చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

నిస్సాన్ ఇండియా గడచిన నెలలో భారత మార్కెట్లో విడుదల చేసిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మాగ్నైట్' ఏషియన్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. విషయాన్ని స్వయంగా ఏషియన ఎన్‌క్యాప్ (ASEAN NCAP) ధృవీకరించింది.

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

ఏషియన్ ఎన్‌క్యాప్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో మొత్తం స్కోరు ఆధారంగా, కొత్త నిస్సాన్ మాగ్నైట్ అసెస్‌మెంట్‌లో 4-స్టార్ ఏషియన్ ఎన్‌క్యాప్ రేటింగ్‌ను విజయవంతంగా పొందినట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. ఫలితాల వివరాలు త్వరలోనే విడుదల చేయబడతాయి.” అని పేర్కొన్నారు.

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

నిస్సాన్ ఇండియా డిసెంబర్ 2, 2020 తేదీన తమ సరికొత్త మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీని భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఇది ఎక్స్‌ఈ, ఎక్స్‌ఎల్, ఎక్స్‌వి మరియు ఎక్స్‌వి ప్రీమియం అనే నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. గత నెల వరకూ ఇది రూ.4.99 లక్షల, (ఎక్స్-షోరూమ్, ఢల్లీ) ప్రత్యేక పరిచయ ప్రారంభ ధరతో లభ్యమయ్యేది.

MOST READ:న్యూ ఇయర్‌లో భారీగా తగ్గిపోయిన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు.. అసలు కారణం ఇదే..

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

కాగా, జనవరి 2021 నుండి మాగ్నైట్ ధరలు పెరగనున్నాయి. ధరల పెంపు తర్వాత దీని ప్రారంభ ధర రూ.5.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.9.35 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీని ప్రారంభ ధర పెరిగినప్పటికీ, రూ.5.35 లక్షల ప్రైస్ ట్యాగ్‌తో ఇది భారత మార్కెట్లోనే అత్యంత సరసమైన సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీగా కొనసాగుతోంది.

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

నిస్సాన్ మాగ్నైట్ రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులోని 1.0-లీటర్ న్యాచురల్లీ ఆస్పైర్డ్ పెట్రోల్ ఇంజన్ 72 బిహెచ్‌పి పవర్‌ను మరియు 96 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో లభిస్తుంది. ఇందులో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఉండదు. ఇది లీటరుకు 18.75 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్‌ను ఆఫర్ చేస్తుంది.

MOST READ:ఎలక్ట్రిక్ వెర్షన్‌లో రావడానికి సిద్దమవుతున్న టాటా నానో : వివరాలు

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

ఇకపోతే, రెండవ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ అయిన 1.0-లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజన్ గరిష్టంగా 99 బిహెచ్‌పి పవర్‌ను మరియు 160 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్వుల్ మరియు సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తుంది. దీని మ్యాన్యువల్ గేర్‌బాక్స్ వెర్షన్ లీటరుకు 20 కిలోమీటర్లు మరియు ఆటోమేటిక్ వెర్షన్ లీటరుకు 17.7 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

ఇదిలా ఉంటే, నిస్సాన్ మాగ్నైట్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కోసం బుకింగ్స్ భారీగా వస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. మోడల్ కోసం ఇప్పటికే 20,000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చాయని కంపెనీ తెలిపింది. అధిక బుకింగ్స్ కారణంగా దాని వెయిటింగ్ పీరియడ్ కూడా గణనీయంగా పెరిగింది. ఇప్పుడు దీని వెయిటింగ్ పీరియడ్ 32 వారాల (8 నెలల) వరకూ ఉంటోంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్ మరియు కలర్ ఆప్షన్‌ను బట్టి వెయిటింగ్ పీరియడ్ మారుతూ ఉంటుంది.

MOST READ:పెరిగిన హ్యుందాయ్ కార్ల ధరలు, ఇదే కొత్త ధరల జాబితా!

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

నిస్సాన్ మాగ్నైట్ విభాగంలోనే అనేక బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు పరికరాలను కలిగి ఉంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్-ఆకారపు ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌లు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 16 ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ మిర్రర్స్ మరియు వాటి ఇంటిగ్రేటెడ్ టర్న్ ఇండికేటర్లు ఉంటాయి. పెద్ద వీల్ ఆర్చెస్‌తో ఇది రగ్గడ్ లుక్‌ని కలిగి ఉంటుంది.

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో పూర్తి-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆపిల్ కార్‌ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 8 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, క్లైమేట్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, ట్రాక్షన్ కంట్రోల్స్, రియర్ ఎసి వెంట్స్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి.

MOST READ:గుడ్ న్యూస్.. ఫాస్ట్‌ట్యాగ్ గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడో ఇక్కడ చూడండి

చిన్న కారే కానీ, సురక్షితమైన కారు: క్రాష్ టెస్టులో మాగ్నైట్‌కు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్!

ఏషియన్ ఎన్‌క్యాప్ క్రాష్ టెస్టులో నిస్సాన్ మాగ్నైట్ 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకోవటంతో, ఇప్పటికే అభిమానుల్లో మోడల్‌పై ఉన్న ఆసక్తి మరింత పెరిగే అవకాశం ఉంది మరియు ఇది కొత్త వినియోగదారులను ఆకర్షించనుంది. ఇటీవలి కాలంలో భారతీయ వినియోగదారులు కూడా సురక్షితమైన కార్లను ఎంచుకోవడంపై దృష్టి సారించారు. నేపథ్యంలో, మాగ్నైట్ సాధించిన 4-స్టార్ సేఫ్టీ రేటింగ్, దాని అమ్మకాలకు మరింత బలం చేకూర్చనుంది.

Most Read Articles

English summary
Nissan Magnite Scores 4-Star Safety Rating In ASEAN NCAP Crash Test. Read In Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X