విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

మారుతి సుజుకి ఇండియా నుండి రానున్న రోజుల్లో కొన్ని కొత్త మోడళ్లు మార్కెట్లోకి రాబోతున్నాయి. వీటిలో ముందుగా కొత్త తరం మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ రానుంది. వాస్తవానికి, ఈ మోడల్ ఇప్పటికే మార్కెట్లోకి రావల్సి ఉండగా, ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా ఆలస్యమైంది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోను కంపెనీ పూర్తిగా కొత్త ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసింది. ఇది అప్‌డేటెడ్ డిజైన్ మరియు అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి రానుంది. తాజాగా, ఆటోకార్ ఇండియా నుండి వచ్చిన సమాచారం ప్రకారం, మారుతి సుజుకి త్వరలోనే ఈ కొత్త తరం సెలెరియోను భారత మార్కెట్లో విడుదల చేయనుంది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

మారుతి సుజుకి సెలెరియోని భారత మార్కెట్లో విడుదల చేసినప్పటి నుండి, ఇందులో చిన్నపాటి మార్పుల చేర్పుల మినహా పెద్ద మార్పులేమీ చేయలేదు. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నది మొదటి తరం సెలెరియో. కొత్తగా రానున్న సెలెరియో హ్యాచ్‌బ్యాక్ రెండవ తరం మోడల్ అవుతుంది.

MOST READ:విమానంలో ప్రయాణించేటప్పుడు మీ సెల్‌ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేయమన్నారా? ఎందుకో తెలుసా?

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

మారుతి సెలెరియోని తొలిసారిగా 2014లో భారతదేశంలో ప్రవేశపెట్టారు. అంతేకాదు, మారుతి సుజుకి నుండి తొలిసారిగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్‌టి) పొందిన మోడల్ కూడా సెలెరియో కారే. ఈ కారు విడుదల సమయంలో, ఇది భారతదేశంలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ హ్యాచ్‌బ్యాక్‌గా నిలిచింది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

మారుతి ఆల్టో కన్నా కాస్తంత మెరుగైన కార్ కోరుకునే వారికి సెలెరియో ఓ చక్కటి ఆప్షన్‌గా నిలుస్తుంది. కొత్తగా రాబోయే ఈ రెండవ తరం సెలెరియోని కంపెనీ సరికొత్త ప్లాట్‌ఫామ్‌తో ప్రారంభించడానికి సన్నద్ధమైంది. కొత్త 2021 సెలెరియో బ్రాండ్ యొక్క హార్టెక్ ప్లాట్‌ఫామ్‌పై తయారు కానుంది.

MOST READ:చంద్రుడిపైకి జనరల్ మోటార్స్ మూన్ రోవర్స్; పూర్తి వివరాలు

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ఈ ప్లాట్‌ఫామ్‌పై మారుతి సుజుకి ఇప్పటికే కొన్ని విజయవంతమైన మోడళ్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, హార్టెక్ ప్లాట్‌ఫామ్ మెరుగైన భద్రత, మంచి ఇంధన సామర్థ్యం మరియు మెరుగైన డ్రైవింగ్ డైనమిక్స్‌ను అందిస్తుంది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మొదటి తరం మారుతి సెలెరియోతో పోలిస్తే, కొత్తగా రాబోయే రెండవ-తరం సెలెరియో ఎక్కువ వీల్‌బేస్ కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఫలితంగా, ఈ కొత్త కారులో మునుపటి కన్నా మరింత మెరుగైన క్యాబిన్ స్థలం ఉంటుంది.

MOST READ:మీకు తెలుసా.. భారతదేశపు మొట్టమొదటి కమర్షియల్ పైలట్ ఈ యువతి

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ఈ అదనపు స్థలం ఎక్కువగా హ్యాచ్‌బ్యాక్ యొక్క వెనుక సీట్ల కోసం ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఫలితంగా, వెనుక వరుసలోని ప్రయాణీకులకు విశాలమైన లెగ్ రూమ్ లభిస్తుంది. అంతేకాకుండా, ఈ హ్యాచ్‌బ్యాక్ గ్రౌండ్ క్లియరెన్స్‌ను స్వల్పంగా పెంచడం ద్వారానికి క్రాస్ఓవర్ వైఖరిని ఇవ్వాలని కంపెనీ భావిస్తోంది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

కొత్త తరం మారుతి సుజుకి సెలెరియోలో కొత్త ప్లాట్‌ఫామే కాకుండా కొత్త ఇంజన్ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుందని సమాచారం. ఇందులో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటుగా, కొత్త తరం వ్యాగన్ఆర్ హ్యాచ్‌బ్యాక్‌లో ఆఫర్ చేస్తున్న పవర్‌ఫుల్ 1.2-లీటర్ కె12 ఇంజన్‌ను కూడా ఆఫర్ చేయవచ్చని తెలుస్తోంది.

MOST READ:విధుల్లో ఉన్న అంబులెన్స్ డ్రైవర్ తన తల్లి మరణ వార్త విన్నాడు.. తరువాత ఏం జరిగిందంటే?

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ప్రస్తుత 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 68 బిహెచ్‌పి పవర్‌ను మరియు 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, పెద్ద 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 82 బిహెచ్‌పి శక్తిని మరియు 4200 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను జనరేట్ చేస్తుంది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ఈ రెండు ఇంజన్లు కూడా ఫైవ్-స్పీడ్ మాన్యువల్ లేదా ఫైవ్-స్పీడ్ ఏఎమ్‌టి గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభ్యమయ్యే అవకాశం ఉంది. ఈ సెకండ్ జనరేషన్ సెలెరియోలోని లోయర్-స్పెక్ 1.0-లీటర్ ఇంజన్ వేరియంట్లలో కూడా కంపెనీ పెట్రోల్-సిఎన్‌జి వేరియంట్‌ను ఆఫర్ చేయవచ్చని సమాచారం.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ఈ కొత్త తరం హ్యాచ్‌బ్యాక్ లోపల మరియు వెలుపల పూర్తి రీడిజైన్‌ను కలిగి ఉంటుంది. ఎక్స్టీరియర్ మార్పులలో ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఇడి డిఆర్‌ఎల్‌లతో కూడిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, కొత్తగా రూపొందించిన అల్లాయ్ వీల్స్, కొత్త ఎల్‌ఇడి టెయిల్ లాంప్స్, రెండు చివర్లలో రీడిజైన్ చేయబడిన బంపర్‌లు మొదలైన మార్పులను ఆశించవచ్చు.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

ఈ నెక్స్ట్ జనరేషన్ మారుతి సుజుకి సెలెరియోలో కేవలం ఎక్స్టీరియర్‌లోనే కాకుండా ఇంటీరియర్‌లో కూడా భారీ మార్పులు ఉండనున్నాయి. ఇందులో క్యాబిన్ లేఅవుట్‌ని పూర్తిగా రీడిజైన్ చేయనున్నారు. ఇంకా ఇందులో బ్రాండ్ యొక్క లేటెస్ట్ స్మార్ట్‌ప్లే స్టూడియో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ కూడా ఉంటుంది.

విడుదలకు సిద్ధంగా ఉన్న కొత్త తరం మారుతి సెలెరియో

కొత్త డాష్‌బోర్డ్ లేఅవుట్, మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్లతో పాటుగా ఇందులో డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు, ఏబిఎస్ విత్ ఇబిడి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్లు వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. ఇది ఈ విభాగంలో టాటా టియాగో, హ్యుందాయ్ శాంత్రో మరియు రెనో క్విడ్ వంటి మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Source: AutoCar India

Most Read Articles

English summary
Next Generation Maruti Suzuki Celerio Is Ready For Launch; New Platform, New Design And More. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X