స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

స్కోడా కంపెనీ ఇటీవల కొత్త ఫాబియాను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది. ఈ కొత్త స్కోడా ఫాబియా ప్రముఖ వాహన తయారీదారు అయిన ఫోక్స్‌వ్యాగన్ యొక్క ఎంక్యూబి-ఏవో ప్లాట్‌ఫామ్‌పై నిర్మించబడింది. ఇది మొత్తం 6 బాడీ స్టైల్స్ కలిగి ఉంది, మూడు వేరియంట్లలో 5 ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతుంది.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఫాబియా మునుపటి కంటే పెద్దదిగా ఉండి, అనేక అప్డేట్స్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా అనేక సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. కొత్త స్కోడా ఫాబియా స్టాండర్డ్ మోడల్స్ తో పాటు, కాంబి, మోంటే కార్లో, కాంబి మోంటే కార్లో, బ్లాక్ ఎడిషన్ కాంబి స్కౌట్‌లైన్, క్లోవర్ మరియు కాంబి క్లీవర్ బాడీస్టైల్‌లో రానుంది.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఫాబియా యాక్టివ్ అంబిషన్ మరియు స్టైల్ అనే మూడు వేరియంట్లలో ప్రవేశపెట్టబడుతుంది. ఈ నాల్గవ తరం స్కోడా ఫాబియా మంచి డిజైన్ కలిగి ఉంటుంది. కావున ఇది చూడటానికి చాలా ఆకర్షించేవిధంగా ఉంటుంది.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఫాబియా యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు మునుపటికంటే 11 సెం.మీ ఎక్కువగా ఉంటుంది. ఫాబియాలో 380 లీటర్ల బూట్ స్పేస్‌ లభిస్తుంది. ఈ విభాగంలో అతిపెద్ద బూట్ కలిగి ఉన్న వాటిలో ఫాబియా ఒకటి. వీల్ బేస్ దాని మునుపటి మోడల్ కంటే 94 మి.మీ పెద్దదిగా ఉంటుంది, అంతే కాదు ప్రయాణికులకు అనుకూలమైన స్థలం కూడా లభిస్తుంది.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఫాబియా యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, దీని లోపలి భాగం కాపర్ కలర్ మరియు గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దీనికి కొత్త ఎల్‌ఈడీ యాంబియంట్ లైటింగ్ ఇవ్వబడింది. దీనికి ముందు మరియు వెనుక భాగంలో ఎల్‌ఈడీ రీడింగ్ లైట్ ఉంటుంది.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

స్కోడా ఫాబియా మోడల్ కొత్త రీడిజైన్డ్ స్టీరింగ్ వీల్‌ను కలిగి ఉంది. ఇది లెదర్ తో చుట్టబడి ఉంటుంది. ఇది త్రీ స్పోక్ స్టైల్‌తో వస్తుంది, అంతేకాకుండా ఇది డిఎస్‌జి షిఫ్ట్ ప్యాడిల్స్‌ కలిగి ఉంటుంది. ఇది హీటెడ్ స్టీరింగ్ వీల్ మరియు హీటెడ్ విండ్‌స్క్రీన్‌ను కూడా కలిగి ఉంటుంది.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

స్కోడా ఫాబియా మొదటిసారిగా 10.25 ఇంచెస్ డిజిటల్ డిస్ప్లేతో వచ్చే ఆప్సనల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను కలిగి ఉంది. మొత్తం 5 ఇంజన్ ఆప్షన్లతో స్కోడా ఫాబియా అందుబాటులోకి వస్తుంది. ఇందులో రెండు పవర్ ట్యూన్లతో 1.0 లీటర్ ఎంపిఐ ఎవో, రెండు పవర్ ట్యూన్లతో 1.0 లీటర్ టిఎస్ఐ ఎవో, 1.5 లీటర్ టిఎస్ఐ ఇంజన్ వంటివి ఉన్నాయి.

స్కోడా నుంచి రానున్న కొత్త కార్.. పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఫాబియా చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండి, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇప్పుడు వాహనదారునికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో ఇంతకుముందు చెప్పినట్లుగానే మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

More from DriveSpark

Article Published On: Wednesday, May 5, 2021, 13:17 [IST]
English summary
New Skoda Fabia Unveiled; Design, Features, Engine, Variant. Read in Telugu.
Read more on: #స్కోడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+