ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ప్రముఖ క్యాబ్ సేవల తయారీ సంస్థ ఓలా క్యాబ్స్, భారత మార్కెట్లో 'ఓలా కార్స్' (Ola Cars) పేరుతో సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించింది. ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా కంపెనీ కస్టమర్ల నుండి పాత కార్లను కొనుగోలు చేస్తుంది అలాగే కస్టమర్లకు పాత/వాడిన కార్లను విక్రయిస్తుంది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

గత నెల (సెప్టెంబర్) ఆరంభంలో కంపెనీ ప్రీ-ఓన్డ్ కార్ బిజినెస్‌లోకి ప్రవేశించాలని యోచిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసినదే. కాగా, ఇప్పుడు దేశంలో అధికారికంగా తమ వ్యాపారాన్ని ప్రారంభించినట్లు కంపెనీ తెలిపింది. ఇందులో భాగంగా, కంపెనీ ఓ కారు కొనుగోలు ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది. ఓలా స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌లో ఈ ప్లాట్‌ఫామ్ అందుబాటులో ఉంటుంది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఓలా యాప్ సాయంతో కస్టమర్లు తమ ఇంటి వద్ద నుండే వాడిన కార్లను కొనుగోలు చేయవచ్చు లేదా తమ పాత కార్లను కంపెనీకి విక్రయించవచ్చు. వాడిన కార్లను విక్రయించడం కోసం కంపెనీ ట్రై అండ్ బై (Try and Buy) పేరుతో కస్టమర్ల ఇంటి వద్దకే ఈ సేవలను అందించబోతోంది. బెంగుళూరుకు చెందిన ఓలా కంపెనీ వచ్చే ఏడాది నాటికి ఈ ప్లాట్‌ఫామ్‌ని దేశంలోని 100 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ప్రారంభంలో వినియోగదారులకు సెకండ్ హ్యాండ్ వాహనాలను అందిస్తుంది మరియు క్రమంగా ఓలా ఎలక్ట్రిక్ మరియు ఇతర బ్రాండ్ల నుండి కొత్త వాహనాలను కూడా పరిచయం చేస్తుంది. అతి త్వరలోనే ఈ సేవలు 30 నగరాల నుండి ప్రారంభమవుతాయని మరియు వచ్చే ఏడాది నాటికి 100 కి పైగా నగరాలకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఈ వ్యాపారంలోకి కొత్తగా వచ్చిన ఓలా కార్స్, ఇప్పటికే మార్కెట్లో ఉన్న డ్రూమ్, కార్‌దేఖో మరియు కార్స్ 24 వంటి ఇతర కార్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ లతో పోటీపడుతుంది. ఓలా కార్స్ ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా కస్టమర్లకు అనేక రకాల వాహన సంబంధిత సేవలను అందిస్తుంది. వీటిలో వెహికల్ ఫైనాన్సింగ్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, వెహికల్ చెకప్, ఎక్విప్‌మెంట్ మరియు వెహికల్ రీసేల్ సౌకర్యాలు ఉంటాయి.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

కార్ల కొనుగోలు మరియు విక్రయాలను సులభతరం చేయాలనుకునే కస్టమర్ల కోసం ఇదొక వన్ స్టాప్ షాప్ ప్లాట్‌ఫామ్ అని కంపెనీ తెలిపింది. ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ద్వారా వాహనాలను కొనుగోలు చేయడానికి మరియు విక్రయించడానికి ప్రస్తుతం అవలంభిస్తున్న పాత పద్ధతుల్లో మార్పు తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఈ విషయం గురించి ఓలా సంస్థ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ భవీష్ అగర్వాల్ మాట్లాడుతూ, వాహనాలు కొనుగోలు చేసే పాత పద్ధతి విషయంలో వినియోగదారులు ఇకపై సంతృప్తి చెందరని, ఈ విషయంలో వారు ఇప్పుడు మరింత పారదర్శకమైన మరియు డిజిటల్ అనుభవాన్ని కోరుకుంటున్నారని అన్నారు. వారి అవసరాలకు మరియు అంచనాలకు అనుగుణంగా ఓలా కార్స్ ప్లాట్‌ఫామ్ ఉంటుందని చెప్పారు.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఓలా కార్స్ యొక్క ట్రై అండ్ బై విధానం ద్వారా, కంపెనీ కస్టమర్లకు విక్రయించే సెకండ్ హ్యాండ్ కార్లను నేరుగా వారు ఉన్న చోటకే తీసుకువస్తుంది. కస్టమర్లు ఆ సెకండ్ హ్యాండ్ కార్లను నడిపి చూసి సంతృప్తి చెందిన తర్వాతనే కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా, సెకండ్ హ్యాండ్ కార్ల కొనుగోలును సులభతరం చేయడం కోసం కంపెనీ ఈఎమ్ఐ సేవలను మరియు ఒక సంవత్సరం వారంటీని కూడా అందించనుంది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఇదిలా ఉంటే, ఓలా తమ ఎలక్ట్రిక్ వాహనాల వ్యాపారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని చూస్తోంది. ఇందుకోసం, కంపెనీ ఓ సమగ్ర ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. ఇందులో భాగంగా, ఓలా ఎలక్ట్రిక్ సంస్థ రాబోయే కొన్నేళ్లలో మరిన్ని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను తయారు చేయడంతో పాటుగా, ఎలక్ట్రిక్ త్రీవీలర్లు మరియు ఫోర్ వీలర్ల (కార్ల) ఉత్పత్తిని కూడా ప్రారంభించనుంది.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

భారతదేశంలో ఓలా నిర్మిస్తున్న ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఎలక్ట్రిక్ టూవీలర్ ప్లాంట్ (ఓలా గిగా ఫ్యాక్టరీ) లో తయారయ్యే ఉత్పత్తులను కంపెనీ బయటి దేశాలకు ఎగుమతి చేయాలని చూస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తమ ఆర్థిక అవసరాల కోసం 200 మిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1,483 కోట్లకు) పైగా నిధులను సమీకరించిన సంగతి తెలిసినదే.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఓలా ఎలక్ట్రిక్ అతి త్వరలోనే ఓ IPO ని కూడా ప్రారంభించాలని యోచిస్తోంది, దానికంటే ముందు రుణదాతలు కంపెనీకి సుమారు 3 బిలియన్ డాలర్ల విలువను ఇచ్చారు. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్కెట్లో లాంచ్ తరువాత, కంపెనీ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు భవీష్ అగర్వాల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు మరియు కార్ల తయారీలో కూడా తమ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు చెప్పారు.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

ఓలా సమీకరించిన ఈ నిధులు కంపెనీ యొక్క భవిష్యత్తు ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్లడానికి సహకరిస్తాయి. భారతదేశంలో పెట్రోల్‌తో నడిచే వాహనాలకు ప్రత్యామ్నాయం అందిస్తామని ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ గతంలో అన్నారు. ఇందులో భాగంగా, చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు మరియు ఎలక్ట్రిక్ కార్లను కూడా విడుదల చేయడానికి ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు.

ఓలా నుండి పాత కార్లు కొనడానికి సిద్ధంగా ఉన్నారా? వ్యాపారం ప్రారంభించిన Ola Cars

భవీష్ అగర్వాల్ ప్రకారం, ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాల పట్ల సానుకూలత క్రమంగా పెరుగుతోంది. ఫలితంగా, భవిష్యత్తులో వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనాలకు డిమాండ్ ఖచ్చితంగా పెరుగుతుంది. దీని కోసం, ఓలా ఎలక్ట్రిక్ ప్రతి వ్యక్తిగత వాహన విభాగంలో వినియోగదారుల డిమాండ్‌ను తీర్చడానికి సిద్ధంగా ఉండేందుకు ప్లాన్ చేస్తోంది.

Most Read Articles

English summary
Ola cars starts pre owned cars business in india details
Story first published: Friday, October 8, 2021, 16:30 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X