భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

జర్మన్ లగ్జరీ కార్ తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఎట్టకేలకు భారత మార్కెట్లో తన కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీని విడుదల చేసింది. మెర్సిడెస్-మేబాచ్ లైనప్ నుండి వస్తున్న మొట్టమొదటి ఎస్‌యూవీ ఈ జిఎల్‌ఎస్ 600. ఈ కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ధర దేశీయ మార్కెట్లో రూ. 2.43 కోట్లు. దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 భారత మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త వేరియంట్. దీని స్టాండర్డ్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ 600తో పోలిస్తే, ఈ మేబాచ్ వెర్షన్ ఎస్‌యూవీలో అనేక అప్డేట్డ్స్ జరిగాయి. ఈ స్పెషల్ జిఎల్‌ఎస్ 600 మేబాక్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో కూడా చాలా అప్డేట్స్ ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, ముందు మరియు రియర్ బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.

MOST READ:ఔరా.. ఏమిటీ విచిత్రం.. 15 కేజీల స్కూటర్ తరలించడానికి 7,500 కేజీల ట్రక్కు

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

ఈ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, ‘మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

కొత్త మెర్సెడెస్ బెంజ్ మేబాచ్ జిఎల్ఎస్ 600 యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే, ఈ ఎస్‌యూవీ బెస్పోక్ మెటీరియల్ మరియు ఫీచర్లు ఉంటాయి. వెనుక సీట్లు వెంటిలేషన్‌తో పాటుగా మసాజింగ్ ఫంక్షన్‌ను కూడా కలిగి ఉంటాయి. అంతే కాకుండా వెనుక సీటులోని ప్రయాణీకులకు మరింత అనుకూలమైన ప్రయాణాన్ని అందించడానికి ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే యూనిట్స్ కూడా ఉంటాయి.

MOST READ:భారత్‌లో విడుదలకు సిద్దమైన కొత్త యమహా ఎఫ్‌జెడ్-ఎక్స్ బైక్; వివరాలు

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

వెనుక సీట్లు యొక్క ముందు భాగంలో మధ్యలో అమర్చిన టాబ్లెట్ స్క్రీన్ సాయంతో వివిధ అంశాలను యాక్సెస్ చేయవచ్చు. ఇందులో ఆడియో, క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, సన్‌షేడ్స్ మరియు నావిగేషన్ మొదలైనవి ఉన్నాయి. కావున ఇవన్నీ వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

వెనుక వరుసలో ఫోల్డింగ్ టాబ్లెట్స్ మరియు రిఫ్రిజిరేటర్ సౌకర్యం కూడా ఉంటుంది. ఇంకా ఇందులో పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 12.3 ఇంచెస్ ఎమ్‌బియూఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మెస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 64 కలర్స్ తో కూడిన ఎల్ఈడి ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్ వంటి మరిన్నో ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి.

MOST READ:మీకు తెలుసా.. లంబోర్ఘిని హురాకాన్ ఎవో ఆర్‌డబ్ల్యుడి స్పైడర్ ఫస్ట్ లుక్ రివ్యూ, వచ్చేసింది.. చూసారా?

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

ఈ కారులో ఆసక్తికరమైన ఫీచర్ ఏంటంటే, ఇందులో ఈ యాక్టివ్ బాడీ కంట్రోల్ సస్పెన్షన్ సిస్టమ్ ఉంటుంది. ఇది కెమెరా ద్వారా రోడ్ స్కాన్ చేసి, దానికి అనుగుణంగా సస్పెన్షన్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. ఈ ఫీచర్ వలన ఈ ఆల్ట్రా-ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో డ్రైవింగ్ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి8 ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 550 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 21 బిహెచ్‌పి శక్తిని మరియు 249ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఇంటిగ్రేటెడ్ ఈక్యూ బూస్ట్ స్టార్టర్-జనరేటర్‌ను కూడా కలిగి ఉంటుది.

MOST READ:రూ. 9 కోట్లకు అమ్ముడైన పార్కింగ్ ప్లేస్.. ఎక్కడో తెలుసా?

భారత్‌లో విడుదలైన మెర్సిడెస్ బెంజ్ మేబాచ్ GLS600; ధర & పూర్తి వివరాలు

ఈ కారులోని ఇంజన్ 9 జి-ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడి ఉంటుంది మరియు ఇది ఇంజన్ నుండి వచ్చే పవర్ నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది. మేబాక్ జిఎల్‌ఎస్ 600 కేవలం 4.9 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

Most Read Articles

English summary
2021 Mercedes-Maybach GLS600 Launched In India. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X