డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ విక్రయిస్తున్న టాటా టియాగో కారులో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాటా టియాగో లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఇప్పటికే డీలర్‌షిప్ కేంద్రాలకు కూడా చేరుకుంది. తాజాగా, ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో లీకైంది.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టి దాదాపు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో ఓ స్పెషల్ ఎడిషన్ మోడల్‌ను ప్లాన్ చేస్తోంది. టాటా టియాగో ఎక్స్‌టి వేరియంట్‌ను ఆధారంగా చేసుకొని ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను తయారు చేస్తున్నారు.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

ప్రస్తుతం మార్కెట్లో టాటా టియాగో ఎక్స్‌టి వేరియంట్ ధర రూ.5.49 లక్షలుగా ఉండగా, ఈ స్పెషల్ ఎడిషన్ టియాగో ధర రూ.5.79 లక్షలుగా ఉంది. అంటే, స్టాండర్డ్ ఎక్స్‌టి వేరియంట్ కంటే ఈ స్పెషల్ ఎడిషన్ వేరియంట్ ధర రూ.30,000 అధికంగా ఉంది.

MOST READ:రాష్ట్రపతిచే సత్కరించబడిన సాధారణ జంట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

టాటా మోటార్స్ ఈ స్పెషల్ ఎడిషన్ టియాగో ఉత్పత్తిని కేవలం 2,000 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. అదనపు ధరకు తగినట్లుగానే, ఈ కొత్త స్పెషల్ ఎడిషన్ టియాగో మోడల్‌లో కంపెనీ కొన్ని అదనపు ఫీచర్లను కూడా జోడించింది.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ డేటోనా గ్రే, పెరల్ వైట్ మరియు ఫ్లేమ్ రెడ్ అనే మూడు కొత్త సింగిల్ టోన్ కలర్లలో లభిస్తుంది. స్టాండర్డ్ ఎక్స్‌టి వేరియంట్లో స్టీల్ వీల్స్ లభిస్తుండగా, ఈ స్పెషల్ ఎడిషన్‌లో 14 ఇంచ్ బ్లాక్ అల్లాయ్ వీల్స్‌ను ఆఫర్ చేస్తున్నారు.

MOST READ:ఫాస్ట్‌ట్యాగ్‌ మినిమమ్ బ్యాలెన్స్‌పై క్లారిటీ ఇచ్చిన NHAI

ఇంటీరియర్స్‌లో అదనంగా అందిస్తున్న ఫీచర్లలో వాయిస్ కమాండ్‌తో కూడిన 5 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 4 స్పీకర్ హార్మన్ ఆడియో సిస్టమ్, ఆన్-బోర్డ్ నావిగేషన్ సిస్టమ్ మరియు రియర్ పార్సిల్ ట్రే మొదలైనవి ఉన్నాయి.

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

టియాగో లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ను ఎక్స్‌టి వేరియంట్‌పై ఆధారపడి చేసిన నేపథ్యంలో, ఎక్స్‌టి వేరియంట్‌లో లభించే పవర్ విండోస్, కీలెస్ ఎంట్రీ, ఫాలో-మీ-హోమ్ హెడ్‌ల్యాంప్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ సైడ్ మిర్రర్స్ వంటి ఫీచర్లు ఈ కొత్త వేరియంట్‌లో కూడా లభిస్తాయి.

MOST READ:గుడ్ న్యూస్.. మహిళలకు ఉచిత డ్రైవింగ్ ట్రైనింగ్.. కేవలం 50 మందికి మాత్రమే.. ఎక్కడో తెలుసా?

డీలర్‌షిప్‌లో ప్రత్యక్షమైన కొత్త 2021టాటా టియాగో స్పెషల్ ఎడిషన్

ఇంజన్ పరంగా ఈ లిమిటెడ్ ఎడిషన్ వేరియంట్‌లో ఎలాంటి మార్పులు లేవు. ఇది 1.2 లీటర్, 3-సిలిండర్, న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 86 పిఎస్‌ల శక్తిని మరియు 113 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.

Most Read Articles

English summary
New Tata Tiago Limited Edition Model Arrives At Dealership, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X