Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

కొరియన్ కార్ కంపెనీ హ్యుందాయ్ (Hyundai) ప్రస్తుత పండుగ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని తమ కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. అక్టోబర్ 2021 నెలలో హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 50,000 వరకు డిస్కౌంట్ లను పొందవచ్చు.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

ఈ నెలలో హ్యుందాయ్ ఆరా, గ్రాండ్ ఐ10 నియోస్, శాంత్రో మరియు ఐ20 మోడళ్లపై కంపెనీ డిస్కౌంట్లను అందిస్తోంది. గత నెలలో కంపెనీ అమ్మకాలు భారీగా క్షీణించిన నేపథ్యంలో, ఈ పండుగ సీజన్‌లో అమ్మకాలను మెరుగుపరిచేందుకు కస్టమర్ల కోసం కంపెనీ ఈ ఆకర్షణీయమైన ఆఫర్లను తీసుకొచ్చింది.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ (Hyundai Grand i10 Nios)

హ్యుందాయ్ నుండి లభిస్తున్న ప్రీమియం ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్ పై కంపెనీ ఈ నెలలో రూ. 50,000 తగ్గింపులను అందిస్తోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ యొక్క 1197 సిసిస పెట్రోల్ ఇంజన్, మాన్యువల్ గేర్‌బాక్స్‌ వేరియంట్ లీటరుకు 21 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజ్ ను అందిస్తుంది. కాబట్టి, ఇది చిన్న కుటుంబాలకు బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కారుగా ఉంటుంది.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

హ్యుందాయ్ ఆరా (Hyundai Aura)

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ హ్యాచ్‌బ్యాక్ ఆధారంగా రూపుదిద్దుకున్న కాంపాక్ట్ సెడాన్ హ్యుందాయ్ ఆరా పై కూడా కంపెనీ ఈ నెలలో రూ. 50,000 వరకూ తగ్గింపులను అందిస్తోంది. ఈ విభాగంలో అందుబాటులో ఉన్న గొప్ప సెడాన్లలో హ్యుందాయ్ ఆరా కూడా ఒకటి. కంపెనీ సర్టిఫై చేసిన దాని ప్రకారం, హ్యుందాయ్ ఆరా లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. అయితే, వాస్తవ ప్రపంచంలో దాని మైలేజ్ 16 - 18 kmpl గా ఉండొచ్చని అంచనా.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

హ్యుందాయ్ శాంట్రో (Hyundai Santro)

హ్యుందాయ్ నుండి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎంట్రీ లెవల్ కారు శాంత్రో. ఇది ఈ విభాగంలో మారుతి సుజుకి ఆల్టోకి పోటీగా ఉంటుంది. అక్టోబర్ 2021 నెలలో హ్యుందాయ్ శాంత్రో కారుపై కంపెనీ రూ. 40,000 వరకూ తగ్గింపులను అందిస్తోంది. హ్యుందాయ్ శాంత్రో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్లు రెండూ కూడా లీటరుకు 20.3 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని ఇస్తాయి. అదే సమయంలో, దాని సిఎన్‌జి వేరియంట్ కేజీకి 30.5 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. మైలేజ్ పరంగా ఈ కారు చాలా మెరుగ్గా ఉంటుంది.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

హ్యుందాయ్ ఐ20 (Hyundai i20)

ఇకపోతే, హ్యుందాయ్ అందిస్తున్న పాపులర్ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ హ్యుందాయ్ ఐ20 కారుపై కంపెనీ ఈ నెలలో రూ. 40,000 వరకూ తగ్గింపు అందించనుంది. గత నెలలో కంపెనీ ప్రోడక్ట్ లైనప్‌ లోని మొత్తం అమ్మకాలలో రెండవ స్థానంలో నిలిచిన ప్రముఖ మోడల్ ఐ20. హ్యుందాయ్ ఐ20 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌ వేరియంట్లు లీటరుకు 20.25 కిలోమీటర్ల మైలేజీని ఇస్తాయి. అలాగే, ఇందులోని 1.2 లీటర్ న్యాచురల్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లు లీటరుకు 20.35 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీని అందిస్తాయి.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

కొత్త హ్యుందాయ్ ఐ20 డీజిల్ ఇంజన్ ఆప్షన్ తో కూడా లభిస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ లోని 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ వేరియంట్లు లీటరుకు అత్యధికంగా 25.2 కిలోమీటర్ల మైలేజీనిస్తాయి. కొత్త హ్యుందాయ్ ఐ20 యొక్క అన్ని వేరియంట్లు కూడా 37 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తాయి.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

కొత్త హ్యుందాయ్ ఐ20 కారులో లభించే ఫీచర్లు మరియు పరికరాలను గమనిస్తే, ఈ కారులో ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి టెయిల్ లైట్లు, 16 ఇంచ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబల్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్స్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 10.25 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, Apple CarPlay, Android Auto మరియు BlueLink కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, యాంబియంట్ లైటింగ్ మరియు బోస్ సరౌండ్ ఆడియో సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

ఇక, కొత్త హ్యుందాయ్ ఐ20 క్యాబిన్ లోపల లభించే ఫీచర్ల విషయానికి వస్తే, దీని డాష్‌బోర్డ్ లేవుట్ మునుపటి మోడళ్ల కన్నా చాలా కొత్త రూపాన్ని కలిగి ఉంటుంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, సౌకర్యవంతమైన సీట్లు మరియు ప్రయాణీకులందరికీ తగినంత క్యాబిన్ స్పేస్ లభిస్తుంది. హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో గట్టి పట్టును కలిగి ఉంది.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

సెప్టెంబర్ 2021 లో క్షీణించిన హ్యుందాయ్ అమ్మకాలు..

సెప్టెంబర్ 2021 నెలలో హ్యుందాయ్ అమ్మకాలు భారీగా క్షీణించాయి. సెప్టెంబర్ 2020 నెలలో హ్యుందాయ్ 50,313 యూనిట్లను విక్రయించగా, సెప్టెంబర్ 2021 నెలలో 33,087 యూనిట్లను మాత్రమే విక్రయించింది. ఈ సమయంలో హ్యుందాయ్ అమ్మకాలు 34 శాతం మేర క్షీణించాయి. అలాగే, కంపెనీ మార్కెట్ వాటా కూడా 17.80 శాతానికి తగ్గింది.

Hyundai కార్లపై అక్టోబర్ ఆఫర్స్: i10, i20, Santro, Aura మోడళ్లపై డిస్కౌంట్స్!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం

గత నెల ప్రతికూల ప్రభావాన్ని మరియు రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని, హ్యుందాయ్ తమ కార్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. అమ్మకాల తగ్గుదల నుండి కోలుకునేందుకు మరియు కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు కంపెనీ వివిధ రకాల స్కీమ్ లతో ముందుకు వచ్చింది. మరి ఇది ఈ నెల అమ్మకాలపై ఎంత మేర ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.

More from DriveSpark

Article Published On: Wednesday, October 6, 2021, 11:10 [IST]
English summary
October 2021 offers on hyundai cars grand i10 nios i20 santro aura details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+