ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

వాహనప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాటా మోటార్స్ యొక్క కొత్త ఆల్ట్రోజ్ ఐ-టర్బో ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ భారత మార్కెట్లో లాంచ్ అయింది. టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో దేశీయ మార్కెట్లో మూడు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఎక్స్‌టి, ఎక్స్‌జెడ్ మరియు ఎక్స్‌జెడ్ ప్లస్ వేరియంట్లు. టాటా ఆల్ట్రోజ్ ఐ టర్బో యొక్క ప్రారంభ ధర రూ. 7.73 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా).

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

టాటా మోటార్స్ యొక్క కొత్త ఐ టర్బో పెట్రోల్ వేరియంట్ల కోసం బుకింగ్స్ ఒక వారం క్రితం ప్రారంభమయింది. వినియోగదారులు ఆల్ట్రోజ్ ఐ-టర్బోను ఆన్‌లైన్ ద్వారా లేదా భారతదేశం అంతటా ఏదైనా బ్రాండ్ డీలర్‌షిప్‌ల ద్వారా 11,000 రూపాయలు చెల్లించి బుక్ చేసుకోవచ్చు. కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

టాటా ఆల్ట్రోజ్ యొక్క కొత్త ఐ-టర్బో మోడల్, డిజైన్ మరియు స్టైలింగ్ పరంగా స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. ఇది కూడా అదే ఎక్సటీరియర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. వీటిలో ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు మరియు ఫాగ్ లాంప్స్, పెద్ద స్టైలిష్ 16 ఇంచెస్ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఇడి టైల్ లైట్స్ వంటివి ఉన్నాయి.

MOST READ:అలనాటి భారత క్లాసిక్ స్కూటర్ కంపెనీ, ఇప్పుడు పూర్తిగా మూతపడనుంది!

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బోలో ఉన్న ఏకైక మార్పు బూట్-లిడ్ పై ‘ఐ-టర్బో' బ్యాడ్జింగ్ మరియు కొత్త ‘హార్బర్ బ్లూ' పెయింట్ స్కీమ్. కొత్త పెయింట్ స్కీమ్ ప్రస్తుతం ఉన్న కలర్ పాలెట్‌కు అదనంగా ఉంటుంది. ఇందులో హై స్ట్రీట్ గోల్డ్, డౌన్ టౌన్ రెడ్, మిడ్‌టౌన్ గ్రే మరియు అవెన్యూ వైట్ కలర్స్ కూడా ఉన్నాయి.

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

టాటా ఆల్ట్రోజ్ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో అదే డాష్‌బోర్డ్ మరియు క్యాబిన్ లేఅవుట్‌ను స్టాండర్డ్ గా ముందుకు తీసుకువెళుతుంది. అయితే ఆల్ట్రోజ్ ఐ-టర్బోలోని డాష్‌బోర్డ్ ఇప్పుడు డ్యూయల్ టోన్ బ్లాక్ అండ్ లైట్ గ్రే కలర్‌లో పూర్తయింది. చుట్టూ సాఫ్ట్-టచ్ మెటీరియల్ కూడా ఉంది, ఇది కొత్త లెథరెట్ సీట్ అపోల్స్ట్రే ఉంటుంది. ఇవన్నీ ఈ హ్యాచ్‌బ్యాక్‌కు మరింత ప్రీమియం అనుభూతిని ఇస్తాయి.

MOST READ:రిపబ్లిక్ డే పరేడ్‌లో ప్రదర్శించనున్న యుద్ధ విమానాలు ఇవే, చూసారా..!

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

కొత్త టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో అదే 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో వస్తుంది. ఇది ఇప్పుడు కనెక్టెడ్ ఫీచర్స్ కలిగి ఉన్నప్పటికీ, బ్రాండ్ యొక్క iRA టెక్నాలజీ కూడా కలిగి ఉంది.

ఇది స్పెషల్ యాప్ ద్వారా కారును స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేయడానికి iRA అనుమతిస్తుంది, దీని ద్వారా అడిషినల్ లొకేషన్ బేస్డ్ సర్వీస్, రిమోట్ ఫంక్షన్స్ మరియు లైవ్ వెహికల్ డయాగ్నోస్టిక్స్ వంటివి పొందవచ్చు. ఇందులో ఉన్న ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో వాయిస్ కమాండ్ కూడా ఉంది, ఇంగ్లీష్, హిందీ మరియు హింగ్లిష్ భాషలలో 70 కి పైగా ఆదేశాలను ఇది అర్థం చేసుకోగలదు.

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

ఆల్ట్రోజ్ ఐ-టర్బో ఇప్ప్డుడ్ కూడా ‘ఎక్స్‌ప్రెస్ కూల్' తో వస్తుంది. ఇది క్యాబిన్‌ను మునుపటి కంటే 70 శాతం వేగంగా చల్లబరుస్తుంది. అన్ని ఇతర ఫీచర్స్ మరియు పరికరాలు స్టాండర్డ్ మోడల్ నుండి తీసుకువెళ్ళబడ్డాయి.

MOST READ:ఆటో డ్రైవర్ కొడుకు ఇప్పుడు 'బీమర్' ఓనర్ అయ్యాడు; సిరాజ్ కొత్త కార్ చూడండి

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

కొత్త ఆల్ట్రోజ్ లో ముఖ్యమైన మార్పు 1.2 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్. ఇది నెక్సాన్ నుండి తీసుకోబడింది. అయితే టాటా మోటార్స్ ఇంజిన్‌ను డి-ట్యూన్ చేసింది, ఇది ఆల్ట్రోజ్ ఐ-టర్బోలో 108 బిహెచ్‌పి మరియు 140 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది.

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

ఆల్ట్రోజ్ ఐ-టర్బో రెండు డ్రైవింగ్ మోడ్‌లతో వస్తుంది. అవి సిటీ మరియు స్పోర్ట్ మోడ్స్. టాటా మోటార్స్ ‘స్పోర్ట్' మోడ్‌లో, ఆల్ట్రోజ్ ఐ-టర్బో 11.9 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కి.మీ వేగవంతం అవుతుంది. టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో లీటరుకు 18.13 కి.మీ ఇంధన సామర్థ్యాన్ని కలిగిఉంటుంది.

MOST READ:సూపర్‌బైక్ రైడర్‌ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో

ఎట్టకేలకు భారత్‌లో లాంచ్ అయిన టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో పెట్రోల్; ధర & వివరాలు

టాటా ఆల్ట్రోజ్ ఐ-టర్బో భారత మార్కెట్లో లేటెస్ట్ టర్బో-పెట్రోల్ పవర్డ్ హ్యాచ్‌బ్యాక్ ఆఫర్. టాటా మోటార్స్ యొక్క ఈ కొత్త ఐ టర్బో పెట్రోల్ దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఐ 20 మరియు ఫోక్స్‌వ్యాగన్ పోలో జిటి టిఎస్‌ఐ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Tata Altroz i-Turbo Petrol Launched In India. Read in Telugu.
Story first published: Saturday, January 23, 2021, 11:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X