భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్న సమయంలో మినీ ఇండియా (MINI India) కూడా ఒక ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సన్నాహాలను సిద్ధం చేస్తుంది. కంపెనీ ఇప్పటికే దేశీయ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ MINI కూపర్ SE యొక్క టీజర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ కారుని కంపెనీ దేశీయ మార్కెట్లో 2019 వ సంవత్సరంలోనే అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు కోసం కంపెనీ బుకింగ్లను కూడా 2021 అక్టోబర్ నెల చివరి నుంచి స్వీకరించడం ప్రారంభించింది.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

ఈ MINI Electric కొనాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1 లక్ష అడ్వాన్స్ చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఎలక్ట్రిక్ యొక్క మొదటి బ్యాచ్ బుకింగ్ పూర్తయింది. దాని మొదటి బ్యాచ్‌లో, కంపెనీ 30 యూనిట్లను మాత్రమే చేర్చింది. ఇవన్నీ కూడా ఇప్పటికే విక్రయించబడ్డాయి.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

కంపెనీ ఇటీవల దీనికి సంబంధించిన మరొక తాజా సమాచారం వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ సమాచారం ప్రకారం కొత్త MINI కూపర్ 2022 మార్చి నెలలో భారతీయ మార్కెట్లో విడుదల చేయనున్నట్లు BMW ఇండియా అధికారికంగా ధృవీకరించింది. ప్రస్తుతం, కంపెనీ దాని ధరను అధికారికంగా వెల్లడించలేదు, కానీ ఇది దేశీయ మార్కెట్లో విడుదలయ్యే సమయంలో ధర వెల్లడవవుతుంది.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

కంపెనీ మొదటి బ్యాచ్‌ యొక్క బుకింగ్స్ ప్రారంభించినప్పుడు మొత్తం 30 యూనిట్లు కేవలం 2 గంటల్లోనే పూర్తిగా బుక్ అయ్యాయి. దీన్ని బట్టి చూస్తే కంపెనీ యొక్క ఈ కారుకి దేశీయ మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో తెలుస్తుంది. ఈ కొత్త కారు ఆధునిక డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

మినీ ఎలక్ట్రిక్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపుగా మినీ కూపర్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో కొన్ని చిన్న మార్పులు ఉన్నాయి. ఈ మార్పులలో అత్యంత ప్రముఖమైనది ఫ్రంట్ గ్రిల్, ఇది కారును ఏరోడైనమిక్‌గా చేస్తుంది. హ్యాచ్‌బ్యాక్‌కి ఫేస్‌లిఫ్ట్ ఇవ్వడానికి, ఈ పెయింట్ స్కీమ్‌లలో కొన్ని ఆకర్షణీయమైన ఎల్లో కలర్ యాక్సెంట్స్ బార్ మరియు మినీ ఎలక్ట్రిక్ బ్యాడ్జ్‌తో అమర్చబడి ఉంటాయి.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

ఇందులో ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో రౌండ్ హెడ్‌లైట్‌లు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ పసుపు రంగు రిమ్‌లతో కూడిన కొత్త 17-ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్ డిజైన్‌ను పొందింది, కావున చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది కాకుండా, కారు పిల్లర్లు అన్ని కలర్ ట్రిమ్‌లలో బ్లాక్ కలర్ లో ఉంచబడ్డాయి, ఇది కారుకు మంచి కాంట్రాస్ట్‌ని ఇస్తుంది.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

త్వరలో దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త MINI Electric 3-డోర్ కూపే మోడల్. MINI Electric కారు తక్షణ టార్క్‌ అందిస్తుంది, కావున ఇది సున్నా ఉద్గారాలను విడుదల చేస్తుంది. ఈ కారణంగా, ఈ ఎలక్ట్రిక్ కారులో ఎగ్జాస్ట్ కూడా ఉండదు. ఈ కొత్త ఎలక్ట్రిక్ కారు 184 బిహెచ్‌పి పవర్ మరియు 270 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు కేవలం 7.3 సెకన్లలో గంటకు 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు అద్భుతమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

MINI Electric కారు 32.6 కిలోవాట్ కెపాసిటీ గల బ్యాటరీతో శక్తిని పొందుతుంది. కావున ఈ చిన్న ఎలక్ట్రిక్ కారు 270 కి.మీ వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మొత్తం నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి వైట్ సిల్వర్, మిడ్‌నైట్ బ్లాక్, మూన్‌వాక్ గ్రే మరియు బ్రిటిష్ రేసింగ్ గ్రీన్ కలర్స్. ఇవన్నీ కూడా చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటాయి.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

భారతీయ మార్కెట్లో MINI India మంచి ప్రజాదరణ పొందింది. కంపెనీ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో MINI 3-డోర్ హాచ్ బ్యాక్, MINI జాన్ కూపర్ వర్క్స్ హాచ్, MINI కన్వర్టిబుల్ మరియు MINI కంట్రీమ్యాన్‌ వంటి మోడల్స్ విక్రయిస్తుంది. అయితే కంపెనీ ఇప్పటివరకు ఎలక్ట్రిక్ కారుని మార్కెట్లో ప్రవేశపెట్టలేదు, కావున ఇప్పుడు మొదటిసారి కంపెనీ తన ఎలక్ట్రిక్ కారుని దేశీయ మార్కెట్లో విడుదల చేయబోతోంది.

భారత్‌లో MINI Cooper SE లాంచ్ ఎప్పుడో తెలుసా?

ఇది కంపెనీ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ కారు, భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ కార్ల ట్రెండ్ పెరుగుతున్న దృష్ట్యా, కంపెనీ దీనిని పరిమిత సంఖ్యలో భారత మార్కెట్లో విడుదల చేసింది. MINI భారతదేశంలో తొమ్మిది అధీకృత డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేసింది. అవి బర్డ్ ఆటోమోటివ్ (ఢిల్లీ NCR), బవేరియా మోటార్స్ (పుణె), EVM ఆటోక్రాఫ్ట్ (కొచ్చి), గాలప్స్ ఆటోహాస్ (అహ్మదాబాద్), ఇన్ఫినిటీ కార్స్ (ముంబై), కృష్ణ ఆటోమొబైల్స్ (చండీగఢ్), KUN ఎక్స్‌క్లూజివ్ (చెన్నై ), KUN ఎక్స్‌క్లూజివ్ (హైదరాబాద్) మరియు నవ్‌నీత్ మోటార్స్ (బెంగళూరు) వంటి నగరాల్లో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, December 11, 2021, 11:26 [IST]
English summary
New mini cooper se electric car set to be launched in march 2022 details
Read more on: #మినీ #mini
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+