు 520 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇంజన్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటాయి.

Most Read Articles

English summary
New Mercedes-Benz S-Class India Launch On 17th June 2021, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X