Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం Ford (ఫోర్డ్) అందిస్తున్న లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారు మస్టాంగ్ మాక్-ఇ (Ford Mustang Mach-e) జాక్‌పాట్ ఆర్డర్ ను సొంతం చేసుకుంది. అమెరికాలోని న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ (ఎన్‌వైపిడి) మొత్తం 184 ఎలక్ట్రిక్ మస్టాంగ్ మాక్-ఇ స్పోర్ట్స్ కార్ల కోసం ఆర్డర్ ప్లేస్ చేసింది. వీటన్నింటినీ న్యూయార్క్ నగరాన్ని రక్షించే రక్షకభటులు ఉపయోగించనున్నారు. పర్యావరణాన్ని రక్షించే దిశలో భాగంగా అమెరికన్ పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

పోలీస్ కార్లుగా మారిన ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ కార్లను నగరంలో పెట్రోలింగ్ కోసం మరియు నేరస్థులను పట్టుకోవడం కోసం ఉపయోగించనున్నారు. న్యూయార్క్ పోలీస్, షెరీఫ్ కార్యాలయం మరియు పార్క్స్ అండ్ రిక్రియేషన్ డిపార్ట్‌మెంట్ వంటి పలు శాఖలు తాము ఉపయోగించే అధికారిక వాహనాలను విద్యుదీకరించే (ఎలక్ట్రిఫికేషన్) ప్రయత్నంలో భాగంగా వీటిని కొనుగోలు చేశారు. ఎన్‌వైపిడి ఆర్డర్ చేసిన 184 ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ కార్లు జూన్ 30, 2022 నాటికి డెలివరీ చేయబడతాయని భావిస్తున్నారు.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ కారు విషయానికి వస్తే, ఈ అమెరికన్ బ్రాండ్ నుండి అత్యంత పాపులర్ అయిన స్పోర్ట్స్ కారు Mustang GT ని ఆధారంగా చేసుకొని ఈ ఎలక్ట్రిక్ కారును తయారు చేశారు. అయితే, మస్టాంగ్ జిటి స్పోర్ట్స్ కార్ కూప్ స్టైల్ బాడీని కలిగి ఉంటే, ఈ కొత్త Mustang Mach-e ఎలక్ట్రిక్ కారు మాత్రం ఎస్‌యూవీ లేదా క్రాసోవర్ టైప్ బాడీని కలిగి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్లలో ఫోర్డ్ మస్టాంగ్ మాక్-ఇ తో పాటుగా F-150 Lightning (ఎఫ్-150 లైట్నింగ్) అనే ఎలక్ట్రిక్ పికప్ ట్రక్కును కూడా కంపెనీ విక్రయిస్తోంది.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ కారు డిజైన్ దాని పెట్రోల్ వెర్షన్ మస్టాంగ్ మాదిరిగానే ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కూడా స్టాండర్డ్ మస్టాంగ్ తరహాలోనే కూప్ స్టైల్ బాడీ టైప్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో స్టాండర్ మస్టాంగ్ తరహా మాదిరిగా కనిపించే ఫాక్స్ ఫ్రంట్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో కూడిన సన్నటి ఎల్ఈడి ఫాగ్‌ల్యాంప్స్, మస్టాంగ్ స్టైల్ సిగ్నేచర్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, డ్యూయల్ టోన్ రూఫ్, ఆటోమేటిక్ డోర్స్ మరియు స్టైలిష్ అల్లాయ్ వీల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

టెస్లా వంటి ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా ఫోర్డ్ తీసుకువచ్చిన ఈ మాక్-ఇ ఎలక్ట్రిక్ కారు వేర్వేరు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో లభిస్తుంది. యూజర్లు ఎంచుకునే బ్యాటరీ సామర్థ్యాన్ని ఆయా వేరియంట్ల రేంజ్ కూడా వేర్వేరుగా ఉంటుంది. సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ కారులో 68 kWh సామర్థ్యం కలిగిన బ్యాటరీని స్టాండర్డ్ బ్యాటరీ ప్యాక్‌గా అందిస్తారు. అయితే, లాంగ్ రేంజ్ కావాలనుకునేవారు ఇందులో 88 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ను ఎంచుకోవ్చచు.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

మస్టాంగ్ మాక్-ఇ ఎలక్ట్రిక్ ఆల్-వీల్ డ్రైవ్ మరియు రియర్ వీల్ డ్రైవ్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులోని చిన్న బ్యాటరీ యొక్క పూర్తి చార్జ్ పై ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్టంగా 370 కిమీ రేంజ్ ను ఆఫర్ చేస్తుండగా, పెద్ద బ్యాటరీ గరిష్టంగా 483 కిమీ వరకు రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దాని స్టాండర్డ్ పెట్రోల్ యొక్క పనితీరుతో ఏ మాత్రం తీసిపోకుండా కేవలం 3.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 96 కిలోమీటర్ల వేగాన్ని చేరుకోగలదు.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

ఎలక్ట్రిక్ పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 270 బిహెచ్‌పి పవర్ ను మరియు 430 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్‌ లో దీని టార్క్ 580 ఎన్ఎమ్‌ గా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారులోని ఇంటీరియర్స్ చాలా సింపుల్ గా ఉంటాయి. క్యాబన్ లోపల తక్కువ బటన్లతో మంచి ప్రీమియం అప్పీల్ ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ మధ్యలో సెంటర్ కన్సోల్ కి అనుసంధానంగా ఇందులో నిలువుగా అమర్చిన ఓ పెద్ద 15 ఇంచ్ వెర్టికల్ టచ్‌స్క్రీన్ యూనిట్ ఉంటుంది.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

టెస్లా కార్ల మాదిరిగానే ఈ టచ్‌స్క్రీన్ కారు యొక్క రిమోట్ కంట్రోల్ మాదిరిగా పనిచేస్తుంది. దీని సాయంతోనే ఈ ఎలక్ట్రిక్ కారులోని అనేక ఫీచర్లను నియంత్రించవచ్చు. అమెరికా మార్కెట్లో Ford Mustang Mach-e ప్రారంభ ధర 42,895 డాలర్లు (పన్ను రాయితీ కలపకుండా) గా ఉంటుంది. అంటే మనదేశ కరెన్సీలో ప్రస్తుత మారకపు విలువ ప్రకారం, సుమారు రూ. 31.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. న్యూయార్క్ పోలీసుల కోసం ఈ ధరలో డిస్కౌంట్ కూడా లభించి ఉండే చాన్స్ ఉంది.

Ford Mustang Mach-e ఎలక్ట్రిక్ కారును పోలీస్ కార్‌గా ఉపయోగించనున్న ఎన్‌వైపిడి

అమెరికన్ మార్కెట్లో Ford Mustang Mach-e మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి - సెలక్ట్, ప్రీమియం, కాలిఫోర్నియా రూట్ 1 మరియు జిటి) లభిస్తుంది. కస్టమర్ ఎంచుకునే వేరియంట్‌ను బట్టి దాని రేంజ్ మరియు ఫీచర్లు మారుతూ ఉంటాయి. ఇదొక 5 సీటర్ ఎస్‌యూవీ మరియు ఇందులో స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ మస్టాంగ్ కన్నా మెరుగైన క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. ఈ కారులో 3 స్పోక్ స్పోర్టీ మల్టీ-ఫంక్షన్ స్టీరింగ్ వీల్, పానోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా, పవర్ టెయిల్ గేట్, యాంటీలాక్ బ్రేక్ సిస్టమ్, క్రూయిజ్ కంట్రోల్ వంటి పలు సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

Most Read Articles

Read more on: #ఫోర్డ్ #ford
English summary
Nypd to add 184 ford mustang mach e electric sports cars to their fleet
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X