Just In
- 11 hrs ago
మతిపోగొడుతున్న హ్యుందాయ్ మార్చ్ నెల డిస్కౌంట్స్.. దేనిపై ఎంతో చూసారా..!
- 14 hrs ago
భారత్‌లో విడుదలైన 3 కొత్త NIJ ఎలక్ట్రిక్ స్కూటర్స్.. చీప్ కాస్ట్ & మోర్ ఫీచర్స్
- 14 hrs ago
గుడ్ న్యూస్! ఇకపై ఈ సేవల కోసం ఆర్టీఓ చుట్టూ తిరగక్కర్లేదు, అన్నీ ఆన్లైన్లోనే..
- 15 hrs ago
కేవలం 65,920 రూపాయలకే కొత్త బజాజ్ ప్లాటినా 110 ఎబిఎస్ బైక్ ; వివరాలు
Don't Miss
- News
వేద మంత్రాన్నివింటే లాభమొస్తుందా...ఎలా..?
- Lifestyle
శనివారం దినఫలాలు : ఓ రాశి ఉద్యోగులకు ఉన్నతాధికారులతో మంచి సమన్వయం ఉంటుంది...!
- Finance
ధరలు ఎలా ఉన్నాయంటే? 44వేలకు దిగొచ్చిన బంగారం, వెండి రూ.66 వేల దిగువన
- Sports
ఆ విషయంలో రోహిత్ శర్మను చూసి విరాట్ కోహ్లీ నేర్చుకోవాలి: మనోజ్ తివారీ
- Movies
‘A’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫిబ్రవరి 23న కొత్త 2021 కియా కార్నివాల్ గ్లోబల్ లాంచ్; ఆ తర్వాత ఇండియాలో కూడా..
కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ గతేడాది ఆవిష్కరించిన తమ సరికొత్త 2021 కియా కార్నివాల్ ఎమ్‌పివిని ఫిబ్రవరి 23వ తేదీన అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేయనుంది. ఈ కొత్త తరం కియా కార్నివాల్, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన చేసిన సరికొత్త బ్యాడ్జ్ (లోగో)ను కలిగి ఉన్న మొట్టమొదటి వాహనంగా మారుతుంది.

అమెరికా మార్కెట్లలో కియా మోటార్స్ విక్రయిస్తున్న సెడోనా ఎమ్‌పివి స్థానాన్ని ఈ కొత్త తరం కార్నివాల్ రీప్లేస్ చేయనుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ కొత్త తరం కియా కార్నివాల్ ఈ ఏడాది చివరి నాటికి భారత మార్కెట్లో కూడా విడుదలయ్యే అకాశం ఉంది.

కొత్త 2021 కియా కార్నివాల్ 7-సీటర్ మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో లభ్యం కానుంది. ఈ సరికొత్త కార్నివాల్‌ను మరింత విశాలంగా తయారు చేశారు. ప్రస్తుత తరం మోడల్‌తో పోల్చుకుంటే ఈ కొత్త తరం ఎమ్‌పివి 40 మిమీ ఎక్కువ పొడవును మరియు 10 మిమీ ఎక్కువ వెడల్పునుమరియు 30 మిమీ ఎక్కువ వీల్‌బేస్‌ను కలిగి ఉంటుంది.
MOST READ:రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌లపై విరుచుకుపడుతున్న పోలీసులు.. కారణం ఇదే

కొత్త 2021 కార్నివాల్ ఎమ్‌పివి కియా యొక్క లేటెస్ట్ డిజైన్ లాంగ్వేజ్‌తో తయారైంది. ఇది మునుపటి కియా మోడళ్ల కన్నా మరింత ఎక్కువ రోడ్ ప్రెజన్స్‌ను కలిగి ఉంటుంది. అన్ని కియా కార్ల మాదిరిగానే, ఈ కొత్త కార్నివాల్ ఎమ్‌పివిలో కూడా బ్రాండ్ సిగ్నేచర్ ‘టైగర్-నోస్' గ్రిల్ కనిపిస్తుంది. అయితే, ఇందులో కొత్త డైమండ్ ప్యాటర్న్ గ్రిల్, కారు ముందు భాగానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది.

ఈ కారులో పూర్తి కొత్తగా కనిపించే హెడ్‌ల్యాంప్ యూనిట్, కొత్త ఎల్‌ఈడి డిఆర్‌ఎల్‌లతో పాటుగా వ్రాప్ అరౌండ్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ కనిపిస్తాయి. ముందు భాగంలో ఉన్న ఇతర మార్పులను చూస్తే, బంపర్ క్రింది భాగంలో ఎస్‌యూవీ నుండి స్పూర్తి పొందిన ఫాక్స్ స్కఫ్ ప్లేట్‌తో పాటు సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్స్‌ను జోడించారు.

కొత్త కార్నివాల్ సైడ్ ప్రొఫైల్‌ని కూడా అప్‌డేట్ చేశారు. స్లైడింగ్ డోర్స్ కారణంగా ఈ కారు సైడ్స్‌లో మినిమలిస్టిక్ డిజైన్‌ను కలిగి ఉంటుంది, క్రీజ్ లైన్స్ ఇప్పుడు మరింత షార్ప్‌గా కనిపిస్తాయి. వెనుక భాగంలో సరికొత్త ఎల్ఈడి టెయిల్ లైట్లు మరియు ఈ రెండు టెయిల్ లైట్లను కలుపుతూపోయేలా ఉన్న ఓ సన్నటి లైట్ బార్ ఉంటుంది.

ఇక కియా కార్నివాల్ ఎమ్‌పివి ఇంటీరియర్స్‌ని గమనిస్తే, దీని క్యాబిన్ లేఅవుట్ మరియు ఫీచర్లు ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ కన్నా మరింత మెరుగ్గా ఉంటుంది. విశాలమైన క్యాబిన్, సరికొత్త డాష్‌బోర్డ్ డిజైన్, మెరుగైన కనెక్టింగ్ టెక్నాలజీ కూడిన ఫీచర్లతో దీనిని తయారు చేశారు.
MOST READ:అంబానీ ఇంట చేరిన మరో ఫెరారీ సూపర్ స్పోర్ట్స్ కార్.. చూస్తే మైండ్ బ్లోయింగ్

కొత్త కియా కార్నివాల్ డాష్‌బోర్డ్‌లో రెండు 12.3 ఇంచ్ స్క్రీన్స్ ఉంటాయి, ఇందులో ఒకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం, మరొకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం. ఈ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌లో బ్రాండ్ యొక్క యూవీఓ కనెక్టింగ్ టెక్నాలజీతో పాటు అనేక ఇతర ఫీచర్లను జోడించనున్నారు. ఇది ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలను కూడా సపోర్ట్ చేయనుంది.

ఈ కారులోని ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎలక్ట్రిక్ స్లైడింగ్ డోర్స్, వైర్‌లెస్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేషన్‌తో కూడిన ఫ్రంట్ సీట్లు, పవర్డ్ టెయిల్‌గేట్, వెనుక ప్రయాణీకుల కోసం ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అలాగే, అన్ని స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా ఇందులో లభ్యం కానున్నాయి.
MOST READ:కార్ డ్రైవ్ చేస్తుండగా, హఠాత్తుగా వచ్చిన పాము.. చివరికి ఎం జరిగిందంటే ?

కియా మోటార్స్ కార్నివాల్ ఎమ్‌పివి భారత మార్కెట్‌తో పాటుగా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా విక్రయిస్తోంది. ఈ నేపథ్యంలో, కొత్త 2021 కియా కార్నివాల్ కూడా భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరిలోపుగా కొత్త కార్నివాల్ భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది.

ప్రస్తుతం భారత మార్కెట్లో కియా కార్నివాల్ మొత్తం మూడు వేరియంట్లలో అమ్ముడవుతోంది. భారతదేశంలో విక్రయించే కార్నివాల్ ఎమ్‌పివి 2.2-లీటర్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 200 బిహెచ్‌పి పవర్‌ను మరియు గరిష్టంగా 440 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.