కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

భారత మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి సుజుకి కంపెనీ యొక్క మారుతి స్విఫ్ట్ 2016 లో ప్రవేశపెట్టబడింది. అయితే దీనిని 2017 ప్రారంభంలో మారుతి సుజుకి భారతదేశంలో ప్రారంభించింది. జపాన్ వాహన తయారీ సంస్థ సుజుకి ఇప్పుడు తన కొత్త జనరేషన్ హ్యాచ్‌బ్యాక్‌ను డెవలప్ చేస్తోంది.

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి స్విఫ్ట్ గత 15 సంవత్సరాలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటిగా నిలిచింది. రోజు రోజుకి ఎన్నెన్ని కొత్త కార్లు వచ్చినప్పటికీ మార్కెట్లో సుజుకి స్విఫ్ట్ కారుకున్న ఆదరణ మాత్రం తగ్గలేదు. కావున సుజుకి స్విఫ్ట్ దేశీయ మార్కెట్లో రికార్డు స్థాయిలో అమ్ముడవుతోంది.

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

మారుతి సుజుకి కంపెనీ ఇప్పుడు న్యూ జనరేషన్ మోడల్‌ను ప్రవేశపెట్టే పనిలో ఉన్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఇందులో భాగంగానే న్యూ జనరేషన్ సుజుకి స్విఫ్ట్ హార్టెక్ట్ ప్లాట్‌ఫామ్ కింద తయారు చేయబడింది. ఈ న్యూ జనరేషన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మొత్తం మంచి అప్డేటెడ్ ఫీచర్స్ మరియు సేఫ్టీ ఫీచర్స్ కలిగి ఉంటుంది.

MOST READ:హోండా షైన్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా..

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

ఈ కొత్త మోడల్ పూర్తి హైబ్రిడ్ సిస్టంతో విడుదల అవుతుంది. కొత్త స్విఫ్ట్ మైల్డ్-హైబ్రిడ్ భారతదేశం మరియు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో లభించే అవకాశం ఉంది. కొత్త మోడల్ ప్రస్తుత 12 వోల్ట్‌లకు బదులుగా 48 వోల్ట్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంటుంది.

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

టార్క్-ఫిల్ కంట్రోల్ మరియు ఎలక్ట్రిక్ మోటార్ ఐడ్లింగ్ వంటి కొత్త ఫీచర్లు కూడా ఈ న్యూ జనరేషన్ లో అందుబాటులో ఉంటుంది. కొత్త జనరేషన్ స్విఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించబడిన తర్వాత భారత మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. కానీ మార్కెట్లో ఈ కారు యొక్క ధర ప్రస్తుత మోడల్ కంటే ఖరీదైనదిగా ఉంటుంది.

MOST READ:పేద ప్రజలకు అండగా భువనం ఫౌండేషన్ ముందడుగు

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

న్యూ జనరేషన్ సుజుకి స్విఫ్ట్‌కు ఫుల్ హైబ్రిడ్ వేరియంట్ గా లభిస్తుందా లేదా మైల్డ్-హైబ్రిడ్ వేరియంట్ గా లభిస్తుందా అనేది ఇంకా ఖచ్చితంగా తెలియదు. అయితే కంపెనీ నివేదికల ప్రకారం, కొత్త జనరేషన్ స్విఫ్ట్ కొత్త డిజైన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంటుంది.

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారును విడుదల చేయడానికి సుజుకి సన్నద్ధమవుతోంది. జపనీస్ ఆటోమోటివ్ మ్యాగజైన్ బెస్ట్ కార్ న్యూ జనరేషన్ స్విఫ్ట్ కారు యొక్క 3 డి రెండరింగ్ చిత్రాన్ని వెల్లడించింది. 3 డి రెండరింగ్ చిత్రంలో, న్యూ జనరేషన్ స్విఫ్ట్ చాలా పెద్ద ఎయిర్ డ్యామ్, బ్లాక్ చేయబడిన ఫాగ్ లాంప్ మరియు ముందు భాగంలో సన్నని ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్‌ను కలిగి ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో షార్ప్ లైన్స్ కూడా ఉన్నాయి.

MOST READ:వావ్.. అమేజింగ్ ట్యాలెంట్.. వీడియో చూస్తే హవాక్కవ్వాల్సిందే

కొత్త టెక్నాలజీలతో రానున్న న్యూ జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్

భారతదేశంలో స్విఫ్ట్ కారుకు అధిక డిమాండ్ ఉన్నందున, కొత్త జనరేషన్ స్విఫ్ట్ కారు జపాన్‌లో లాంచ్ అయిన వెంటనే భారతదేశంలో విడుదలవుతుంది. కొత్త తరం స్విఫ్ట్ వెర్షన్ వచ్చే ఏడాది భారతదేశంలో లాంచ్ అవుతుందని మేము భావిస్తున్నారు. ఏది ఏమైనా ఈ స్విఫ్ట్ కి మంచి ఉన్న ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది, కావున ఇది భారీ అమ్మకాలను సాగిస్తుందని ఆశించవచ్చు.

Most Read Articles

English summary
Next-gen Suzuki Swift To Launch In 2022. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X