సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

ప్రముఖ భారత ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్ (Tata Motors) ఇటీవల మార్కెట్లో విడుదల చేసిన సరికొత్త మైక్రో ఎస్‌యూవీ టాటా పంచ్ (Tata Punch) ఇప్పుడు CSD (క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్) లో కూడా లభ్యం కానుంది. భారతదేశ సైన్యంలో పనిచేసే సైనికులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం టాటా మోటార్స్ ఈ చిన్న కారును క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్ లలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో ప్రారంభించబడిన ఈ కారు ఇప్పుడు రక్షణ సేవకులకు సరసమైన ధరకు అందుబాటులో ఉంచబడింది.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

సిఎస్‌డి క్యాంటీన్ లో టాటా మోటార్స్ తమ టాటా పంచ్ మైక్రో ఎస్‌యూవీని రూ. 4.86 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరకే విక్రయిస్తోంది. కాగా, ఇదే కారు సాధారణ వినియోగదారులకు రూ. 5.49 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విక్రయించబడుతోంది. సాధారణంగా, మార్కెట్లో లభించే వస్తువుల ధరతో పోలిస్తే, CSD క్యాంటీన్లలో విక్రయించే వస్తువుల ధరలు చాలా తక్కువగా ఉంటాయి. దేశ రక్షణ కోసం సైనికులు చేసే సేవకు గుర్తింపుగా తయారీదారులు అతి తక్కువ మార్జిన్‌తో ఇంచు మించు తయారీ ఖర్చు వద్ద ఉత్పత్తులను విక్రయిస్తుంటారు.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

ఈ నేపథ్యంలో, టాటా మోటార్స్ కూడా తన కార్లను సిఎస్‌డి క్యాంటీన్‌లో అందుబాటులో ఉంచింది. సిఎస్‌డి లో టాటా పంచ్ కారు ధర సాధారణ టాటా డీలర్‌షిప్‌తో పోలిస్తే సుమారు రూ. 1.05 లక్షల వరకు తక్కువగా ఉంటుంది. డీలర్‌షిప్ లలో టాటా పంచ్ ధరలు రూ. 5.49 లక్షల నుండి రూ. 9.09 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి. దేశీయ విపణిలో ఈ కారు మొత్తం 4 ట్రిమ్ లు మరియు 7 వేరియంట్లలో అందుబాటులో ఉంది. కాగా CSD స్టోర్‌లో దీని టాప్ వేరియంట్ ధర రూ. 8,05,733 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

టాటా పంచ్ ఎస్‌యూవీ ఈ సెగ్మెంట్లో సరసమైన ధర కలిగి ఉన్నప్పటికీ, ఫీచర్ల విషయంలో ఎక్కడా రాజీ పడదు. కంపెనీ ఈ చిన్న కారులో ఆటోమేటిక్ ఇంజన్ స్టార్ట్ / స్టాప్, రెండు డ్రైవ్ మోడ్‌లు (ఎకో మరియు సిటీ), క్రూయిజ్ కంట్రోల్, టైర్ పంక్చర్ రిపేర్ కిట్, బ్రేక్ స్వే కంట్రోల్, 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్, ఐఆర్‌ఏ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, 27 కనెక్టెడ్ ఫీచర్లను అందిస్తోంది.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

సేఫ్టీ విషయంలో టాటా పంచ్ ది బెస్ట్ అనిపించుకుంటుంది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో ఈ కారు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ కారులో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBD తో కూడిన ABS, కెమెరాతో కూడిన రియర్ పార్కింగ్ సెన్సార్స్, కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్ మొదలైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టాటా మోటార్స్ పంచ్ మైక్రో ఎస్‌యూవీని కంపెనీ యొక్క కొత్త ఎజైల్ లైట్ ఫ్లెక్సిబుల్ అడ్వాన్స్‌డ్ (ALFA) ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించింది. ఇది పరిమాణంలో తేలికగా ఉండి చాలా ధృడంగా ఉంటుంది.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

టాటా పంచ్ పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ, విశాలమైన క్యాబిన్ స్థలాన్ని కలిగి ఉంటుంది. ఈ ఎస్‌యూవీ పొడవు 3,827 మిమీ, వెడల్పు 1,742 మిమీ మరియు ఎత్తు 1,615 మిమీ గా ఉంటుంది. దీని వీల్‌బేస్ 2,445 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 187 మిమీ మరియు వాటర్ వేడింగ్ సామర్థ్యం 370 మిమీ గా ఉంటుంది. ఇక ఇంజన్ విషయానికి వస్తే, టాటా పంచ్ ఎస్‌యూవీ ప్రస్తుతం 1.2 లీటర్, త్రీ సిలిండర్, రివోట్రాన్ పెట్రోల్ ఇంజన్ తో మాత్రమే లభిస్తోంది. భవిష్యత్తులో ఇందులో టర్బో పెట్రోల్ ఇంజన్ కూడా రావచ్చని సమాచారం.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

ఈ 1.2 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద 85 బిహెచ్‌పి పవర్ ను మరియు 3,300 ఆర్‌పిఎమ్ వద్ద 113 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎమ్‌టి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. టాటా పంచ్ ఆటోమేటిక్ వేరియంట్‌లలో 'ట్రాక్షన్ ప్రో' అనే డ్రైవింగ్ మోడ్ కూడా లభిస్తుంది. టాటా పంచ్ ప్యూర్ వేరియంట్ మాత్రం కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే లభిస్తుంది. మిగిలిన మూడు వేరియంట్లు (అడ్వెంచర్, ఆకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్‌) మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లతో లభిస్తాయి.

సైనికుల కోసం సరసమైన ధరకే టాటా పంచ్.. ఇప్పుడు క్యాంటీన్ స్టోర్ డిపార్ట్‌మెంట్లో కూడా లభ్యం

చివరిగా పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, టాటా పంచ్ చిన్న కారు కేవలం 6.5 సెకన్లలోనే గంటకు 0 - 60 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, 16.5 సెకన్లలో గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకుంటుంది. ఇక మైలేజ్ వివరాలను గమనిస్తే, టాటా పంచ్ మ్యాన్యువల్ వేరియంట్ లీటరుకు 18.97 కిలోమీటర్ల మైలేజీని మరియు ఆటోమేటిక్ వేరియంట్ లీటరుకు 18.82 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుందని (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్) కంపెనీ పేర్కొంది.

Most Read Articles

English summary
Now you can buy tata punch in csd canteen price slashed upto 1 lakh details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X