నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

గత నవంబర్ 2021 నెలలో భారతదేశంలో అమ్ముడైన వాహనాల గణాంకాలు వెల్లడయ్యాయి. గత నెలలో వాహనాల ఎగుమతులలో పెరుగుదల ఉన్నప్పటికీ, ఇతర విభాగాలకు చెందిన వాహనాల అమ్మకాలు మాత్రం క్షీణతను నమోదు చేశాయి. నవంబర్ 2021 నెలలో ప్యాసింజర్ వాహనాల విభాగంలో 2,15,626 యూనిట్లు, త్రీ వీలర్ విభాగంలో 22,471 యూనిట్లు, ద్విచక్ర వాహన విభాగంలో 10,50,616 యూనిట్లు అమ్ముడయ్యాయి. మొత్తంగా గత నెలలో వాహనాల విక్రయాలు 12,88,759 యూనిట్లుగా ఉన్నాయి.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు

దేశీయ మార్కెట్లో ప్యాసింజర్ వాహనాల విక్రయాలను గమనిస్తే, నవంబర్ 2021 నెలలో మొత్తం 2,15,626 యూనిట్లు విక్రయించబడ్డాయి. గతేడాది ఇదే సమయం (నవంబర్ 2020)తో పోలిస్తే, దేశీయ ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 2,64,898 యూనిట్లుగా ఉన్నాయి. ఎగుమతుల పరంగా చూస్తే, నవంబర్‌ 2021లో ఇవి 44,265 యూనిట్లుగా ఉంటే, నవంబర్ 2020లో ఇవి 38,300 యూనిట్లుగా ఉన్నాయి. వాహనాల ఉత్పత్తి విషయానికి వస్తే గత నెలలో ఆటోమొబైల్ కంపెనీలు మొత్తం 2,66,552 యూనిట్ల వాహనాలు ఉత్పత్తి చేయగా, నవంబర్ 2020లో 2,94,596 యూనిట్లను ఉత్పత్తి చేశాయి.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

సెమీకండక్టర్ చిప్ షార్టేజ్ కారణంగా, ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. ఈ విభాగంలో దేశీయ విపణిలో 1,00,906 యూనిట్ల ప్యాసింజర్ కార్లు, 1,05,091 యూనిట్ల ఎస్‌యూవీలు మరియు 9,629 యూనిట్ల వ్యాన్‌లు విక్రయించబడ్డాయి. పండుగ సీజన్‌లో ప్రవేశపెట్టిన కొత్త మోడళ్ల నుండి ఈ విభాగం ప్రయోజనం పొందింది, దీని కారణంగా బుకింగ్‌లు మెరుగ్గా ఉన్నాయి, అయితే ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత కారణంగా, కంపెనీలు సకాలంలో వాహనాలను కస్టమర్లకు డెలివరీ చేయలేకపోయాయి.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

మూడు చక్రాల వాహనాల అమ్మకాలు

దేశీయంగా త్రిచక్ర వాహనాల అమ్మకాల విషయానికి వస్తే, నవంబర్ 2021 నెలలో మొత్తం 22,471 యూనిట్లు అమ్ముడయ్యాయి, ఇది గతేడాది ఇదే సమయంలో విక్రయించిన 24,071 యూనిట్ల కంటే తక్కువ. మరోవైపు, ఎగుమతుల విషయానికి వస్తే, నవంబర్ 2021 నెలలో 42,431 యూనిట్ల త్రిచక్ర వాహనాలను విదేశాలకు ఎగుమతి చేయగా, గతేడాది ఇదే నెలలో 37,279 యూనిట్లను ఎగుమతి చేశారు. గత నవంబర్‌లో మొత్తం 61,451 యూనిట్ల త్రిచక్ర వాహనాలు ఉత్పత్తి చేయగా, నవంబర్ 2020లో 65,460 యూనిట్లను ఉత్పత్తి చేశారు.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ విభాగం తీవ్రంగా ప్రభావితమైంది మరియు అమ్మకాలు కూడా 50 శాతం తగ్గాయి. ఈ విభాగం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది, ప్రస్తుతం త్రిచక్ర వాహనాల వ్యాపారం సజావుగానే సాగుతోంది. ఫలితంగా, ఇటీవలి కాలంలో ఈ విభాగంలో అమ్మకాలు స్వల్పంగా మెరుగుపడ్డాయి. ఇది ఇప్పటికీ ప్రీ-కోవిడ్ స్థాయికి చేరుకోలేకపోయినప్పటికీ, పరిస్థితి చాలా వరకు మెరుగుపడిందని చెప్పవచ్చు.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

టూ వీలర్ అమ్మకాలు

దేశంలో ఎప్పటి మాదిరిగానే ద్విచక్ర వాహనాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గత నెలలో దేశీయ మార్కెట్లో మొత్తం 10,50,616 యూనిట్లు విక్రయించబడ్డాయి. కాగా, గతేడాది ఇదే సమయంలో మొత్తం దేశీయ ద్విచక్ర వాహనాల అమ్మకాలు 16,00,379 యూనిట్లుగా ఉన్నాయి. అప్పటితో పోల్చుకుంటే, గత నెల అమ్మకాలు క్షీణించాయి. ఎగుమతుల పరంగా, చూస్తే, నవంబర్ నెలలో మొత్తం 3,56,659 యూనిట్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. గతేడాది నవంబర్‌లో ఇవి 3,25,736 యూనిట్లుగా ఉన్నాయి. నవంబర్‌ 2021లో మొత్తం 13,67,701 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేయగా, నవంబర్ 2020లో 19,36,793 యూనిట్లను ఉత్పత్తి చేశారు.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

క్వాడ్రిసైకిల్ వాహనాల విక్రయాలు

క్వాడ్రిసైకిల్ వాహనాల విభాగంలో దేశీయ అమ్మకాలను చూస్తే, గడచిన నవంబర్ 2021 నెలలో మొత్తం 46 యూనిట్లు విక్రయించబడ్డాయి. మరోవైపు, ఎగుమతుల పరంగా, చూస్తే గత నవంబర్ నెలలో మొత్తం 294 యూనిట్లు భారతదేశం నుండి ఎగుమతి చేయబడ్డాయి. ఇవి గతేడాది నవంబర్‌లో విక్రయించిన 228 యూనిట్లతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. నవంబర్‌ 2021లో మొత్తం 308 యూనిట్ల క్వాడ్రిసైకిల్స్ ఉత్పత్తి చేయగా, నవంబర్ 2020లో 330 యూనిట్లను ఉత్పత్తి చేశారు.

నవంబర్ 2021లో వివిధ రకాల వాహనాల సేల్స్ ట్రెండ్ ఎలా ఉందంటే..?

అన్ని విభాగాలలోని వాహనాల దేశీయ విక్రయాలను పరిశీలిస్తే, నవంబర్ 2021 నెలలో మొత్తం 12,88,759 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఇది గత సంవత్సరం విక్రయించిన 18,89,348 యూనిట్లతో పోలిస్తే భారీ తగ్గుదలను నమోదు చేసింది. మరోవైపు, ఎగుమతుల పరంగా చూస్తే, నవంబర్ 2021 నెలలో మొత్తం 4,43,649 యూనిట్లను ఎగుమతి చేయగా, గత ఏడాది నవంబర్‌ 2020లో 4,01,543 యూనిట్లను ఎగుమతి చేశారు. మొత్తంగా చూస్తే, నవంబర్‌ 2021లో మొత్తం 16,96,012 యూనిట్ల వాహనాలు ఉత్పత్తి కాగా, నవంబర్‌ 2020లో 22,97,179 యూనిట్లు ఉత్పత్తి చేయబడ్డాయి.

Most Read Articles

English summary
November 2021 passenger vehicle three wheeler and two wheeler sales report
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X