అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ బడ్జెట్ ఎస్‌యూవీ మహీంద్రా బొలెరోలో కంపెనీ ఓ కొత్త అప్‌డేటెడ్ వెర్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా ఇంటర్నెట్‌లో లీక్ అయ్యాయి.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

సరికొత్త డిజైన్ అప్‌డేట్స్ మరియు లేటెస్ట్ ఫీచర్లతో కంపెనీ తమ కొత్త 2021 మహీంద్రా బొలెరోను మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. మహీంద్రా బ్రాండ్ నుండి చాలా కాలంగా మార్కెట్లో ఉండి, అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీలలో బొలెరో ఒకటిగా కొనసాగుతోంది.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

మహీంద్రా ఇప్పుడు ఈ ఎస్‌యూవీకి మరింత ఆకర్షణీయమైన రూపాన్ని ఇవ్వటం ద్వారా దీని అమ్మకాలను పెంచుకోవాలని చూస్తోంది. కొత్త 2021 మహీంద్రా బొలెరోను డ్యూయల్ టోన్ ఎక్స్‌టిరియర్స్‌ థీమ్‌తో తీసుకురానున్నారు. ఈ ఎస్‌యూవీ ముందు భాగం మరియు బంపర్ గ్రే కలర్‌లో ఉంటుంది. ఇది ఎరుపు రంగుతో సులువుగా సరిపోలుతుంది.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2021 మహీంద్రా బొలెరోను కంపెనీ ఓ కొత్త రంగుతో విడుదల చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. దీని ఫ్రంట్ గ్రిల్ మరియు బంపర్‌లో ఎటువంటి మార్పులు లేవు, ఇవి పాత మోడల్ మాదిరిగానే కనిపిస్తాయి. అయితే, దీని హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌లో మాత్రం కొన్ని రకాల మార్పులు చూడవచ్చు.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

ఈ మోడల్‌లో ఫ్రంట్ ఫాగ్ లాంప్స్ అందుబాటులో లేవు, అలాగే సైడ్ మిర్రర్స్ బాడీ కలర్‌కు బదులుగా నలుపు రంగులో ఫినిష్ చేయబడి ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఎస్‌యూవీ ఇంటీరియర్స్‌లో ఎలాంటి మార్పులు ఉంటాయనే అంశంపై సమాచారం లేదు. రానున్న నెలల్లో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

ఇంజన్ పరంగా కూడా ఇందులో ఎలాంటి మార్పులు ఉండబోవు. ఇదివరకటి బొలెరోలో ఉపయోగించిన అదే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఈ కొత్త మోడల్‌లోనూ కొనసాగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పి పవర్‌యు మరియు 210 న్యూటన్ మీటర్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

ప్రస్తుతం ఈ ఎస్‌యూవీని బి4, బి6 మరియు బి6 (ఓ) అనే మూడు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. ఇటీవలి కాలంలో బిఎస్6 అప్‌డేట్‌తో వచ్చిన మహీంద్రా బొలెరోలో కంపెనీ తాజాగా మరొక కొత్త అప్‌డేట్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఈ కొత్త 2021 మోడల్‌పై మార్కెట్లో మంచి అంచనాలు ఉన్నాయి.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

మహీంద్రా బొలెరో ఎస్‌యూవీ కోసం కంపెనీ ఇటీవలే ఓ యాక్సెసరీస్ ప్యాకేజీని కూడా విడుదల చేసింది. బొలెరో యాక్ససరీస్ ప్యాకేజీలో గ్రిల్, హెడ్‌లైట్, ఫ్రంట్ అండ్ రియర్ బంపర్, అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, ఫాక్స్ వుడ్ ఇన్సర్ట్స్ వంటి ఉపకరణాలు ఉన్నాయి. ఈ యాక్ససరీస్ ప్యాకేజీ ధరను రూ.1,04,800 గా నిర్ణయించారు.

అప్‌డేటెడ్ 2021 మహీంద్రా బొలెరో మొదటి చిత్రాలు.. చూసేయండి..!

బొలెరో ఎస్‌యూవీలోని అన్ని వేరియంట్ల కోసం మహీంద్రా వివిధ రకాల యాక్ససరీ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చింది. దీని సాయంతో, కస్టమర్లు తమ ఎస్‌యూవీలను తమకు నచ్చినట్లుగా ఒరిజినల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఎక్విప్‌మెంట్ (ఓఈఎమ్)ల సాయంతో కస్టమైజ్ చేసుకోవచ్చు.

Source: Team-BHP

More from DriveSpark

Article Published On: Tuesday, May 4, 2021, 11:16 [IST]
English summary
New 2021 Updated Mahindra Bolero Spied For The First Time, Spy Pics Add Details. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+