సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి (Maruti Suzuki) నుండి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోడళ్లలో రెండవ తరం (సెకండ్ జనరేషన్) సెలెరియో (Celerio) కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ కూడా ఒకటి. తాజా సమాచారం ప్రకారం, కంపెనీ ఈ చిన్న కారును నవంబర్ 10, 2021వ తేదీన విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

ఇప్పటి వరకూ మార్కెట్లోకి వచ్చిన సెలెరియో మోడళ్లతో పోల్చుకుంటే, ఈ కొత్త తరం సెలెరియో మోడల్ మునుపటి కంటే అనేక రెట్లు మెరుగ్గా ఉంటుందని భావిస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ 2021 మారుతి సుజుకి సెలెరియో (2021 Maruti Suzuki Celerio) హ్యాచ్‌బ్యాక్ మరింత కోణీయ డిజైన్, పెద్ద బాడీ బిల్డ్ మరియు అప్-మార్కెట్ ఇంటీరియర్ కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాకుండా, పవర్ మరియు పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఇది అత్యుత్తమంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

ఇటీవలి నివేదికల ప్రకారం, కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో హ్యాచ్‌బ్యాక్ కారులో కొత్త తరం 1.0 లీటర్ కె10సి, 3-సిలిండర్ డ్యూయల్-జెట్ పెట్రోల్ ఇంజన్‌ ను ఉపయోగించవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. కంపెనీ ఇప్పటికే ఈ ఇంజన్ ను పలు గ్లోబల్ సుజుకి కార్లలో ఉపయోగిస్తోంది. కాగా, ఇప్పుడు ఈ ఇంజన్ ను భారత మార్కెట్ కు అనుగుణంగా మార్చి తమ కొత్త కారులో ఉపయోగించనుంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

సుజుకి యొక్క 1.0 లీటర్ డ్యూయల్-జెట్ ఇంజన్‌ లో సవరించిన ఎగ్జాస్ట్ గ్యాస్ రీసర్క్యులేషన్ (EGR), అధిక కంప్రెషన్ రేషియో మరియు ఇన్లెట్ వాల్వ్‌లకు జతచేయబడిన డ్యూయల్ ఇంజెక్టర్లు ఉంటాయి. వీటి యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఈ సాంకేతికతలు వాహనం యొక్క ఇంధన సామర్థ్యాన్ని పెంచడంలో సహకరిస్తాయి. ఫలితంగా, ఈ కొత్త కారు యొక్క మైలేజ్ మునుపటి కన్నా మెరుగ్గా ఉంటుంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

డ్యూయల్ జెట్ ఇంజన్ తో వస్తున్న కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో లీటరు పెట్రోల్ కి సుమారు 26 కిలోమీటర్ల మైలేజీతో కూడిన ఉత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని నివేదించబడింది. ఈ కారు ఈ విభాగంలో టాటా టియాగో ఏఎమ్‌టి మరియు హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి మోడళ్లకు పోటీగా ఉంటుంది. ఇవి వరుసగా లీటరుకు 23.84 కిమీ మరియు 18.9 కిమీ మైలేజీని ఆఫర్ చేస్తాయి.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో మోడల్ లైనప్ లో ప్రస్తుతం ఉపయోగిస్తున్న 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 82 బిహెచ్‌పి ల శక్తిని ఉత్పత్తి చేయగలదు. కాగా, ఈ హ్యాచ్‌బ్యాక్ యొక్క కొత్త 1.0 లీటర్ డ్యూయల్-జెట్ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. అదనంగా, ఇందులో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కిట్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

ప్రస్తుతం, మారుతి సుజుకి నుండి డీజిల్ కార్లు పూర్తిగా నిలిచిపోవడంతో, మైలేజ్ కి ప్రాధాన్యత ఇచ్చే కస్టమర్లు ఇప్పుడు కంపెనీ విక్పయిస్తున్న ఫ్యాక్టరీ ఫిట్టెడ్ సిఎన్‌జి కార్లను ఎంచుకుంటున్నారు. ఫలితంగా, మారుతి సుజుకి సిఎన్‍‌జి కార్లకు మార్కెట్ నుండి మంచి స్పందన లభిస్తోంది. దీనికి ప్రధాన కారణం ఎలక్ట్రిక్ కార్ల ధరలు అధికంగా ఉండటం మరియు ఛార్జింగ్ మౌళిక సదుపాయాల లభ్యత అంతంత మాత్రంగానే ఉండటం.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

అయితే, ప్రస్తుత శిలాజ ఇంధన ధరల పెరుగుదల మాదిరిగానే, భవిష్యత్తులో సిఎన్‌జి ధరల పెరుగుదల కూడా కంపెనీకి కొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగలిలే చేయవచ్చు. ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి ప్రస్తుత ప్లాట్‌ఫామ్ లో మార్పులు చేయాలని చూస్తుంది. కొత్త మారుతి సెలెరియో సుజుకి యొక్క తేలికపాటి హార్టెక్ ప్లాట్‌ఫామ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది ప్రస్తుత మోడల్ కంటే తేలికైనది మరియు దృఢమైనదిగా ఉంటుంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ పరిమాణంలో కూడా చాలా గొప్పగా ఉంటుంది. అయితే, దీని కొలతలను మారుతి సుజుకి ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. పైన చెప్పినట్లుగా, కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో స్క్వేర్ మరియు టోల్‌బాయ్ డిజైన్‌కు బదులుగా కోణీయమైన డిజైన్ ను కలిగి ఉంటుంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

హనీకోంబ్ ప్యాటర్న్ తో కూడిన ఫ్లాట్ ఓవల్ గ్రిల్, క్రోమ్ స్ట్రిప్ ద్వారా కనెక్ట్ చేయబడిన త్రిభుజాకారపు హెడ్‌ల్యాంప్‌లు, కొత్త ఫాగ్ ల్యాంప్ అసెంబ్లీ, మరింత నిటారుగా ఉండే నోస్, కాంట్రాస్ట్ బ్లాక్ బిట్‌లతో సర్దుబాటు చేయబడిన ఫ్రంట్ బంపర్ మరియు పొడవైన టేప్డ్ రూఫ్‌లైన్‌తో పొడిగించిన గ్లాస్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ను ఇందులో గమనించవచ్చు.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

అలాగే, దీని ఇంటీరియర్ లు కూడా మునుపటి కన్నా కాస్తంత ప్రీమియంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో ఇంటిగ్రేషన్‌ తో రానుంది. అలాగే, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, కొత్త ఫ్యాబ్రిక్ అప్‌హోలెస్ట్రీ, స్టీరింగ్ వీల్ పై కంట్రోల్ బటన్‌లు, పవర్ విండో స్విచ్‌లు మరియు వింగ్ మిర్రర్‌లతో పాటుగా అనేక ఇతర ఫీచర్లను ఇందులో ఆశించవచ్చు.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

సేఫ్టీ విషయానికి వస్తే, కొత్త 2021 మారుతి సెలెరియో కారులో స్టాండర్డ్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు (డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కోసం), ఈబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్) తో కూడిన ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), పవర్ వింగ్ మిర్రర్స్ మొదలైనవి ఉండనున్నాయి. ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే మారుతి సుజుకి ఇండియా (MSI) కూడా సెమీకండక్టర్ చిప్స్ కొరతను ఎదుర్కుంటోంది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

ఈ కారణంగానే, నెక్స్ట్ జనరేషన్ 2021 సెలెరియో హ్యాచ్‌బ్యాక్ విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే, కంపెనీ ఎట్టకేలకు ఈ కారును నవంబర్ 10న ఆవిష్కరించనుంది. దేశంలోనే అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా గడచిన సెప్టెంబర్‌ 2021 నెల అమ్మకాలలో 43 శాతం క్షీణతను చవిచూసింది. గత నెలలో కంపెనీ మొత్తం 86,380 యూనిట్లను విక్రయించింది.

సరికొత్త ఇంజన్ మరియు మెరుగైన మైలేజ్‌తో రానున్న కొత్త 2021 Maruti Celerio!

మారుతి సుజుకి అందిస్తున్న చిన్న కార్లు అయిన ఆల్టో, బాలెనో, స్విఫ్ట్, వ్యాగన్-ఆర్ మరియు ఎస్-ప్రెసో మైక్రో క్రాస్ఓవర్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు అమ్మకాలలో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. రాబోయే పండుగ సీజన్ నాటికి కొత్త 2021 మారుతి సుజుకి సెలెరియో కారుని మార్కెట్ లో ప్రవేశపెట్టడం ద్వారా కంపెనీ తన మార్కెట్ వాటాను తిరిగి పొందాలని చూస్తోంది.

Most Read Articles

English summary
Next gen maruti suzuki celerio to offer dualjet engine and class leading mileage details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X