భారత్‌లో స్కొడా కొడియాక్ విడుదల తేదీ ఖరారు; టీజర్ లాంచ్

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కొడా ఆటో, తమ సరికొత్త 2021 స్కోడా కొడియాక్ ఎస్‌యూవీని ఏప్రిల్ 13న భారత మార్కెట్లో విడుదల చేయనుంది. కంపెనీ ఇందుకు సంబంధించి ఓ కొత్త టీజర్‌ను కూడా విడుదల చేసింది. కొత్త స్కొడా కొడియాక్ సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లు మరియు పరికరాలతో రానుంది.

భారత్‌లో స్కొడా కొడియాక్ విడుదల తేదీ ఖరారు; టీజర్ లాంచ్

స్కొడా ఇటీవలే కొత్త 2021 కొడియాక్ వివరాలను వెల్లడించే అధికారిక స్కెచ్ చిత్రాలను కూడా విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ కొత్త కొడియాక్ ఎస్‌యూవీలో మరింత నిటారుగా ఉండే, హెక్సాగనల్ ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది. ఈ గ్రిల్‌కి ఇరువైపులా సన్నటి డిజైన్‌తో మరియు ఇంటిగ్రేటెడి ఎల్ఈడి డిఆర్ఎల్స్‌తో కూడిన ఎల్‌ఈడి హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వెనుక భాగంలో సి ఆకారంలో ఉండే ఎల్‌ఇడి టెయిల్ లైట్స్‌ను కూడా ఇందులో గమనించవచ్చు.

భారత్‌లో స్కొడా కొడియాక్ విడుదల తేదీ ఖరారు; టీజర్ లాంచ్

కొత్త 2021 స్కొడా కొడియాక్ ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో ప్రీమియం లెథర్ అప్‌హోలెస్ట్రీ, సాఫ్ట్ టచ్ మెటీరియరల్స్, వర్చ్యువల్ కాక్‌పిట్ లేఅవుట్, 3-స్పోక్ స్టీరింగ్ వీల్, డ్యాష్‌బోర్డుపై క్రోమ్ యాక్సెంట్స్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిజిటల్ డిస్‌ప్లే, 7 సీట్ల కాన్ఫిగరేషన్ వంటి అనేక ఫీచర్లు ఉండనున్నాయి.

భారత్‌లో స్కొడా కొడియాక్ విడుదల తేదీ ఖరారు; టీజర్ లాంచ్

ఇంజన్ ఆప్షన్‌ను గమనిస్తే, కొత్త 2021 స్కొడా కొడియాక్ కేవలం ఒకే ఒక ఇంజన్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందులోని 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి శక్తిని మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో స్కొడా కొడియాక్ విడుదల తేదీ ఖరారు; టీజర్ లాంచ్

ఈ ఇంజన్ 7 స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇందులో ఆల్-వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుందని సమాచారం. ఇదే ఇంజన్‌ను ప్రస్తుతం స్కొడా అనుబంధ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ అందిస్తున్న టిగువాన్ ఆల్-స్పేస్‌లో కూడా ఉపయోగిస్తున్నారు. కంపెనీ ఇందులో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ ఆప్షన్‌ను కూడా తీసుకురావచ్చని అంచనా.

స్టాండర్డ్ స్కొడా కొడియాక్ విడుదల తర్వాత కంపెనీ ఇందులో ఓ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ వెర్షన్ ఆర్ఎస్ (RS) మోడల్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. స్కొడా ఆటో 2016లో ఈ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది మరియు ఇది ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మోడల్‌గా అవతరించింది.

భారత్‌లో స్కొడా కొడియాక్ విడుదల తేదీ ఖరారు; టీజర్ లాంచ్

స్కొడా కొడియాక్ ప్రస్తుతం 60 దేశాలలో అమ్ముడవుతోంది మరియు ఈ మోడల్ ఇప్పటివరకు 6 లక్షల యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. భారత మార్కెట్లో కొత్త 2021 మోడల్ స్కొడా కొడియాక్‌కు సంబంధించిన మరింత సమాచారం ఏప్రిల్ 13న వెల్లడి కానుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, April 8, 2021, 10:32 [IST]
English summary
Skoda Kodiaq Teaser Released, India Launch Timeline Revealed. Read in Telugu.
Read more on: #స్కొడా #skoda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+