ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

చెక్ రిపబ్లిక్ కార్ బ్రాండ్ స్కోడా ఆటో (Skoda Auto) భారతీయ మార్కెట్లో హన కొత్త మిడ్-సైజ్ ప్రీమియం సెడాన్ అయిన స్కోడా స్లావియా (Skoda Slavia) ను ఆవిష్కరించింది. ఈ కొత్త సెడాన్ మార్కెట్లో మొత్తం మూడు ట్రిమ్‌లలో అందించబడుతుంది. స్కోడా స్లావియా గురించి పూర్తి సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం రండి.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

ర్యాపిడ్ సెడాన్‌కు స్థానంలో ఆవిష్కరించబడిన ఈ కొత్త స్కోడా స్లావియా మొత్తం 5 కలర్ అప్సన్స్ లో అందించనుంది. అవి కాండీ వైట్, బ్రిలియంట్ సిల్వర్, కార్బన్ స్టీల్, టోర్నాడో రెడ్ మరియు క్రిస్టల్ బ్లూ కలర్స్. కంపెనీ ఈ కొత్త సెడాన్ యొక్క బుకింగ్స్ ఈ రోజు నుంచి ప్రారభించింది. అయితే డెలివరీలు వచ్చే సంవత్సరం 2022 మొదటి త్రైమాసికంలో ప్రారంభిస్తుంది.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన ఈ కొత్త స్లావియా ధరలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించ్చలేదు. అయితే ఈ సెడాన్ విడుదల సమయంలో ధర అధికారికంగా వెల్లడవుతుంది. ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది మరియు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కూడా కలిగి ఉంటుంది.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త స్కోడా స్లావియా రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. ఇందులో ఒకటి 1.0-లీటర్ టిఎస్ఐ 3 సిలిండర్ కాగా, మరొకటి 1.5-లీటర్ టిఎస్ఐ 4 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

ఇందులోని 1.0-లీటర్ టిఎస్ఐ 3-సిలిండర్ ఇంజన్ 115 బిహెచ్‌పి పవర్ మరియు 178 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్‌తో అందించబడుతుంది. ఇక 1.5-లీటర్ ఇంజన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 250 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

స్కోడా స్లావియా MQB A0 IN ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన సెడాన్. దీని డిజైన్ ఇటీవల అప్‌డేట్ చేయబడిన ఆక్టావియా వంటి సెడాన్‌ల నుండి ప్రేరణ పొందింది. కొత్త స్కోడా స్లావియా కంపెనీ ప్రస్తుత ర్యాపిడ్ మోడల్ కంటే పెద్దదిగా ఉంటుంది. కావున దీని కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 4,541 మి.మీ, వెడల్పు 1,752 మి.మీ మరియు 1,487 మి.మీ ఎత్తును కలిగి ఉంటుంది. దీని వీల్‌బేస్ పరిమాణం కూడా 2,651 మి.మీ వరకు ఉంటుంది.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

ఈ సెడాన్ చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. ఈ సెడాన్‌లో కంపెనీ సిగ్నేచర్ బటర్‌ఫ్లై ఆకారపు ఫ్రంట్ గ్రిల్ మరియు పెద్ద రేడియేటర్ గ్రిల్ అందించింది. అంతే కాకుండా ఇందులో ఎల్-షేప్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్లు, 16 ఇంచెస్ అల్లాయ్ వీల్స్, షార్క్ ఫిన్ యాంటెన్నా మరియు బూట్-మౌంటెడ్ నంబర్ ప్లేట్ రీసెస్‌ను కూడా పొందుతుంది. ఈ కారు యొక్క ORVMలపై టర్న్ ఇండికేటర్లను మరియు సైడ్ బాడీలో లైనింగ్‌ను పొందుతుంది.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

కంపెనీ ఇంతకుముందే ఈ స్లావియా సెడాన్ యొక్క ఇంటీరియర్‌ను కూడా అప్‌డేట్ చేసింది. ఇది ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులోని క్యాబిన్‌ను డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో పరిచయం చేసింది, ఇది చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యాష్‌బోర్డ్ మరియు అపోల్స్ట్రే కూడా డ్యూయల్-టోన్‌లో ఉంచబడ్డాయి.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

అంతే కాకుండా డ్యాష్‌బోర్డ్‌కి డ్యూయల్-టోన్ ఫినిషింగ్‌తో బ్లాక్ పియానో ​​ఫినిషింగ్ కూడా ఇవ్వబడింది, కావున ఇది మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఇందులో డ్యూయల్-స్పోక్ స్టీరింగ్ వీల్, స్టీరింగ్ వీల్ మౌంట్ కంట్రోల్స్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 25.4సెం.మీ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు 20.32 సెం.మీ డిజిటల్ కాక్‌పిట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

ఎట్టకేలకు Slavia సెడాన్ ఆవిష్కరించిన Skoda: పూర్తి వివరాలు

కొత్త స్కోడా స్లావియా వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి విడుదలయ్యే అవకాశం ఉంది. దీని ధర రూ. 10 లక్షల నుంచి రూ. 16 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చని భావిస్తున్నాము. భారతీయ మార్కెట్లో విడుదల కానున్న కొత్త స్లావియా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఈ కొత్త సెడాన్ మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము. ఎందుకంటే కంపెనీ యొక్క స్కోడా కుషాక్ కూడా అతి తక్కువ కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన SUV గా అవతరించింది. కావున అద్భుతమైన డిజైన్ మరియు పరికరాలతో నిండిన ఈ ఆధునిక సెడాన్ కూడా తప్పకుండా భారతీయ మార్కెట్లో మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

Read more on: #స్కోడా #skoda
English summary
New skoda slavia mid size sedan unveiled booking open launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X