కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

కొరియన్ కార్ బ్రాండ్ కియా, తమ సరికొత్త 2022 స్పోర్టేజ్ ఎస్‌యూవీ యొక్క అధికారిక టీజర్ చిత్రాలను విడుదల చేసింది. కియా స్పోర్టేజ్ ఇప్పటికే పలు అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముడవుతోంది. తాజా, సమాచారం ప్రకారం ఈ కొత్త కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదల కావచ్చని తెలుస్తోంది.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

ఈ ఐదవ తరం కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీని ముందుగా జూలై 2021లో దక్షిణ కొరియా మార్కెట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాత దశల వారీగా ఈ కారుని పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయనున్నారు. ప్రస్తుత నాల్గవ తరం కియా స్పోర్టేజ్ మోడల్‌తో పోల్చుకుంటే, కొత్త తరం (2022) మోడల్ ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

కొత్త తరం కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీని ఈ బ్రాండ్ యొక్క 'ఆపోజిట్స్ యునైటెడ్' అనే కొత్త డిజైన్ ఫిలాసఫీ ఆధారంగా రూపొందిస్తున్నారు. ఈ టీజర్ చిత్రాలను గమనించినట్లయితే, కొత్త 2022 కియా స్పోర్టేజ్ చాలా సరళమైన డిజైన్‌ను మరియు అగ్రెసివ్ వైఖరిని కలిగి ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ కొత్త కారులో కంపెనీ ఇటీవల రీబ్రాండ్ చేసిన తమ కొత్త లోగోను కూడా చూడొచ్చు.

MOST READ:పనికిరాని సీట్ బెల్టులతో వ్యాపారం.. మిలియన్ల కొద్దీ సంపాదన.. ఎలా అనుకునుటున్నారా?

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

ఈ కారు ఎక్స్టీరియర్‌లో బానెట్ మరియు బాడీ చుట్టూ మజిక్యులర్ క్రీజ్ లైన్స్, ముందు భాగంలో విలక్షణమైన స్లిట్ ఫ్రంట్ గ్రిల్, బంపర్ క్రింది భాగంలో పెద్ద ఎయిర్ ఇన్‌టేక్స్, మరియు ఫ్రంట్ బంపర్‌కి ఇరువైపులా విశిష్టమైన హెడ్‌ల్యాంప్ డిజైన్ వంటి అనేక మార్పులు ఇందులో ఆశించవచ్చు. ఏదేమైనప్పటికీ, కియా స్పోర్టేజ్ ఓవరాల్ డిజైన్ సిల్హౌట్ మాత్రం మునుపటిలా క్రాసోవర్ మాదిరిగానే ఉంటుంది.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

ఈ ఎస్‌యూవీ వెనుక వైపు డిజైన్‌లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. వెనుక వైపు రూఫ్ భాగం వాలినట్లుగా అనిపిస్తుంది, ఇది ఈ ఎస్‌యూవీకి క్రాసోవర్ లుక్‌నిస్తుంది. రీడిజైన్ చేయబడిన బంపర్, సరికొత్త టెయిల్ ల్యాంప్స్ వంటి డిజైన్ మార్పులు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు ఉంటాయని టీజర్ ఇమేజ్‌ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇందులోని కొత్త డ్యూయల్ స్క్రీన్ డాష్‌బోర్డ్ పెద్ద హైలైట్‌గా ఉంటుంది. ఒకే ప్యానెల్‌లో ఇన్ఫోటైన్‌మెంట్ టచ్‌స్క్రీన్ మరియు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రెండూ ఉంటాయి. కర్వ్‌డ్ డిస్‌ప్లే మాదిరిగా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ ఏసి వెంట్స్‌ను కూడా చాలా కొత్తగా డిజైన్ చేశారు.

కొత్త 2022 కియా స్పోర్టేజ్ ఎస్‌యూవీ టీజర్ లాంచ్; భారత్‌కు వచ్చే చాన్స్!

ఈ కొత్త తరం కియా స్పోర్టేజ్ భారత మార్కెట్లోకి ప్రవేశిస్తుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం కియా ఇండియా, దేశీయ విపణిలో సోనెట్, సెల్టోస్ మరియు కార్నివాల్ అనే మూడు ఉత్పత్తులను మాత్రమే విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, కియా తమ భారతీయ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని పెంచుకునేందుకు ఈ కొత్త తరం స్పోర్టేజ్‌ను ఇక్కడి మార్కెట్లో ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

Most Read Articles

English summary
Next Generation 2022 Kia Sportage Teased Ahead Of Global Unveil, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X