కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

భారతదేశంలో కార్ల సేఫ్టీ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. ఐదారేళ్ల క్రితం వరకూ కార్లలో ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి ఫీచర్లు ఆప్షనల్‌గా మాత్రమే లభించేవి. ఎక్కువ ధర చెల్లించే టాప్ వేరియంట్లలో మాత్రమే ఇలాంటి సేఫ్టీ ఫీచర్స్ ఉండేవి.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

అయితే, దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని, ప్రజల సంరక్షణార్థం గతంలో అన్ని కార్లలో ఏబిఎస్ మరియు డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ను తప్పనిసరి చేశారు. కాగా, ఇటీవలే కార్లలో డ్రైవర్ మరియు కో-ప్యాసింజర్ కోసం ముందు వైపు రెండు ఎయిర్‌బ్యాగ్‌లు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కార్ కంపెనీలకు సూచనలు జారీ చేసింది.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

తాజాగా, ఇప్పుడు కార్లలోని అన్ని వేరియంట్లు మరియు విభాగాలలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఏర్పాటు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ కంపెనీలకు విజ్ఞప్తి చేశారు. ఇది రోడ్డు ప్రమాదాలలో మరణాల రేటును సమర్థవంతంగా తగ్గించగలదని ఆయన అన్నారు.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

కారులో కనీసం 6 ఎయిర్‌బ్యాగులు ఉండాలి

న్యూఢిల్లీలో సియామ్ (సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారుల) సీఈఓల ప్రతినిధి బృందంతో నితిన్ గడ్కరీ సమావేశమయ్యారు. రోడ్డు ప్రమాదాలలో ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాహనాలలో కనీసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయాలని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీ ఆటోమొబైల్ తయారీదారులకు సూచించారు. నితిన్ గడ్కరీ ఆటో పరిశ్రమ అమ్మకాలు మరియు పనితీరును కూడా పరిశీలించారు.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

రెండు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి

ఏప్రిల్ 1, 2021వ తేదీ నుండి, కార్ల కంపెనీలు దేశీయ మార్కెట్లో విక్రయించే అన్ని కొత్త కార్లలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు (ఒకటి డ్రైవర్ కోసం మరొకటి ఫ్రంట్ ప్యాసింజర్ కోసం) తప్పనిసరిగా ఉండాలని కేంద్రం నిర్ణయించింది. ఇప్పటికే ఒక ఎయిర్‌బ్యాగ్ ఉన్న పాత కార్లలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి గడువు డిసెంబర్ 31, 2021 వరకు పొడిగించబడింది.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

ఫ్రంట్ సీట్ ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్‌ల అవసరం సుప్రీంకోర్టు కమిటీ సిఫార్సుల ఆధారంగా ఉంటుంది. ఇది భారతీయ రోడ్లపై వాహనాలకు ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్‌గా విడుదల చేయబడింది. రోడ్డు ప్రమాద సమయంలో ప్రయాణికుల భద్రతకు ఎయిర్‌బ్యాగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇవి ప్రమాద తీవ్రతను తగ్గించడంలో సహకరిస్తాయి. ప్రభుత్వ ఆదేశామ ప్రకారం, కార్లలో సీట్‌బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి అనేక సేఫ్టీ ఫీచర్లను కంపెనీలు తప్పనిసరి చేయబడ్డాయి.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

మరో ఏడాదిలో ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్ పరిచయం

పూర్తిగా 100 శాతం ఇథనాల్ లేదా 100 శాతం పెట్రోల్‌తో నడిచే ఫ్లెక్స్ ఫ్యూయెల్ వెహికల్స్ (ఎఫ్‌ఎఫ్‌వి)ను మరో ఏడాది లోపుగా తీసుకురావాలని ఆటో పరిశ్రమను కేంద్ర మంత్రి కోరారు. తాజా నివేదిక ప్రకారం, బిఎస్ 6 ఉద్గార నిబంధనల అమలు కోసం మరో ఏడాది గడువు కావాలని సియామ్ డిమాండ్ చేసింది. అయితే, ఈ సమావేశంలో బిఎస్6 నిబంధనలను వాయిదా వేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

త్వరలోనే కొత్త గైడ్ లైన్స్

ఫ్లెక్స్ ఫ్యూయెల్ ఇంజన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం త్వరలో కొత్త మార్గదర్శకాలను ప్రకటించే అవకాశం ఉంది. మీడియా నివేదికల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడానికి మరియు వాణిజ్య మరియు ప్రైవేట్ వాహనాలలో ఇథనాల్ వినియోగాన్ని పెంచడానికి అక్టోబర్ నాటికి కొత్త నిబంధనలను తీసుకురావచ్చని తెలుస్తోంది.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

ప్రస్తుతం, పెట్రోల్‌లో 10 శాతం ఇథనాల్ బ్లెండింగ్ అనుమతించబడింది, కాగా, 2023 నాటికి దీనిని 20 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం, ఇథనాల్ బ్లెండెడ్ ఫ్యూయల్స్ కేవలం 15 రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇతర రాష్ట్రాల్లో బయో ఇంధన వినియోగం కేవలం 5 శాతం కంటే తక్కువగా ఉంది.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1.5 లక్షల మంది మరణిస్తున్నారు

కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా ప్రకారం, భారతదేశంలో రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రతిరోజూ సుమారు 400 మందికి పైగా మరణిస్తున్నారు. భారతదేశంలో ఏటా ఐదు లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. నితిన్ గడ్కరీ ఈ రికార్డును గత ఏడేళ్లలో తన మంత్రిత్వ శాఖ చేసిన అతిపెద్ద వైఫల్యంగా అభివర్ణించారు.

కార్లలో ఒకటి కాదు, రెండు కాదు మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండాలి: నితిన్ గడ్కరీ

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, వచ్చే మూడేళ్లలో భారతదేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. రహదారుల నాణ్యతను మరియు భద్రతా చర్యలను మెరుగుపరచడం ద్వారా 2024 నాటికి ముందు రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Most Read Articles

English summary
Nitin gadkari asks carmakers to install atleast 6 airbags in passenger cars
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X