కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors ఈనెల 18వ తేదీన తమ కొత్త Tigor EV ని ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు కంపెనీ బుకింగ్‌లను స్వీకరించడం కూడా ప్రారంభించింది. ఆసక్తిగల కస్టమర్లు రూ.21,000 టోకెన్ అమౌంట్ చెల్లించి ఈ కారును బుక్ చేసుకోవచ్చు.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

ప్రస్తుతం Tata Motors ఈ ఎలక్ట్రిక్ కారును ఎంపిక చేసిన డీలర్‌షిప్‌లలో మాత్రమే విక్రయిస్తోంది. కాగా, ఇప్పటి వరకు, కంపెనీ తమ కొత్త Tigor EV యొక్క ధరను వెల్లడించలేదు. తాజా సమాచారం ప్రకారం, ఆగష్టు 31వ తేదీన కంపెనీ ఈ కారును మార్కెట్లో విడుదల చేసే సందర్భంగా, దీని ధర మరియు ఇతర వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

వచ్చే 2025 నాటికి దేశంలో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయాలని Tata Motors ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ కొత్త Tigor EV ని మార్కెట్‌కు పరిచయం చేసింది. ప్రస్తుతం, కంపెనీ భారత మార్కెట్లో రెండు పూర్తి ఎలక్ట్రిక్ మోడళ్లను విక్రయిస్తోంది. అవి - Nexon EV మరియు Tigor EV.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

Tigor EV ఎక్స్టీరియర్ డిజైన్

కొత్త Tigor EV ని కంపెనీ రేంజ్ మరియు చార్జింగ్ వంటి అంశాల పరంగానే కాకుండా, దీని డిజైన్ పరంగా అప్‌గ్రేడ్ చేసింది. కంపెనీ ఇందులో ప్రొజెక్టర్ ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు మరియు ఇంటిగ్రేటెడ్ ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్‌లను కూడా ఇందులో జోడించింది. ఇవే కాకుండా, అల్లాయ్ వీల్స్‌పై మరియు ఎక్స్టీరియర్‌లోని మరిన్ని కొన్ని ప్రాంతాల్లో బ్లూ కలర్ డీటేలింగ్స్‌ను ఇచ్చింది. ఇవన్నీ ఈ కారును ఎలక్ట్రిక్ కారుగా చూపించడంలో సహకరిస్తాయి.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

Tigor EV ఇంటీరియర్ డిజైన్

ఇక ఇంటీరియర్స్‌లో చేసిన మార్పుల విషయానికి వస్తే, ఈ కారులో కంపెనీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ కారు క్యాబిన్ లోపల కూడా చాలా చోట్ల బ్లూ కలర్ యాక్సెంట్లను కంపెనీ ఉపయోగించింది. ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్, ఏసి వెంట్‌లు, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ప్యానెల్‌లు మరియు కారు సీట్లపై బ్లూ కలర్ యాక్సెంట్లు కనిపిస్తుంది.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

Tigor EV సేఫ్టీ ఫీచర్స్

ఈ కొత్త ఎలక్ట్రిక్ కారులో కంపెనీ మెరుగైన ఇంటీరియర్ డిజైనింగ్‌తో పాటు, వరల్డ్ క్లాస్ సేఫ్టీ ఫీచర్లను కూడా అందిస్తోంది. కొత్త Tigor EV లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్, ఈబిడితో కూడిన ఏబిఎస్, డ్యూయల్-వీల్ డిస్క్ బ్రేక్స్, క్రూయిజ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్క్ అసిస్ట్, హిల్ అసెంట్ అసిస్ట్, హిల్ డీసెంట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, స్పీడ్ అలర్ట్ సిస్టమ్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, రియర్ పార్కింగ్ కెమెరా వంటి అనేక భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

వినియోగదారు కనెక్టివిటీని మెరుగుపరచడానికి, ఇంకా ఇందులో రిమోట్ కమాండ్‌లు మరియు రిమోట్ డయాగ్నోస్టిక్స్ వంటి 30 కి పైగా కనెక్టెడ్ ఫీచర్‌లను కంపెనీ అందించింది. ఇంకా ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, క్లైమేట్ కంట్రోల్, ఐఆర్ఏ కనెక్టెడ్ టెక్నాలజీ, మొబైల్ ఛార్జింగ్ పోర్ట్‌లు, రియర్ ఏసి వెంట్‌లు, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, క్రూయిజ్ కంట్రోల్ మరియు 316-లీటర్ బూట్ స్పేస్ వంటి విశిష్టతలు కూడా ఉన్నాయి.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

Tigor EV బ్యాటరీ, పవర్ మరియు రేంజ్

కొత్త Tigor EV లో కంపెనీ Ziptron టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా దాని పవర్ మరియు రేంజ్‌లను కంపెనీ పెంచింది. ఇదివరకూ ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తి చార్జ్‌పై కేవలం 90 నుండి 100 కిమీల రేంజ్‌ని మాత్రమే ఆఫర్ చేసేది. కాగా, ఇప్పుడు Ziptron టెక్నాలజీ కారణంగా ఇది పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 250 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్‌‌ను అందిస్తోంది.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

కొత్త Tigor EV లో IP67 రేట్ చేయబడిన 26 కిలోవాట్ల లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా ఇది 55 కిలోవాట్ల శక్తిని 170 ఎన్ఎమ్‌ల టార్క్‌ని జనరేట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం 5.7 సెకన్లలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

కొత్త Tata Tigor EV బుకింగ్స్ ఓపెన్; ఆగస్ట్ 31న విడుదల

ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఫాస్ట్ ఛార్జర్ సహాయంతో కేవలం 60 నిముషాల్లో ఈ ఎలక్ట్రిక్ కారును 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నార్మల్ 15 యాంప్స్ హోమ్ సాకెట్ ఛార్జర్ సాయంతో అయితే, బ్యాటరీలను పూర్తిగా ఛార్జ్ చేయటానికి దాదాపు 8.5 గంటల సమయం పడుతుంది. కంపెనీ ఈ బ్యాటరీని 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీతో అందిస్తోంది.

Most Read Articles

English summary
New tata tigor ev bookings opened official launch on 31st august details
Story first published: Saturday, August 21, 2021, 16:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X