అయిపోయింది.. అంతా అయిపోయింది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

భారతదేశం చరిత్రలో మొట్టమొదటి సారిగా పాత వాహనాలను చెత్తగా విసిరేసే విధానం (వెహికల్ స్క్రాపేజ్ పాలసీ) తెరపైకి వచ్చిన సంగతి తెలిసినదే. ఈ మేరకు నేడు (గురువారం మార్చి 18, 2021) కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లోక్‌సభలో ప్రతిపాదిత వెహికల్ స్క్రాపేజ్ పాలసీ యొక్క విధివిధానాలను సమర్పించారు.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

పర్యావరణానికి మరియు ప్రజలు హాని కలిగించే పాత వాహనాలను రోడ్లపై తిరగకుండా చేసేందుకు తద్వారా రహదారుల భద్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీని పరిచయం చేసింది. దీని వలన పాత వాహనాల వినియోగం తగ్గి భద్రత పెరగటమే కాకుండా, కొత్త వాహనాల వినియోగం కూడా అధికమవుతుంది.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

ఫలితంగా, దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందేందుకు కూడా ఇది సహకరిస్తుంది. వెహికల్ స్క్రాపేజ్ విధానం మరికొద్ది నెలల్లోనే పూర్తిస్థాయిలో అమలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో, నితిన్ గడ్కరీ ఈ పాలసీకి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడి చేశారు.

MOST READ:ఔరా.. ఇదేమి సిత్రం.. ట్రక్ డ్రైవర్‌కి హెల్మెట్ లేదని ఫైన్.. ఎక్కడో తెలుసా

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

1. వెహికల్ స్క్రాపేజ్ పాలసీ ప్రకారం, ప్రస్తుతం రహదారిపై నడుస్తున్న ఏదైనా వాహనం యొక్క రిజిస్ట్రేషన్ ముగిసినట్లయితే, దానికి తప్పనిసరిగా తిరిగి ఫిట్నెస్ పరీక్షను నిర్వహించిన తర్వాతనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫిట్నెస్ పరీక్షలో సదరు వాహనం విఫలమైతే, దానిని ఇక రోడ్లపై తిప్పడానికి అనుమతి ఉండదు.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

2. 15 ఏళ్లు దాటిన వాణిజ్య వాహనాలు మరియు 20 ఏళ్లు దాటిన ప్రైవేట్ వాహనాలు ఈ వెహికల్ స్క్రాపేజ్ పాలసీకి వర్తిస్తాయి. ఇలాంటి వాహనాలను ఉపయోగించే యజమానులు తప్పనిసరిగా, దాని వయస్సు నిండిన తర్వాత ఫిట్‌నెస్ మరియు రిజిస్ట్రేషన్లను రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది.

MOST READ:ఏప్రిల్ 7 న భారత మార్కెట్లో విడుదల కానున్న 'సిట్రోయెన్ సి 5 ఎయిర్‌క్రాస్' ; పూర్తి వివరాలు

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

3. పైన పేర్కొన్నట్లుగా, ఈ పాలసీలో నిర్దేశించిన కాలపరిమితి ప్రకారం ఏదైనా వాహనం యొక్క వయస్సు నిండి రిజిస్ట్రేషన్ రెన్యువల్ సమయంలో కానీ లేదా ఫిట్‌నెస్ పరీక్షలో కానీ సదరు వాహనం విఫలమైనట్లయితే, అది ఆ వాహనం యొక్క జీవితపు ముగింపుగా పరిగణించబడుతుంది మరియు దానిని స్క్రాప్ చేయటం జరుగుతుంది.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

4. ఈ విధానం ప్రకారం, పాత వాహనాల ఫిట్‌నెస్ టెస్ట్ మరియు రిజిస్ట్రేషన్ రెన్యువల్స్‌కి బదులుగా సదరు వాహనాలను స్క్రాప్ చేయటానికి ప్రేరేపించేలా సంబంధిత వాహన యజమానులను ప్రోత్సహిస్తారు.

MOST READ:2021 ఫిబ్రవరిలో అమ్ముడైన టాప్ 10 డీజిల్ కార్స్; వాటి వివరాలు

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

5. అదనంగా, ప్రజలు తమ పాత వాహనాలను నడపకుండా నిరోధించడానికి, ప్రభుత్వం పాత వాహనాల రీ-రిజిస్ట్రేషన్ ఫీజును కూడా పెంచుతుంది. అధిక రెన్యువల్ ఫీజులు మరియు అదనపు టాక్సుల నేపథ్యంలో ప్రజలు తమ పాత వాహనాలను ఉపయోగించడం తగ్గిస్తారనేది ప్రభుత్వం యోచన.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

6. వీటితో పాటు, వెహికల్ స్క్రాపింగ్ విధానాన్ని సులభతరం చేయడానికి దేశవ్యాప్తంగా ఆటోమేటిక్ ఫిట్‌నెస్ కేంద్రాలను ఏర్పాటు చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది.

MOST READ:చూస్తే ఒక్కసారైనా రైడ్ చేయాలనిపించే మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

అంతే కాకుండా, పాత వాహనాల యజమానులు తమ వాహనాలను స్క్రాప్ చేసేందుకు ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఇందకు గాను ప్రజలకు వివిధ రకాల ప్రోత్సాహకాలను ప్రయోజనాలను అందించనున్నారు.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

1. వాహన యజమానులు అధికారికంగా తమ పాత వాహనాన్ని స్క్రాప్ చేయటానికి సిద్ధమైనట్లయితే, వారు కొత్తగా కొనుగోలు చేయబోయే వాహనంపై 4 నుండి 6 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంటుంది.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

2. అంతే కాకుండా, ఈ విధానం ద్వారా పాత వాహనాలను స్క్రాప్ చేసిన కస్టమర్లకు, తమ కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం 25 శాతం వరకు రోడ్డు పన్నులో మినహాయింపు ఇస్తుంది.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

3. వీటికి అదనంగా, వాహన తయారీదారులు కూడా ప్రజలు సమర్పించే స్క్రాపింగ్ సర్టిఫికెట్‌కు బదులుగా కొత్త వాహనాలపై 5 శాతం తగ్గింపును వినియోగదారులకు అందించాలని ఈ నివేదికలో సూచించారు.

అయిపోయింది.. అంతా అయిపోంది.. ఇక పాత వాహనాలు చెత్త క్రిందకే..

కొంతకాలం క్రితం, ఫెడరల్ పాలసీ థింక్-ట్యాంక్ నీతి ఆయోగ్, కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేయబోయే వాహన స్క్రాప్ విధానం గురించి ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసినదే. కేంద్రం ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల వాహన యజమానులకు ఆర్థిక నష్టాలు ఎదురవుతాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. మరి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Most Read Articles

English summary
Nitin Gadkari Announces Vehicle Scrappage Policy Today: Pros And Cons Of This Policy. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X