మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

క్యాబ్ సేవల రంగంలో ప్రసిద్ధిగాంచిన సంస్థ ఓలా క్యాబ్స్, గత నెలలో భారత మార్కెట్లో 'ఓలా కార్స్' (Ola Cars) పేరుతో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ కస్టమర్ల నుండి పాత కార్లను కొనుగోలు చేస్తుంది అలాగే కస్టమర్లకు పాత/వాడిన సెకండ్ హ్యాండ్ (ప్రీ-ఓన్డ్) కార్లను విక్రయిస్తుంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ప్రస్తుతం ఓలా కార్స్ సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయ సేవలు దేశంలోని 7 ప్రధాన నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. ఓలా కార్స్ ను ప్రారంభించిన మొదటి నెలలోనే కంపెనీ 5,000 సెకండ్ హ్యాండ్ (ప్రీ-ఓన్డ్) కార్లను విక్రయించింది. రానున్న రోజుల్లో ఓలా కార్స్‌ సేవలను దేశంలోని 100 నగరాలకు విస్తరిస్తామని కంపెనీ తెలిపింది. ఇందుకోసం వచ్చే 12 నెలల్లో 10,000 మంది ఉద్యోగుల్ని నియమించుకోనున్నట్లు ఓలా కార్స్ పేర్కొంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఈ వారం చివరిలోగా ఓలా కార్స్ మరో నాలుగు నగరాల్లో ఈ వ్యాపారాన్ని ప్రారంభించబోతోంది. ప్రస్తుతం ఓలా కార్స్ సేవలు ఢిల్లీ, ముంబై, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు అహ్మదాబాద్ వంటి నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. మరకొద్ది రోజుల్లోనే ఈ వ్యాపారం చండీగఢ్, జైపూర్, కోల్‌కతా మరియు ఇండోర్ వంటి నగరాల్లో ప్రారంభమవుతుంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయం మరియు కొనుగోలు కోసం ఓలా కార్స్ ఓ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ ను డిజైన్ చేసింది. అంతేకాకుండా, వాడిన కార్లను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల కోసం కంపెనీ ట్రై అండ్ బై (Try and Buy) పేరుతో కస్టమర్ల ఇంటి వద్దకే ఈ సేవలను అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ఓలా కార్స్ నుండి సెకండ్ హ్యాండ్ కారును కొన్న కస్టమర్లు, అది నచ్చకపోతే 7 రోజుల్లో కారును తిరిగి ఇచ్చేయవచ్చు.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఓలా కార్స్ తమ వినియోగదారులకు అనేక రకాల వాహన సంబంధిత సేవలను అందిస్తోంది. వీటిలో వెహికల్ ఫైనాన్సింగ్ మరియు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, వెహికల్ చెకప్, ఎక్విప్‌మెంట్ అలాగే వెహికల్ రీసేల్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. కార్ల కొనుగోలు మరియు విక్రయాలను సులభతరం చేయాలనుకునే కస్టమర్ల కోసం ఇది ఒక స్టాప్-షాప్ ప్లాట్‌ఫామ్ అని కంపెనీ చెబుతోంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఓలా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లో ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంటుంది. ఓలా యాప్ సాయంతో కస్టమర్లు తమ ఇంటి వద్ద నుండే వాడిన కార్లను కొనుగోలు చేయవచ్చు లేదా తమ పాత కార్లను కంపెనీకి విక్రయించవచ్చు. ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభంలో వినియోగదారులకు సెకండ్ హ్యాండ్ వాహనాలను అందిస్తుంది మరియు క్రమంగా ఓలా ఎలక్ట్రిక్ మరియు ఇతర బ్రాండ్ల నుండి కొత్త వాహనాలను కూడా పరిచయం చేస్తుంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా, పాత వాహనాలను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న పాత పద్ధతుల్లో మార్పు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇది పూర్తిగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ కావడంతో, కంపెనీ ఇప్పటికే అందుబాటులో ఉన్న కస్టమర్ విభాగాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటోంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఫలితంగా, కంపెనీ మొదటి నెలలోనే మంచి సంఖ్యలో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించింది. గత కొన్ని నెలల్లో సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ వ్యాపారం జోరందుకుంది. ఈ వ్యాపారంలోకి కొత్తగా వచ్చిన ఓలా కార్స్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న డ్రూమ్, కార్‌దేఖో మరియు కార్స్ 24 వంటి ఇతర కార్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ లతో పోటీపడుతుంది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

భారత సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్లో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఓలా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ భారత మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయిస్తోంది. మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కార్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం కార్లు మరియు ఇంధన ధరలు పెరగడమే. ఈ కారణంగా ప్రజలు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ కార్ల వైపు ఆకర్షితులవుతున్నారు.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఓలా తమ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడుతూ, రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఓలా భవిష్యత్ ప్రణాళికల గురించి ఆ కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల పర్యావరణ వ్యవస్థను సృష్టించే ప్రణాళిక గురించి ఆయన వివరించారు.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

తమ కంపెనీ ప్రణాళికలను వెల్లడిస్తూ, త్వరలో ఓలా ఎలక్ట్రిక్ బైక్ మరియు కార్ విభాగంలోకి కూడా ప్రవేశిస్తుందని ఆయన అన్నారు. ప్రజలలో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల సానుకూలత పెరుగుతోందని ఆయన చెప్పారు. అందువల్ల, భవిష్యత్తులో వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం మరియు నాలుగు చక్రాల వాహనాల డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ప్రతి వ్యక్తిగత వాహన విభాగంలో కస్టమర్ల డిమాండ్‌ను తీర్చడానికి తాము సిద్ధంగా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నామని, రాబోయే కొన్ని సంవత్సరాలలో ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మరియు కార్లతో తమ EV (ఎలక్ట్రిక్ వెహిలక్) శ్రేణిని విస్తరించబోతున్నామని భవీష్ చెప్పారు. ఓలా గత నెలలో తమ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ మోడళ్లు, ఓలా ఎస్ 1 మరియు ఎస్ 1 ప్రోలను భారతదేశంలో విడుదల చేసింది.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

ఈ రెండు స్కూటర్ల అమ్మకం (ప్రీ-బుకింగ్స్) ద్వారా ఓలా ఎలక్ట్రిక్ కేవలం రెండు రోజుల్లోనే రూ. 1,100 కోట్ల విలువైన ఆర్డర్లను దక్కించుకుంది. ప్రస్తుతం, ఈ స్కూటర్ల ప్రీ-బుకింగ్ లను కంపెనీ తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, ఆసక్తిగల కస్టమర్లు కంపెనీ వెబ్‌సైట్ లో రూ. 499 టోకెన్ అడ్వాన్స్ చెల్లించి, ఏదైనా స్కూటర్ ను రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కావాలనుకుంటే, ఈ స్కూటర్ రిజర్వేషన్ లో మార్పులు కూడా చేసుకోవచ్చు.

మొదటి నెలలోనే 5000 సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించిన Ola Cars

కాగా, నవంబర్ 1, 2021 వ తేదీ నుండి ఓలా ఎలక్ట్రిక్ తిరిగి తమ స్కూటర్ల అమ్మకాలను తిరిగి ప్రారంభిస్తుందని సమాచారం. గత సెప్టెంబర్ 15 మరియు సెప్టెంబర్ 16 వ తేదీలలో కంపెనీ ఈ స్కూటర్ కోసం బుకింగ్ లను అధికారికంగా ప్రారంభించింది. ఆ సమయంలో కంపెనీ ప్రతి సెకనుకు 4 ఎలక్ట్రిక్ స్కూటర్ల చొప్పున విక్రయించింది.

More from DriveSpark

Article Published On: Friday, October 22, 2021, 15:41 [IST]
English summary
Ola cars sold 5000 pre owned cars in first month details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+