Just In
- 3 hrs ago ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- 4 hrs ago క్రాష్ టెస్ట్‌లో శభాష్ అనిపించిన కియా కేరెన్స్.. ఆ విభాగంలో 5 స్టార్ రేటింగ్
- 8 hrs ago వందేళ్ల వయసులో తాత జోరు.. 50 ఏళ్ల ప్రీమియర్ పద్మినిలో షికారు.. వీడియో చూసేయండి
- 9 hrs ago ఈ కార్లు కొనుగోలు చేసేవారికి శుభవార్త!.. మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్
Don't Miss
- News డీజీ ఆంజనేయులు, సీపీ కాంతిరాణా టాటాపై ఈసీ బదిలీ వేటు: కీలక ఆదేశాలు
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- Movies Krishna Bhagavan: రవితేజ, వైవీఎస్ చౌదరి అలా గోడ దూకి వచ్చేవాళ్లు.. నన్ను అలా అనుకొని!
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
విడుదలకి ముందే డీలర్‌షిప్‌లో కనిపించిన టాటా టియాగో ఎన్ఆర్జి ఫేస్‌లిఫ్ట్; వివరాలు
ప్రముఖ వాహన తయారీ సంస్థ 'టాటా మోటార్స్' తన ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ అయిన టాటా టియాగో యొక్క 'ఎన్ఆర్జి' ఎడిషన్‌ను 2021 ఆగస్టు 4 న విడుదల చేయనుంది. అయితే ఈ ఎన్ఆర్జి ఎడిషన్ విడుదలకు ముందే టాటా మోటార్స్ ఈ కారు యొక్క టీజర్ ఇమేజ్ను కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాలం ఇప్పుడు ఈ కొత్త ఎడిషన్ విడుదలకు ముందే డీలర్షిప్ లో కనిపించింది.
ఈ కొత్త టియాగో ఎన్ఆర్జి ఫేస్‌లిఫ్టెడ్ కారుని మీరు ఇక్కడ గమనించినట్లతే దీనికి బ్లాక్ కలర్ రూఫ్ ఉంది. ఇది రెండు డ్యూయల్ టోన్ కలర్స్ లో వస్తుంది. అవి వైట్ అండ్ బ్లాక్ కలర్స్. కొత్త టాటా టియాగో డీలర్షిప్ ఎంట్రీ లెవల్ మోడల్ 2018 మరియు 2020 మధ్య బుచ్ మరియు క్రాస్ఓవర్ మోడల్‌గా విక్రయించబడుతుంది.
2020 ప్రారంభంలో టియాగో ఫేస్‌లిఫ్ట్ అమ్మకానికి వచ్చినప్పుడు, కంపెనీ తన ఎన్ఆర్జి మోడల్‌ను తొలగించింది. టియాగో ఎన్ఆర్జి ఫేస్‌లిఫ్ట్ కారు మంచి ఆకర్షణీయమైన లుక్ లో ఉంటుంది. అంతే కాకుండా ఈ ఎస్యువి స్టైలింగ్ ఎలిమెంట్లను కలిగి ఉంటుంది.
టాటా టియాగో ఎన్ఆర్జి బాడీ క్లాడింగ్, టెయిల్‌గేట్, బ్లాక్ ప్లాస్టిక్ ఎలిమెంట్ మరియు ఎస్‌యూవీల మాదిరిగా రూపొందించిన చక్రాలు ఉన్నాయి. ఈ కొత్త మోడల్ ప్రామాణిక మోడల్ కంటే ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. కొత్త టియాగో యొక్క స్టాండర్డ్ మోడల్ 170 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది.
ఈ కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి మోడల్ యొక్క డిజైన్ దాని స్టాండర్డ్ టాటా టియాగో మోడల్ మాదిరిగానే ఉంటుంది. కానీ టియాగో ఎన్ఆర్జి వెర్షన్ ఏసీ వెంట్స్ మరియు గేర్ లివర్ చుట్టూ కాంట్రాస్ట్ ఆరెంజ్ కలర్ ఫినిషింగ్ కలిగి ఉంటుంది. కొత్త టియాగో ఎన్ఆర్జి ఫేస్‌లిఫ్ట్ కారు అపోల్స్ట్రే కూడా కలిగి ఉంటుంది.
టాటా టియాగో ఎన్ఆర్జి మోడల్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులోని ఫీచర్స్ దాని స్టాండర్డ్ మోడల్ లోని ఫీచర్స్ మాదిరిగానే ఉంటుంది. ఇది ఆపిల్ కార్ ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్, హెర్మన్ సౌండ్ సిస్టమ్, రిమోట్ లాకింగ్ / అన్‌లాకింగ్‌తో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంది.
టాటా మోటార్స్‌లో 1.2 లీటర్ రివోట్రాన్ న్యాచురల్లీ అస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఈ ఇంజన్ 86 బిహెచ్పి పవర్ మరియు 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌లో 5 స్పీడ్ మాన్యువల్ మరియు AMT గేర్‌బాక్స్ ఆప్సన్ కూడా అందుబాటులో ఉంటుంది.
కొత్త టాటా టియాగో ఎన్ఆర్జి వేరియంట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ విత్ ఎబిడి మరియు కెమెరాతో రియర్ పార్కింగ్ సెన్సార్లను పొందే అవకాశం ఉంది. మొత్తానికి ఇది లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుందని చెప్పవచ్చు.
Source: Team BHP