స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త 'ఆక్టావియా ప్రో' ; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ స్కోడా, తన ఆక్టావియా సెడాన్ యొక్క లాంగ్-వీల్‌బేస్ వెర్షన్‌ అయిన "ఆక్టావియా ప్రో" వెర్షన్‌ను చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ వెర్షన్ చైనా మార్కెట్లో ప్రత్యకంగా లభిస్తుంది. ఈ వెర్షన్ నాల్గవ తరం ఆక్టావియా మోడల్ మాదిరిగానే ఉంటుంది.

స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త ఆక్టావియా ప్రో ; పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఆక్టావియా ప్రో (లాంగ్-వీల్‌బేస్) వెర్షన్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆక్టావియా ప్రో యొక్క డిజైన్ విషయానికొస్తే, ఈ కారులో అదే హెడ్‌ల్యాంప్‌లు, ఫ్రంట్ గ్రిల్, టైల్ లైట్స్ ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని స్టైలింగ్ ఎలిమెంట్స్ తో చాలా స్పోర్టిగా కనిపిస్తుంది. దీని ముందు మరియు వెనుక బంపర్ బ్లాక్ అవుతాయి. బ్లాక్ ORVM క్యాప్ మరియు 18 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త ఆక్టావియా ప్రో ; పూర్తి వివరాలు

కొత్త స్కోడా ఆక్టావియా ప్రోలో 2,730 మిమీ పొడవు గల వీల్‌బేస్ కలిగి ఉంది. ఇది స్టాండర్డ్ కారు కంటే 44 మిమీ ఎక్కువ పొడవు ఉంటుంది. పొడవైన వీల్‌బేస్ యొక్క పెద్ద ప్రయోజనాల్లో ఒకటి వెనుక ప్రయాణీకులకు మెరుగైన లెగ్‌రూమ్ అందుబాటులో ఉంది.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త ఆక్టావియా ప్రో ; పూర్తి వివరాలు

ఈ కొత్త కారు లోపలి భాగంలో 12 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ముందు సీట్లు వెంటిలేట్ చేయబడతాయి మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ చేయగలవు. ఇవి ప్రయాణికులకు చాలా అనుకూలంగా ఉంటాయి. డ్రైవింగ్ సమయంలో అలసిపోనివ్వకుండా చేస్తాయి. కొత్త స్కోడా ఆక్టేవియా ప్రో కారులో 10.25 ఇంచెస్ ఫుల్ డిజిటల్ కన్సోల్ మరియు హెడ్-అప్ డిస్ప్లే ఉన్నాయి.

స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త ఆక్టావియా ప్రో ; పూర్తి వివరాలు

ఈ కారులో 1.4 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఈ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ డబ్ల్యు యొక్క షిఫ్ట్-బై-వైర్ టెక్నిక్‌తో 7 స్పీడ్ DSG తో అమర్చబడి ఉంటుంది. ఇక్కడ మరో ఇంట్రస్టింగ్ విషయం ఏమిటంటే స్కోడా తన మూడవ తరం ఆక్టేవియాను కూడా చైనా మార్కెట్లో కొత్త మోడల్‌తో పాటు అమ్మకాలను కొనసాగిస్తుంది.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త ఆక్టావియా ప్రో ; పూర్తి వివరాలు

ఈ కొత్త తరం స్కోడా ఆక్టావియా ఇప్పటికే యూరోపియన్ మార్కెట్లలో అమ్మకానికి ఉంది. మునుపటి తరం స్కోడా ఆక్టావియా 2013 లో భారతదేశంలో ప్రారంభించబడింది. ఈ కారు భారత మార్కెట్లో బాగా అమ్ముడవుతోంది. అయితే బిఎస్ 6 కాలుష్య నియమానికి లోబడి స్కోడా ఈ ఆక్టేవియా కారును నవీకరించలేదు.

స్కోడా నుంచి విడుదల కానున్న కొత్త ఆక్టావియా ప్రో ; పూర్తి వివరాలు

ఈ కారణంగా గత ఏడాది చివర్లో, బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా ఆక్టావియా కారును విడుదల చేయాల్సి ఉంది. కానీ స్కోడా ఈ ఏడాది ప్రారంభంలో కారు విడుదలను వాయిదా వేసింది. కొత్త ఆక్టావియా ఈ ఏడాది మధ్యకాలంలో విడుదలయ్యే అవకాశం ఉంది ఈ ఏడాది జూన్‌లో కొత్త తరం ఆక్టావియా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు.

MOST READ:విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయించిన పిల్లి.. ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజమే

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
2021 Skoda Octavia Pro (Long Wheelbase Model) Unveiled. Read in Telugu.
Story first published: Wednesday, March 10, 2021, 10:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X