నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ తన కొత్త మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీని ఇటీవల రూ. 2.43 కోట్ల ధరతో విడుదల చేసింది. కంపెనీ ఈ కొత్త ఎస్‌యూవీని మొదటి బ్యాచ్‌లో 50 యూనిట్లను మాత్రమే దేశీయ మార్కెట్లోకి తీసుకువచ్చింది. కానీ ఈ ఎస్‌యూవీ లాంచ్ చేయడానికి ముందే కంపెనీకి 50 కి పైగా ఆర్డర్లు వచ్చినట్లు ఇది వరకే కంపెనీ తెలిపింది. ఇప్పుడు మొదటి బ్యాచ్ మొత్తం విక్రయించబడింది. అయితే డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

ప్రస్తుతం మొదటి బ్యాచ్ మొత్తం అమ్ముడైపోయింది. కావున సెకండ్ బ్యాచ్ 2022 మొదటి త్రైమాసికంలో తీసుకువచ్చే అవకాశం ఉంది. సెకండ్ బ్యాచ్ గురించి మాట్లాడుతూ, కస్టమర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వీలైనంత త్వరగా సెకండ్ బ్యాచ్ దేశీయ మార్కెట్లోకి తీసుకువడానికి ప్రయత్నిస్తామన్నారు.

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

మెర్సిడెస్-మేబాచ్ జిఎల్ఎస్ 600 ఎస్‌యూవీలో క్రోమ్‌లో ఫినిష్ చేసిన ఎక్స్టీరియర్ ట్రిమ్స్ ఉన్నాయి. వీటిలో పెద్ద వర్టికల్ స్లాట్ గ్రిల్, విండో లైన్, సైడ్-స్టెప్, ముందు మరియు రియర్ బంపర్‌లపై డిజైన్ ట్వీక్స్, రూఫ్ రెయిల్స్ మరియు ఎగ్జాస్ట్ టిప్స్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా రివ్యూ వీడియో.. లేటెస్ట్ ఫీచర్స్ & సూపర్ పర్ఫామెన్స్

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

ఈ ప్రీమియం లగ్జరీ ఎస్‌యూవీలో పెద్ద 22 ఇంచెస్ లేదా 23 ఇంచెస్ బ్రష్డ్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి, అంతే కాకుండా ఇందులో డ్యూయెల్ టోన్ పెయింట్ స్కీమ్, బ్లాక్ కలర్‌లో ఫినిష్ చేయబడిన విండో పిల్లర్స్ మరియు రూఫ్, ‘మేబాచ్' బ్రాండ్ లోగో వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

ఇది 4 మరియు 5 సీట్ల క్యాబిన్ ఎంపికలలో తీసుకురాబడింది. 4-సీట్ల వెర్షన్ షాంపేన్‌ను నిల్వ చేయడానికి రిఫ్రిజిరేటర్‌ను కలిగి ఉన్న స్థిర సెంటర్ కన్సోల్‌తో వస్తుంది. వెనుక భాగంలో 4 సీటర్లు మరియు 5 సీట్ల వెర్షన్లలో రిక్లైనింగ్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. దీని క్యాబిన్ అనేక ట్రిమ్ ఆప్సన్స్ అందుబాటులో ఉన్నాయి.

MOST READ:2021 స్కోడా ఆక్టేవియా ఫస్ట్ డ్రైవ్ రివ్యూ; డిజైన్, ఫీచర్స్ & పూర్తి వివరాలు

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

మెర్సిడెస్ మేబాచ్ జిఎల్‌ఎస్ 600 లో 12.3 ఇంచెస్ ఎంబియుఎక్స్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 12.3 ఇంచెస్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, బర్మీస్టర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, ఎల్ఈడీ ఆప్టికల్ ఫైబర్ యాంబియంట్ లైటింగ్, డాష్‌బోర్డ్‌లో నాప్ప లెదర్ వంటివి కూడా ఉన్నాయి. దీనికి లేటెస్ట్ మెర్సిడెస్ మి కనెక్టెడ్ కార్ టెక్నాలజీ కూడా ఇవ్వబడింది.

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో 8 ఎయిర్‌బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ సిస్టమ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ మోడ్ మరియు ప్రీ-సేఫ్ సిస్టమ్ ఇవ్వబడ్డాయి. వీటితో పాటు పనోరమిక్ స్లైడింగ్ సన్‌రూఫ్, మసాజ్ సీట్ మరియు రిఫ్రిజిరేటర్ వంటివి ఉన్నాయి.

MOST READ:రాజకీయ నాయకుని చర్యపై చిర్రెత్తిన పోలీసులు.. ఏం చేశారో చూసారా..!

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

మేబాచ్ జిఎల్‌ఎస్ 600 ఎస్‌యూవీలో 4.0-లీటర్ వి 8 ఇంజిన్‌ ఉంటుంది. ఇది 542 బిహెచ్‌పి పవర్ మరియు 730 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 9 జి ట్రోనిక్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది. ఇది ఈక్యూ బూస్ట్ స్టార్టర్ జెనరేటర్‌తో జతచేయబడుతుంది.

నిన్న విడుదలైన ఎస్‌యూవీ ఈ రోజుకే అమ్ముడైపోయింది.. ఎందుకింత డిమాండ్?

ఎస్‌యూవీ కేవలం 4.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ ఎస్‌యూవీ బరువు మొత్తం 3,250 కిలోలు. లాంచ్ అయినా కేవలం ఒక్క రోజులో మొత్తం అమ్ముడయ్యాయంటే దేశీయ మార్కెట్లో ఈ ఎస్‌యూవీకి ఎంత ఆదరణ ఉందొ తెలుస్తుంది.

MOST READ:ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. వీడియో చూడండి

Most Read Articles

English summary
2021 Mercedes-Maybach GLS600 Sold Out. Read in Telugu.
Story first published: Wednesday, June 9, 2021, 19:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X