Just In
- 1 hr ago
ఇదుగిదిగో.. కొత్త 2021 ఫోర్స్ గుర్ఖా; త్వరలో విడుదల, కొత్త వివరాలు వెల్లడి
- 2 hrs ago
కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ ఎప్పుడు? ఇందులో కొత్తగా ఏయే ఫీచర్లు ఉండొచ్చు?
- 3 hrs ago
ఘన విజయం సాధించిన ఇండియన్ క్రికెట్ టీమ్‌కి ఆనంద్ మహీంద్రా స్పెషల్ గిఫ్ట్.. ఏంటో తెలుసా..!
- 1 day ago
బైడెన్ ఉపయోగించే 'మృగం' లాంటి కారు గురించి కొన్ని ఆసక్తికర విషయాలు
Don't Miss
- Movies
టాలీవుడ్లో మరో భారీ మల్టీస్టారర్: బన్నీ, విజయ్ కాంబోలో మూవీ.. చిన్న డైరెక్టర్.. పెద్ద నిర్మాత ప్లాన్!
- News
అప్పుడెందుకు వాయిదా వేశారు ? జగన్ కు మద్దతుగా పంచాయితీ పోరుపై నటుడు సుమన్ కీలక వ్యాఖ్యలు
- Finance
సెన్సెక్స్ దిద్దుబాటు! నిర్మల ప్రకటన అంచనాలు అందుకోకుంటే.. మార్కెట్ పతనం?
- Lifestyle
Zodiac signs: మీ రాశిని బట్టి మీకు ఎలాంటి మిత్రులు ఉంటారో తెలుసా...!
- Sports
ఇంగ్లండ్ అలా చేయకుంటే భారత్‌ను అవమానపరిచినట్టే.. జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ల ఫైర్!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ & లెజెండర్ వేరియంట్ టీజర్స్ రిలీజ్ చేసిన టయోటా.. లాంచ్ ఎప్పుడంటే?
భారత మార్కెట్లో ప్రముఖ వాహన తయారీదారుగా ప్రసిద్ధి చెందిన టయోటా తన బ్రాండ్ నుంచి ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ యొక్క రెండు కొత్త వెర్షన్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. ఇందులో మొదటి ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్, ఇది కొంత వరకు కాస్మెటిక్ అప్డేట్స్ మరియు కొన్ని ఫీచర్స్ పొందుతుంది. ఇక రెండవ మోడల్ స్పోర్టియర్ లెజెండర్ మోడల్.

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్, లెజెండర్ వేరియంట్ రెండూ భారతీయ మార్కెట్లో విడుదలయ్యాయి. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న రెండు మోడళ్లు ఈ నెల 6 న భారత మార్కెట్లో విడుదల కానున్నాయి. టయోటా ఫార్చ్యూనర్ ఇటీవల ఫేస్‌లిఫ్ట్, లెజెండర్ వేరియంట్ ఎస్‌యూవీ టీజర్ చిత్రాలను విడుదల చేసింది.

టయోటా విడుదల చేసిన ఈ టీజర్ చిత్రాలలో హెడ్‌ల్యాంప్స్ యొక్క రెండు వెర్షన్లు ఉన్నాయి. ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లు ఒకే ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉన్నాయి. ఫార్చ్యూనర్ లెజెండర్ హెడ్‌ల్యాంప్‌లు చాలా స్పోర్టియర్ క్లస్టర్‌ను కలిగి ఉన్నాయి.
MOST READ:న్యూ ఇయర్లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

కొత్త టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ దాని స్టాండర్డ్ మోడల్ కంటే శక్తివంతమైన మరియు ప్రీమియం వెర్షన్. కొత్త సంవత్సరంలో, టయోటా తన ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మరియు లెజెండర్ ఎస్‌యూవీని విడుదల చేయడంతో వినియోగదారులను ఎక్కువగా ఆకర్షించే అవకాశం ఉంది.

టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ మంచి ఆఫ్ రోడ్ సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఈ కొత్త ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో మునుపటి మోడల్ యొక్క అప్డేటెడ్ వెర్షన్. కొత్త ఫెసిలిప్ట్ వెర్షన్ చాలా నవీనీకరణలను పొందింది. ఇది మునుపటికంటే చాలా ఆకర్షణీయంగా ఉంది.
MOST READ:కొత్త సంవత్సరంలో కొత్త పనికి శ్రీకారం చుట్టిన జగన్ ప్రభుత్వం.. అదేంటో తెలుసా !

ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ ఇప్పుడు మరింత స్పోర్టి డిజైన్ కలిగి ఉంది. టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ఇప్పుడు చాలా దూకుడుగా కనిపించింది.
ఇక కొత్త ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ డిజైన్ విషయానికొస్తే, ముందు భాగంలో కొత్త డిజైన్ కలిగి ఉంది. ఇది డే టైం రన్నింగ్ లైట్‌తో పునఃరూపకల్పన చేసిన ఎల్‌ఇడి హెడ్‌లైట్ మరియు పెద్ద మెష్ గ్రిల్ కలిగి ఉంది.

టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ ఇంటీరియర్ విషయానికొస్తే, దాని స్టాండర్డ్ మోడల్‌తో పోలిస్తే, ఈ కొత్త మోడల్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, ఆపిల్ ప్లే కార్‌తో వచ్చే పెద్ద, 8.0 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఇన్‌స్టాల్ చేయనుంది.
MOST READ:యువరాజ్ సింగ్ గ్యారేజ్‌లో చేరిన మరో కొత్త లగ్జరీ కార్ ; ధర & వివరాలు

టయోటా యొక్క ఈ రెండు ఎస్‌యూవీల్లో 2.8-లీటర్ డీజిల్ ఇంజిన్‌తో అమర్చే అవకాశం ఉంది. ఈ ఇంజన్ 201 బిహెచ్‌పి పవర్ మరియు 500 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6 స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్‌తో వస్తుంది.

టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్‌తో పోలిస్తే ఫార్చ్యూనర్ లెజెండర్ ఎస్‌యూవీ మరింత ప్రీమియం వెర్షన్. అంతే కాకుండా ఫార్చ్యూనర్ లెజెండర్ ఇప్పటికే విదేశాలలో తన రహదారి సామర్థ్యాన్ని నిరూపించింది. ఇప్పుడు ఈ కొత్త లెజెండర్ ఎస్‌యూవీ, దాని స్టాండర్డ్ మోడల్ కంటే ఎక్కువ ఖరీదైనదిగా ఉంటుంది.
MOST READ:కొత్త స్టైల్లో లంబోర్ఘిని సూపర్ కార్ డెలివరీ.. ఇప్పటి వరకూ ఇలాంటి డెలివరీ ఎక్కడా చూసుండరు

మునుపటి ఫార్చ్యూనర్ మోడల్‌తో పోలిస్తే, కొత్త ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్ అనేక నవీకరణలను అందుకుంది. ఈ రెండు ఎస్‌యూవీలు భారత మార్కెట్లో చాలా అంచనాలను పెంచాయి. ఈ రెండు కొత్త మోడళ్లు చాలా మంచి డిజైన్ కలిగి ఉంది, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల ఇవి మంచి అమ్మకాలను కూడా కలిగించే అవకాశం ఉంది.