స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

కొరియన్ కార్ బ్రాండ్ కియా మోటార్స్ తమ నెక్స్ట్ జనరేషన్ బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) 'ఈవీ6'ను ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కరించింది. కియా ఈవీ6 ఈ బ్రాండ్ నుండి వస్తున్న మొట్టమొదటి డెడికేటెడ్ బిఈవీ. ఇది పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్‌పై తయారు కానుంది.

స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

ఈ ప్లాట్‌ఫామ్‌ను ఇ-జిఎమ్‌పి (ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్) అని పిలుస్తారు. కియా మాతృ సంస్థ అయిన హ్యుందాయ్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రత్యేకంగా కేవలం ఎలక్ట్రిక్ కార్లను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేసింది. హ్యుందాయ్ కూడా ఈ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన మొట్టమొదటి కార్ అయానిక్ 5ను ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసినదే.

స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

హ్యుందాయ్ అయానిక్ 5 మరియు కియా ఈవీ6 ఈ రెండు మోడళ్ల డిజైన్ లాంగ్వేజ్ మరియు ఫీచర్ అండ్ పవర్‌ట్రైన్ డీటేల్స్ ఇంచు మించు ఒకేలా ఉండొచ్చని సమాచారం. కియా మోటార్స్ ఇప్పటికే తమ గ్లోబల్ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోలో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలను కలిగి ఉన్నప్పటికీ, ఈ కొత్త కియా ఈవీ6 మాత్రం పూర్తిగా సరికొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా తయారు కాబోతోంది.

MOST READ:పిల్లలు చేసిన తప్పుకు తల్లిదండ్రులకు రూ. 1 లక్ష జరిమానా.. ఆ తప్పేమిటో తెలుసా?

స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

అంతేకాకుండా, కియా మోటార్స్ ఇకపై భవిష్యత్తులో తాము తయారు చేయబోయే అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను ఇదే బీఈవీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందించనుంది. కియా ఈవీ6 క్రాస్ఓవర్ లాంటి డిజైన్‌ను కలిగి ఉంటుంది. దీని డిజైన్ కూడా చాలా సింపుల్‌గా మరియు అంతే స్టైలిష్‌గా కనిపిస్తుంది.

ముందు వైపు సన్నటి గ్రిల్ మరియు ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్స్‌తో కూడిన హెడ్‌ల్యాంప్స్, బోనెట్‌పై మజిక్యులర్ బాడీ లైన్స్, ఆల్ బ్లాక్ పిల్లర్స్, టర్న్ ఇండికేటర్లతో కూడిన బ్లాక్ కలర్ సైడ్ మిర్రర్స్, కారు, చుట్టూ సన్నటి బ్లాక్ ప్లాస్టిక్ క్లాడింగ్, పాప్ అప్ డోర్ హ్యండిల్స్, హుడ్‌పై కొత్త కియా బ్యాడ్జ్ వంటి డిజైన్ ఫీచర్లను ఇందులో చూడొచ్చు.

స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

అలాగే, ఇందులో స్టైలిష్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్, కూప్ మోడల్ స్టైల్ రూఫ్, వెనుక భాగంలో స్పాయిలర్, షార్క్ ఫిన్ యాంటెన్నా, రైజ్డ్ బూట్ డిజైన్ లిప్, బూట్ పొడవునా ఉండే పెద్ద టెయిల్ ల్యాంప్, సైడ్ బాడీ ప్యానెల్స్ మరియు రియర్ బంపర్‌పై సిల్వర్ గార్నిష్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంటీరియర్ డిజైన్‌ను గమనిస్తే, కియా ఈవీ6 కారులోని క్యాబిన్ లేఅవుట్ చాలా సింపుల్‌గా మరియు క్లీన్‌గా అనిపిస్తుంది. ఇందులోని ఇంటీరియర్ థీమ్ డ్యూయెల్ టోన్‌లో డిజైన్ చేయబడి ఉంటుంది. ఈ థీమ్‌కు తగినట్లుగానే స్టీరింగ్ వీల్‌ని కూడా డ్యూయెల్ టోన్‌లో ఫినిష్ చేయబడి ఉంటుంది.

MOST READ:చెక్కతో బుల్లెట్ మోటార్‌సైకిల్ తయారు చేసిన కేరళైట్; వావ్ అంటున్న నెటిజెన్స్!

స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

ఈ కారు లోపల రెండు పెద్ద డిజిటల్ డిస్‌ప్లే స్క్రీన్‌లు ఉంటాయి. ఇందులో ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం మరొకటి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం ఉపయోగించబడుతాయి. ఇంకా ఇందులో పూర్తి ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇంజన్ పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్, ఎలక్ట్రిల్లీ అడ్జస్టబల్ ఫ్రంట్ సీట్స్, గుండ్రటి డయల్‌తో కూడిన గేర్ సెలక్టర్, ప్రీమియం ఆడియో సిస్టమ్ మరియు విశాలమైన లగేజ్ రూమ్ వంటి ఫీచర్లతో ఈ కియా ఈవీ6 కారును రూపొందించారు. మరికొద్ది నెలల్లోనే ఈ కారు అమ్మకాలు అధికారికంగా ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

స్టన్నింగ్ డిజైన్‌తో వస్తున్న కియా ఈవీ6 ఎలక్ట్రిక్ కార్: ఫొటోలు

ఇక ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ విషయానికి వస్తే, హ్యుందాయ్ అయానిక్-5 కారులో ఉపయోగించిన 300 బిహెచ్‌పి పవర్ మరియు 600 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్‌నే ఈ కొత్త కియా ఈవీ6లో కూడా ఉపయోగించవచ్చని సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ని గమనిస్తూ ఉండండి.

MOST READ:రోడ్డుపై యాక్టివా స్కూటర్‌పై ఉన్న యువతి చేసిన పనికి చిర్రెత్తిన కెటిఎమ్ బైక్ రైడర్‌

Most Read Articles

English summary
Next Generation Kia EV6 Battery Electric Vehicle Unveiled, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X